• TFIDB EN
  • Editorial List
    త్రివిక్రమ్- మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు
    Dislike
    20+ views
    19 days ago

    తెలుగులో త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోకు మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఏంటో ఇక్కడ చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గుంటూరు కారం(జనవరి 12 , 2024)
    UA|యాక్షన్,డ్రామా
    రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల అతని తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లికి దూరంగా 25 ఏళ్లు పెరిగిన తర్వాత తిరిగి ఆమె ప్రస్తావన వస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతాయి. మరి రమణ తన తల్లిని కలిశాడా? లేదా? అసలు వసుంధర తన కొడుకును ఎందుకు దూరం పెట్టింది ? ఇద్దరి మధ్య దూరానికి కారణం ఎవరు? అన్నది మిగతా కథ.
    2 . ఖలేజా(అక్టోబర్ 07 , 2010)
    UA|164 minutes|యాక్షన్
    ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు.
    3 . అతడు(ఆగస్టు 10 , 2005)
    U|172 minutes|యాక్షన్,రొమాన్స్
    ఓ రాజకీయ నాయకుడు మరో పొలిటిషియన్‌ను హత్య చేసేందుకు ప్రొఫెషనల్ కిల్లర్‌ నంద గోపాల్‌ను నియమించుకుంటాడు. కానీ, మరో వ్యక్తి చేత ఆ హత్య చేయించి నేరం నంద గోపాల్‌పై వేయిస్తాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతడు పార్ధు అనే వ్యక్తిగా ఓ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    @2021 KTree