• TFIDB EN
  • Editorial List
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?
    Dislike
    200+ views
    4 months ago

    యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ భారీ అంచనాల మధ్య జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ఇండియా రేంజ్‌లో వస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి హాజరై మద్దతు పలకడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో హనుమంతు(తేజా సజ్జా) తన గ్రామం అంజనాద్రిని దుష్ట శక్తుల నుంచి కాపాడుకునేందుకు అంజనేయుడు శక్తులు ప్రసాదిస్తాడు. ఈ శక్తులతో హనుమంతు తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నడానేది కథ. అయితే గతంలో ఇలాంటి చిత్రాల మాదిరి తెలుగులో కొన్ని సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి ఆ చిత్రాలెంటో ఓసారి చూసేయండి మరి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కన్నయ్య కిట్టయ్య(జూన్ 11 , 1993)
    U|145 mins|హాస్యం,ఫాంటసీ
    సాధారణ యువకుడైన కిట్టయ్య తన మరదలు సరోజను ప్రేమిస్తాడు, కానీ అతని మేనమామ అతనిని ఒప్పుకోడు. నిరుత్సాహానికి గురైన కిట్టయ్య తనకు సహాయం చేయమని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు.
    2 . యమదొంగ(ఆగస్టు 15 , 2007)
    U|179 minutes|డ్రామా,ఫాంటసీ
    రాజా ఒక అనాథ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. ఈక్రమంలో ఓ ధనవంతుడి మనవరాలు మహిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసే క్రమంలో మరణిస్తాడు. అతను యమలోకానికి వెళ్లి యమదేవుడితో తన జీవితాన్ని తిరిగిపొందేందుకు అతనితో పోరాడుతాడు.
    3 . యమలీల(ఏప్రిల్ 28 , 1994)
    U|140 minutes|హాస్యం,డ్రామా,ఫాంటసీ
    ఒక యువకుడికి యమ ధర్మరాజుకు చెందిన భవిష్యవాణి పుస్తకం దొరుకుతుంది. దానితో తన కుటుంబం కోల్పోయిన ఆస్తులను చేజిక్కించుకుంటాడు. అయితే ఆ పుస్తకం వల్ల అతనికి ఒక బాధకరమైన నిజం తెలుస్తుంది. ఇదే క్రమంలో యముడు తన భవిష్యవాణి పుస్తకం వెతుక్కుంటూ భూలోకానికి వస్తాడు.
    4 . బ్రో(జూలై 28 , 2023)
    U/A|హాస్యం,డ్రామా
    మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథ
    5 . శ్రీ ఆంజనేయం(జూలై 24 , 2004)
    U/A|174 minutes|డ్రామా,ఫాంటసీ
    హీరో తల్లిదండ్రులను విలన్‌ హత్య చేస్తాడు. ఫలితంగా హీరో చిన్నప్పటి నుంచి అనాథగా పెరుగుతాడు. అయితే హీరో ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. మానవ రూపంలో వచ్చిన హనుమంతుడు హీరోకు ఎలా సాయం చేశాడు? అన్నది కథ.
    6 . ఓరి దేవుడా(అక్టోబర్ 21 , 2022)
    U/A|141 mins|హాస్యం,రొమాన్స్
    అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.
    7 . గోపాల గోపాల(జనవరి 10 , 2015)
    U|153 minutes|హాస్యం,డ్రామా
    నాస్తికుడైన గోపాల రావు తన దుకాణం భూకంపంలో ధ్వంసం కావడంతో దేవుడిపై దావా వేస్తాడు, ఫలితంగా దేవుడు, గోపాలరావు మధ్య జరిగే కొన్ని సంఘటనలు జీవిత పాఠాలను నేర్పుతాయి.
    8 . ఘటోత్కచుడు(మార్చి 31 , 1995)
    U|170 minutes|డ్రామా,ఫాంటసీ
    ఒక చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. అనూహ్యంగా ఆ బేబీ తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోతారు. కొందరు వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేయడానికి యత్నిస్తారు. పాపను రక్షించేందుకు ఘటోత్కచుడు రంగంలోకి దిగుతాడు.
    9 . డమరుకం(నవంబర్ 23 , 2012)
    U/A|157 min|యాక్షన్
    చిన్నతనంలోనే కుటుంబాన్ని పోగొట్టుకున్న మల్లికార్జున... శివుడుపై ద్వేషం పెంచుకుంటాడు. తిరిగి మల్లికార్జున శివభక్తుడు ఎలా అయ్యాడు. అత్యంత బలశాలి అయిన రాక్షసుడ్ని ఎలా సంహరించాడు. హీరోయిన్‌ను రాక్షసుడి బారినుంచి ఎలా రక్షించాడు? అన్నది కథ.

    @2021 KTree