• TFIDB EN
  • Editorial List
    Chiranjeevi Top 10 Action Movies: చిరంజీవి ఉత్తమ 10 యాక్షన్ చిత్రాలు
    Dislike
    1 Likes 2k+ views
    1 year ago

    చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నవ రసాలను తెరపై పండించగల నేర్పరి. అందులోనూ పోరాట సన్నివేశాల్లో తనదైన మ్యానరిజంను చూపించాడు. యాక్షన్ మూవీస్‌లో తన మార్క్ స్టైల్‌ని సెట్ చేసి ట్రెండ్ సృష్టించాడు. తన కెరీర్‌లో 150కు పైగా సినిమాలు చేశాడు చిరంజీవి. వీటిలో యాక్షన్ మూవీస్‌ని లెక్కపెట్టడం కాస్త కష్టమే. అయితే, జనాదరణను పొందిన యాక్షన్ మూవీస్ ఏంటో చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . సైరా నరసింహా రెడ్డి(అక్టోబర్ 02 , 2019)
    UA|170 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ
    2 . ఇంద్ర(జూలై 24 , 2002)
    U|173 minutes|యాక్షన్
    రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
    3 . చూడాలని వుంది(ఆగస్టు 27 , 1998)
    U|148 minutes|థ్రిల్లర్
    తన తండ్రి పంపిన గూండాల బారి నుంచి భర్త రామకృష్ణను కాపాడే క్రమంలో ప్రియా చనిపోతుంది. అక్రమ కేసులో ఇరుక్కొని రామకృష్ణ జైలుకు వెళ్లగా అతడి కొడుకును ప్రియా నాన్న తీసుకెళ్తాడు. బయటకొచ్చిన రామకృష్ణ ఓ మహిళ సాయంతో తన బిడ్డను ఎలా దక్కించుకున్నాడు అన్నది కథ.
    4 . రౌడీ అల్లుడు(అక్టోబర్ 18 , 1991)
    U|డ్రామా,థ్రిల్లర్
    కళ్యాణ్ ఒక పారిశ్రామికవేత్త, అతని శత్రువులు కుట్ర పన్ని అతని స్థానంలో జానీ అనే మోసగాడిని పంపిస్తారు. అయితే కళ్యాణ్ అమాయకత్వాన్ని తెలుసుకున్న జానీ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.
    5 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
    6 . కొండవీటి దొంగ(మార్చి 09 , 1990)
    U|151 minutes|యాక్షన్,థ్రిల్లర్
    రాజా అనే గిరిజన యువకుడు తన విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తమ గూడెం వారిని స్థానిక గూండాలు హింసించడాన్ని గమనిస్తాడు. వారి అన్యాయాలను ఎదుర్కొనేందుకు కొండవీటి దొంగగా మారతాడు.
    7 . యముడికి మొగుడు(ఏప్రిల్ 29 , 1988)
    U|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    కాళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కాళిని చంపిస్తాడు. దీంతో అతను యమలోకానికి వెళ్తాడు. అక్కడ యముడితో గొడవపడి తిరిగి మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి తన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు.

    కాళి, బాలు డ్యుయల్ రోల్‌లో నటించాడు చిరంజీవి. ఆయష్షు తీరకముందే తనను తీసుకొచ్చారని గమనించిన కాళి యముడితో పోరాడతాడు. దీంతో, అదే రూపంలో ఉన్న బాలు దేహంలోకి కాళి ప్రవేశిస్తాడు. ఫాంటసీ, కామెడీ మేళవింపుతో యాక్షన్ సన్నివేశాలుంటాయి.

    8 . ముఠా మేస్త్రి(జనవరి 17 , 1993)
    U|యాక్షన్,డ్రామా
    బోసు (చిరంజీవి) ఒక దేశభక్తి గలవాడు. కూరగాయల మార్కెట్‌లో కూలివారికి అన్యాయం జరగకుండా కాపాడుతుంటాడు. ఆత్మా (శరత్ సక్సేనా) ఆ ప్రాంతంలో ఒక ముఠా నాయకుడు. బోసు అతనికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. బోసు దేశభక్తిని మెచ్చిన సీఎం (గుమ్మడి వెంకటేశ్వర రావు) అతడ్ని మంత్రిగా చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది అసలు కథ.

    మార్కెట్‌లో పనిచేసే కూలీ మేస్త్రీ రాష్ట్ర మంత్రి వరకు ఎలా ఎదిగాడన్నది సినిమా కథ. ఇందులో సుభాష్ చంద్రబోస్‌గా చిరంజీవి నటించాడు. యాక్షన్, డ్రామాను తెగ పండించాడు.

    9 . ఘరానా మొగుడు(ఏప్రిల్ 09 , 1992)
    U|యాక్షన్,హాస్యం,డ్రామా
    పారిశ్రామికవేత్త కుమార్తె అయిన ఉమకు అహంకారం ఎక్కువ. అయితే తన ఫ్యాక్టరీలో ఎదురు తిరిగిన రాజాకు గుణపాఠం చెప్పాలని అతన్ని వివాహం చేసుకుంటుంది. క్రమంగా అతనితో ప్రేమలో పడుతుంది.

    ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్‌‌గా రాజు పాత్రలో చిరంజీవి నటించాడు. కార్మికుల సంక్షేమం, యజమాని గౌరవానికి పాటు పడే వ్యక్తిగా చిరంజీవి అదరగొట్టాడు. యాక్షన్, డ్రామా సన్నివేశాల్లో మెప్పించాడు.

    10 . ఖైదీ నం. 786(జూన్ 10 , 1988)
    U|యాక్షన్,డ్రామా
    తండ్రికి ఇష్టం లేకుండా ఓ యువతిని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తప్పుడు కేసులో ఇరికించబడుతాడు. అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, తన మామకు గుణపాఠం చెప్పడానికి కష్టపడతాడు.

    చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా సాగుతుంది. ప్రధానంగా పోలీస్ స్టేషనులో వచ్చే ‘సంతకం’ పెట్టే సీన్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఇందులో ‘సూర్యం’ పాత్ర పోషించాడు.


    @2021 KTree