• TFIDB EN
  • Editorial List
    Chiranjeevi Dual Role Movies: చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు
    Dislike
    2k+ views
    1 year ago

    ‘రజినీకాంత్ స్టైల్‌ని, కమల్ హాసన్‌ నటనని కలిపితే చిరంజీవి’ అని నాడు దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కితాబిచ్చారు. చిరంజీవి నటనా కౌశలానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. ఏ పాత్రనైనా ఆకళింపు చేసుకుని సులువుగా నటించేయగల సత్తా మెగాస్టార్‌ది. విభిన్న కోణాలున్న పాత్రలను చేయడంలోనూ దిట్ట. అందుకే చాలా చిత్రాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రలను చేశాడు. డ్యుయల్, ట్రిపుల్ రోల్‌లో నటించిన చిత్రాలేవో తెలుసుకుందాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . రక్త సింధూరం(ఆగస్టు 24 , 1985)
    A|యాక్షన్,డ్రామా
    ఉరిశిక్ష నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక నేరస్థుడు, గోపీ అనే నిజాయితీ గల పోలీసు అధికారిని వడ్డీ వ్యాపారి బంధించిన కార్మికుడిని రక్షించేలా చేస్తాడు.

    పాత్రలు: గండ్ర గొడ్డలి, ఇన్‌స్పెక్టర్ గోపీ(అన్నదమ్ములు)

    2 . సింహపురి సింహం(అక్టోబర్ 20 , 1983)
    U|యాక్షన్,రొమాన్స్
    సింహపురి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాధవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు.

    పాత్రలు: రాజశేఖరం, విజయ్(తండ్రీకొడుకులు)

    3 . బిల్లా రంగా(అక్టోబర్ 15 , 1982)
    UA|113 Minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
    స్మగ్లర్ రవిరాజ్‌ని పట్టుకోవడానికి బిల్లా అనే CID అధికారి రహస్యంగా వెళతాడు. మరోవైపు, రంగా తన భార్య, బిడ్డలను విడిచిపెట్టినప్పుడు, బిల్లా వారిని రంగాతో తిరిగి కలుపుతానని హామీ ఇస్తాడు.

    పాత్రలు: బిల్లా, రంగా(తండ్రీ కొడుకులు)

    4 . నకిలీ మనిషి(ఆగస్టు 01 , 1980)
    A|యాక్షన్,డ్రామా
    ప్రసాద్ అనే యువకుడికి చాలా డబ్బు అవసరం ఉంటుంది. అయితే ఓ పని నిమిత్తం ఆ డబ్బు కోసం చనిపోవడానికి ఒప్పుకుంటాడు. అయితే, సమయం వచ్చినప్పుడు, అతను తన మనసు మార్చుకుంటాడు.

    పాత్రలు: ప్రసాద్, శ్యాం

    5 . రోషగాడు(జూలై 29 , 1983)
    A|యాక్షన్,డ్రామా
    సికిందర్(చిరంజీవి) ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. తరువాత జరిగే వెంటాడే సీనులో సికిందర్ ప్రమాదానికి గురవుతాడు. ఆ తర్వాత సికిందర్‌ పోలికలతో శ్రీకాంత్ వచ్చినప్పుడు అతన్ని స్మగ్లర్లు పట్టుకుంటారు. ఇంతకు శ్రీకాంత్, సికిందర్ ఒక్కరేనా?

    పాత్రలు: సికందర్, శ్రీకాంత్

    6 . జ్వాలా(జూన్ 14 , 1985)
    UA|డ్రామా
    జ్వాల రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన 1985 భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు, రాధిక, సిల్క్ స్మిత మరియు భానుప్రియ. సినిమా స్కోర్‌ని ఇళయరాజా స్వరపరిచారు. ఈ చిత్రాన్ని మలయాళంలో ప్రతీకార జ్వాల పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం కన్నడలో 1987లో సత్యం శివం సుందరం అనే పేరుతో విష్ణువర్ధన్ త్రిపాత్రాభినయంలో (తండ్రి పాత్రతో సహా) ఈ చిత్రానికి భిన్నంగా రీమేక్ చేయబడింది. ఇది ఇళయరాజా పాటలలో ఒకదానిలో జాబితా చేయబడింది.

    పాత్రలు: రాజు, యువరాజు(అన్నదమ్ములు)

    7 . దొంగ మొగుడు(జనవరి 09 , 1987)
    U|యాక్షన్,డ్రామా
    ఓ సంపన్నవ్యాపారవేత్త జీవితంలో నిత్యం వేధించే భార్య, తల్లి వల్ల సంతోషం లేకుండా పోతుంది. అచ్చం ఆ వ్యాపారవేత్తను పోలి ఉన్న వ్యక్తి వల్ల అతని భార్యలో మార్పు వస్తుంది.

    పాత్రలు: రవితేజ, నాగరాజు

    8 . యముడికి మొగుడు(ఏప్రిల్ 29 , 1988)
    U|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    కాళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కాళిని చంపిస్తాడు. దీంతో అతను యమలోకానికి వెళ్తాడు. అక్కడ యముడితో గొడవపడి తిరిగి మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి తన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు.

    పాత్రలు: కాళీ, బాలు

    9 . స్టేట్ రౌడీ(మార్చి 23 , 1989)
    U|యాక్షన్,డ్రామా
    పోలీసు అధికారి కావాలనుకున్న ఓ యువకుడు అవినీతి రాజకీయాల వల్ల తన కలను నెరవేర్చుకోలేకపోతాడు. దీంతో తన జీవిత గమనాన్ని మార్చుకుంటాడు. అతను చట్టానికి వ్యతిరేకంగా మారి.. ఎలాంటి పనులు చేశాడన్నది కథ.

    పాత్రలు: కాళిచరణ్, పృథ్వీ

    10 . రౌడీ అల్లుడు(అక్టోబర్ 18 , 1991)
    U|డ్రామా,థ్రిల్లర్
    కళ్యాణ్ ఒక పారిశ్రామికవేత్త, అతని శత్రువులు కుట్ర పన్ని అతని స్థానంలో జానీ అనే మోసగాడిని పంపిస్తారు. అయితే కళ్యాణ్ అమాయకత్వాన్ని తెలుసుకున్న జానీ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

    పాత్రలు: కళ్యాణ్, జానీ

    11 . ముగ్గురు మొనగాళ్లు(జనవరి 07 , 1994)
    U|యాక్షన్,డ్రామా
    ముగ్గురు కవల సోదరులు తమ తండ్రిని హత్య చేసిన దుండగుడి వల్ల పుట్టుకతోనే విడిపోతారు. వారు పెరిగి పెద్దయ్యాక కలుసుకుని తమ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయల్దేరుతారు.

    పాత్రలు: విక్రమ్, పృథ్వీ, దత్తాత్రేయ(కవల సోదరులు)

    12 . స్నేహం కోసం(జనవరి 01 , 1999)
    U|యాక్షన్,డ్రామా
    జమీందారు పెద్దయ్య (విజయ కుమార్) దగ్గర నమ్మినబంటు చిన్నయ్య (చిరంజీవి). పెద్దయ్య పెద్ద కూతురు గౌరి (సితార)ని తన బావమరిది పెద్దబ్బాయి (ప్రకాష్ రాజ్)కి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల ఆ కుటుంబం అంటే పెద్దయ్యకి పడదు. చిన్న కూతురు ప్రభావతి (మీనా) విదేశాల్లో చదువుకుని వస్తుంది. అయితే తన తండ్రి ప్రాణంగా ప్రేమిస్తున్న చిన్నయ్య తనను రేప్ చేయబోయాడి ఆరోపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.

    పాత్రలు: సింహాద్రి, చిన్నయ్య(తండ్రీ కొడుకులు)

    13 . అందరివాడు(జూన్ 04 , 2005)
    UA|162 minutes|హాస్యం
    గోవిందరాజులు (చిరంజీవి) అనే మేస్త్రికి టెలివిజన్ షోను నడిపించే సిద్ధార్థ్ (చిరంజీవి) కుమారుడు. సిద్ధార్థ్ చిన్నతనంలోనే తల్లి మరణిస్తే గోవిందరాజులు తన కొడుకు కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుండా అతన్ని ప్రేమగా పెంచుతాడు. సిద్ధార్థ్ ఒక టీవీ ఛానల్‌లో రిపోర్టరుగా పనిచేస్తుంటాడు. అయితే, సిద్ధార్థ్ ఓ కాంట్రాక్టర్ కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత గోవిందరాజులు దూరమయ్యే అవకాశం ఏర్పడుతుంది.

    పాత్రలు: సిద్ధార్థ్, గోవింద రాజు(తండ్రీ కొడుకులు)

    14 . ఖైదీ నం. 150(జనవరి 11 , 2017)
    UA|141 minutes|యాక్షన్,డ్రామా
    బొడ్డు శ్రీను జైలు నుంచి పారిపోయే క్రమంలో తనలాగే ఉన్న మరొ వ్యక్తి తారసపడుతాడు. ప్రమాదంలో గాయపడిన అతనికి వైద్యం అందించి అతని స్థానంలో రైతుల భూముల కోసం కార్పోరేట్ శక్తులతో పోరాడుతాడు. ఈ పోరాటంచో బొడ్డు శ్రీను ఏం సాధించాడు అనేది కథ.

    పాత్రలు: కత్తి శ్రీను, కొణిదెల శివశంకర వరప్రసాద్


    @2021 KTree