• TFIDB EN
  • అమెజాన్‌ ప్రైమ్‌లో చిరంజీవి హై ఓల్టేజ్ యాక్షన్ మూవీస్
    Dislike
    2k+ views
    6 months ago

    వింటేజ్ చిరంజీవి యాక్షన్‌ చిత్రాలను మీర్‌ మిస్ అవుతున్నారా? ఇక ఆ బాధ అవసరం లేదు. ప్రైమ్‌లో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి మంచి సినిమాల కలెక్షన్ ఉంది. వీటిలో టాప్ యాక్షన్ చిత్రాల లిస్ట్ YouSay TFIDB సేకరించింది. వాటిపై ఇప్పుడే ఓ లుక్‌ వేయండి మరి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
    2 . సైరా నరసింహా రెడ్డి(అక్టోబర్ 02 , 2019)
    U/A|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ
    3 . కొండవీటి దొంగ(మార్చి 09 , 1990)
    U|యాక్షన్,థ్రిల్లర్
    రాజా అనే గిరిజన యువకుడు తన విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తమ గూడెం వారిని స్థానిక గూండాలు హింసించడాన్ని గమనిస్తాడు. వారి అన్యాయాలను ఎదుర్కొనేందుకు కొండవీటి దొంగగా మారతాడు.
    4 . స్టాలిన్(సెప్టెంబర్ 20 , 2006)
    U/A|యాక్షన్
    స్టాలిన్ మాజీ ఆర్మి మేజర్. అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనే మంచి ఆలోచన కలిగి ఉంటాడు. సాయం లభించని ఓ దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకోవడంతో స్టాలిన్‌ తీవ్ర మనోవేదనకు గురవుతాడు. దీంతో సమాజాన్ని మార్చేందుకు ఓ సాయం చేయాలని సూత్రాన్ని కనిపెడుతాడు.
    5 . ముఠా మేస్త్రి(జనవరి 17 , 1993)
    U|యాక్షన్,డ్రామా
    బోసు (చిరంజీవి) ఒక దేశభక్తి గలవాడు. కూరగాయల మార్కెట్‌లో కూలివారికి అన్యాయం జరగకుండా కాపాడుతుంటాడు. ఆత్మా (శరత్ సక్సేనా) ఆ ప్రాంతంలో ఒక ముఠా నాయకుడు. బోసు అతనికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. బోసు దేశభక్తిని మెచ్చిన సీఎం (గుమ్మడి వెంకటేశ్వర రావు) అతడ్ని మంత్రిగా చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది అసలు కథ.
    6 . స్నేహం కోసం(జనవరి 01 , 1999)
    U|యాక్షన్,డ్రామా
    జమీందారు పెద్దయ్య (విజయ కుమార్) దగ్గర నమ్మినబంటు చిన్నయ్య (చిరంజీవి). పెద్దయ్య పెద్ద కూతురు గౌరి (సితార)ని తన బావమరిది పెద్దబ్బాయి (ప్రకాష్ రాజ్)కి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల ఆ కుటుంబం అంటే పెద్దయ్యకి పడదు. చిన్న కూతురు ప్రభావతి (మీనా) విదేశాల్లో చదువుకుని వస్తుంది. అయితే తన తండ్రి ప్రాణంగా ప్రేమిస్తున్న చిన్నయ్య తనను రేప్ చేయబోయాడి ఆరోపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.

    @2021 KTree