• TFIDB EN
  • Editorial List
    త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు
    Dislike
    30+ views
    24 days ago

    తెలుగులో త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్‌ కాంబోకు మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఏంటో ఇక్కడ చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అజ్ఞాతవాసి(జనవరి 10 , 2018)
    UA|158 minutes|యాక్షన్,రొమాన్స్,థ్రిల్లర్
    గోవిందా (బొమన్ ఇరానీ) కొడుకు దారుణంగా హత్యకు గురవుతారు. ఇంద్రాణి (ఖుష్బూ) గోవిందా భార్య కంపెనీ వ్యవహారాలు చూసుకుంటుంది. సాధారణ ఉద్యోగిగా AB గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోకి సుబ్రహ్మణ్యం ప్రవేశిస్తాడు. అయితే వరుస ఘటనల తర్వాత సుబ్రమణ్యం గురించి ఓ నిజం బయటపడుతుంది. ఇంతకు ఈ సుబ్రహ్మణ్యం ఎవరు? అతను కంపెనీలోకి ఎందుకు ప్రవేశించాడు? అసలు అతని లక్ష్యం ఏమిటి? అనేది మిగతా కథ.
    2 . అత్తారింటికి దారేది(సెప్టెంబర్ 27 , 2013)
    U|175 minutes|యాక్షన్,డ్రామా,ఫ్యామిలీ
    హీరో తన అత్తయ్యను తాతయ్యతో కలిపేందుకు ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అత్తను తన కుటుంబంలో ఎలా కలిపాడు? అన్నది కథ.
    3 . జల్సా(ఏప్రిల్ 01 , 2008)
    A|167 minutes|యాక్షన్,హాస్యం
    సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.

    @2021 KTree