• TFIDB EN
  • Editorial List
    CHIRANJEEVI- RAJINIKANTH: చిరంజీవి, రజనీకాంత్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    Dislike
    2k+ views
    6 months ago

    చిరంజీవి, రజనీకాంత్ అంటే తెలుగు, తమిళరాష్ట్రాల ప్రేక్షకులకు ఆరాధ్యులు. వారి వారి స్టైల్, యాక్షన్, డ్యాన్స్‌తో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. స్క్రీన్‌పై తమదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయితే ఇద్దరు లెజెండరీ హీరోలు కలిసి నటించారన్న సంగతి మీకు తెలుసా? అవును మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు పూర్తి స్తాయి సినిమాల్లో నటించారు. మరి ఆ సినిమాలెంటో ఓసారి చూద్దాం

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కాళి(సెప్టెంబర్ 19 , 1980)
    A|144 minutes|యాక్షన్,డ్రామా
    జైలు నుండి విడుదలైన తర్వాత, కాళి తన కుటుంబ సభ్యుల మరణానికి కారణమైన ధనిక వ్యాపారవేత్త రాజారావుపై ప్రతీకారం తీర్చుకునేందుకు బయల్దేరుతాడు.

    చిరంజీవి, రజనీకాంత్ తొలిసారి మల్టిస్టారర్‌గా నటించిన చిత్రం కాళి. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడింది. ఈ చిత్రాన్ని ఎస్పీ ముత్తురామన్ డైరెక్ట్ చేశారు. కాళి సినిమా తెలుగులో 1980 సెప్టెంబర్ 19న విడుదల కాగా.. తమిళంలో జులై 3న విడుదలైంది. కాళి సినిమాలో రజనీకాంత్ లీడ్ రోల్‌లో నటించారు. తెలుగులో చిరంజీవి పోషించిన పాత్రను తమిళ్‌లో విజయ్ కుమార్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం సాధించింది. రజినీకాంత్ సరసన తెలుగు హీరోయిన్ సీమా నటించింది.

    2 . బందిపోటు సింహం(అక్టోబర్ 26 , 1981)
    A|152 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
    ఈ మూవీలో చిరంజీవి, రజనీకాంత్‌ ప్రాణ స్నేహితులుగా చేశారు. చిరంజీవి, రజనీకాంత్ మధ్య వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను రంజింపజేస్తాయి. రజనీ సరసన శ్రీదేవీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

    మరోసారి ఎస్పీ ముత్తురామన్ డైరెక్షన్‌లో చిరంజీవి, రజనీకాంత్ కలిసి నటించారు. రజనీకాంత్ యువ సైనికుడు పాత్రలో మెప్పించగా... చిరంజీవి దొంగ క్యారెక్టర్‌లో నటించారు. వీరిద్దరు ప్రాణ స్నేహితులుగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చిరంజీవి, రజనీకాంత్ మధ్య వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను రంజింపజేస్తాయి. కాగా రజనీకాంత్ సరసన శ్రీదేవీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తర్వాత మళ్లీ చిరంజీవి, రజనీకాంత్ కలయికలో మరో సినిమా రాలేదు. ఆ తర్వాత ఇద్దరు తమ తన సినిమాలతో బిజీ అయ్యారు. స్టార్ డామ్ వచ్చిన తర్వాత.. చిరంజీవి తెలుగులో, రజనీకాంత్ తమిళ్‌లో నంబర్ 1 స్థానాన్ని అనుభవించారు. స్టార్ డామ్ వచ్చిన తర్వాత చిరంజీవి నటించిన రాజా విక్రమార్క సినిమాలో రజనీకాంత్ నటించాల్సి ఉండగా కుదరలేదు.


    @2021 KTree