• TFIDB EN
 • Editorial List
  Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!
  Dislike
  90+ views
  1 month ago

  ఆహాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి పేరుందు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ప్రస్తుతం ఈ ఓటీటీలో చూడదగిన.. టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాల లిస్ట్‌ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని మిస్‌ కాకుండా ఆ మూవీస్ ఏంటో మీరు చూసేయండి.

  ఇంగ్లీష్‌లో చదవండి

  1 . ప్రేమలు(మార్చి 08 , 2024)
  U|156 minutes|హాస్యం,రొమాన్స్
  స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌.

  ఈ చిత్రం ఆహా ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఆహా పాపులర్ మూవీస్ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉంది.

  2 . ప్రసన్న వదనం(మే 03 , 2024)
  U/A|డ్రామా
  రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.

  ఈ చిత్రం ఆహా ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో ఒకటి. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమా ఆహా పాపులర్ మూవీస్ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది.

  3 . అంబాజీపేట మ్యారేజీ బ్యాండు(ఫిబ్రవరి 02 , 2024)
  U/A|డ్రామా
  మ‌ల్లి (సుహాస్‌) అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సభ్యుడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) స్కూల్‌ టీచ‌ర్‌. ఓ కారణం చేత ఊరి మోతుబరి వెంక‌ట్‌బాబు - మల్లికీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అది పెద్దదై ఊర్లో గొడవలకు దారి తీస్తాయి. ఆ త‌ర్వాత ఏం జరిగింది? ల‌క్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అన్నది కథ.
  4 . బేబీ(జూలై 14 , 2023)
  U/A|177 minutes|డ్రామా,రొమాన్స్
  ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌తో ఇష్టం లేకున్నా శారీరకంగా ఒకటవ్వాల్సి వస్తుంది. ఆనంద్‌ను వైష్ణవి ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? చివరకు ఆనంద్ ఏమయ్యాడు? అనేది మిగతా కథ.
  5 . మంత్‌ ఆఫ్ మధు(అక్టోబర్ 06 , 2023)
  A|డ్రామా
  20 ఏళ్ల వివాహ బంధం తరువాత లేఖ (స్వాతి రెడ్డి), తన భర్త మధుసూధన్ రావు (నవీన్ చంద్ర)తో విడిపోవాలని అనుకుంటుంది. ఇదే క్రమంలో మధుమిత (శ్రేయ నవిలే) తన కజిన్ పెళ్లి కోసం వైజాగ్ వస్తుంది. అక్కడ మధుసూదన్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇంతకు మధుమిత.. లేఖ- మధుసూధన్‌ల బంధాన్ని మరింత చెడగొట్టిందా? లేక వారిద్దరిని కలిపిందా? అనేది మిగతా కథ.
  6 . కీడా కోలా(నవంబర్ 03 , 2023)
  U/A|హాస్యం,క్రైమ్
  ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
  7 . లవ్ స్టోరీ(సెప్టెంబర్ 24 , 2021)
  U/A|165 minutes|డ్రామా,రొమాన్స్
  రేవంత్‌(నాగ చైతన్య) జుంబా సెంటర్‌ నడుపుతుంటాడు. మౌనిక (సాయి పల్లవి) జుంబా సెంటర్‌లో డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? కలిసి బతికేందుకు వారు ఎలాంటి సాహసం చేశారు? అనేది కథ.
  8 . 18 పేజెస్(డిసెంబర్ 23 , 2022)
  U/A|137 Minutes|డ్రామా
  సిద్ధు (నిఖిల్ సిద్ధార్థ్) యాప్ డెవలపర్. ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. సిద్ధూ డిప్రెషన్‌లోకి వెళ్తాడు. ఈక్రమంలో నందిని (అనుపమ పరమేశ్వరన్) డైరీని చూస్తాడు. సిద్ధూ దానిని చదవడం ప్రారంభించి, మెల్లగా ఆమెను ఇష్టపడుతాడు. సిద్ధు నందిని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటాడు. ఆమెను కలిసే ప్రయత్నంలో కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఇంతకు ఆమెను సిద్ధు కలిశాడా? అన్నది మిగతా కథ.
  9 . మసూదా(నవంబర్ 18 , 2022)
  A|160 minutes|హారర్
  నాజియా (భాంధవి శ్రీధర్) ఆమె తల్లి నీలం (సంగీత) ఇద్దరు కలిసి జీవిస్తుంటారు. వీరు గోపీ కృష్ణ (తిరువీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అయితే నాజియా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె ప్రవర్తన నీలం, గోపిలను షాక్‌కు గురిచేస్తుంది. ఆమెను భూతవైద్యుల దగ్గరికి తీసుకెళ్తారు. మరి నాజియా కోలుకుందా? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? అనేది మిగతా కథ.
  10 . భామాకలాపం 2(ఫిబ్రవరి 16 , 2024)
  U/A|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
  కొత్తగా హోటల్‌ పెట్టుకున్న అనుపమ (ప్రియమణి) అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురవుతుంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? ఆ పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? అన్నది కథ
  11 . కళ్యాణం కమనీయం(జనవరి 14 , 2023)
  U|106 minutes|హాస్యం,రొమాన్స్,డ్రామా
  శివ (సంతోష్ సోబన్) నిరుద్యోగి. శ్రుతి (ప్రియా భవానీ శంకర్) అతని భార్య, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. శివకు ఉద్యోగం తెచ్చుకుని తనను తాను నిరూపించుకుంటానని శృతి నమ్ముతోంది. ఆర్థికంగా మద్దతిస్తుంది. కానీ అకస్మాత్తుగా, శ్రుతి తన భర్తకు వీలైనంత త్వరగా ఉద్యోగం తెచ్చుకోవాలని డిమాండ్ చేసి, శివకు దూరమవుతుంది. ఆ తర్వాత శివ ఏం చేశాడు అనేది మిగతా కథ.
  12 . కలర్ ఫోటో(అక్టోబర్ 23 , 2020)
  U/A|142 minutes|డ్రామా,రొమాన్స్
  జయకృష్ణ, దీప్తి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. వీరిద్దరి కులాలు, ఆస్తి అంతస్తులు వేరు. కానీ ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు. కానీ వీరి ప్రేమకు ఒకరి వల్ల పెద్ద విఘాతం ఏర్పడుతుంది. చివరికి వీరిద్దరు కలిశారా? లేరా? అన్నది అసలు కథ.
  13 . ఓరి దేవుడా(అక్టోబర్ 21 , 2022)
  U/A|141 mins|హాస్యం,రొమాన్స్
  అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.
  14 . సవారీ(ఫిబ్రవరి 07 , 2020)
  U/A|133 minutes|హాస్యం,రొమాన్స్
  తాను ఎంతో ప్రేమగా చూసుకునే గుర్రం బాద్షాను పెళ్లిళ్లకు అద్దెకు ఇచ్చే రాజు, సంపన్న కుటుంబానికి చెందిన భాఘీని కలిసినప్పుడు అతని జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇంతకు భాఘీ అతన్ని ప్రేమిస్తుందా? లేదా అన్నది కథ.
  15 . జాంబీ రెడ్డి(ఫిబ్రవరి 05 , 2021)
  U/A|125 minutes|హాస్యం,హారర్
  మారియో (తేజ సజ్జా) ఓ గేమ్‌ డిజైనర్‌. స్నేహితుడు కల్యాణ్‌ (హేమంత్‌) పెళ్లికి తన గ్యాంగ్‌తో రుద్రవరానికి వెళ్తాడు. అక్కడకు వెళ్లిన వారికి అనూహ్య పరిణాణం ఎదురవుతుంది. ఫ్రెండ్స్‌లోని కిరీటీ జాంబీలాగా మారిపోతాడు. అతడు ఎందుకు అలా అయ్యాడు? ఊరు మెుత్తం జాంబీల్లాగా మారడానికి కారణం ఏంటి? వారిని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? అన్నది కథ.
  16 . మా ఊరి పొలిమేర 2(నవంబర్ 03 , 2023)
  U/A|క్రైమ్,హారర్,థ్రిల్లర్
  ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ
  17 . అశోక వనంలో అర్జున కల్యాణం(మే 06 , 2022)
  U/A|149 minutes|రొమాన్స్,డ్రామా
  మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
  18 . నాంది(ఫిబ్రవరి 19 , 2021)
  U/A|146 minutes|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
  సూర్యప్రకాశ్‌ (అల్లరి నరేశ్‌) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. హత్య చేశాడనే ఆరోపణలతో అతడ్ని పోలీసులు అరెస్టు చేస్తారు. దీంతో ఐదేళ్లు జైలులోనే అతడు మగ్గుతాడు. ఇంతకీ ఆ హత్యను ఎవరు చేశారు? లాయర్‌ ఆద్య (వరలక్ష్మీ) అసలు నిందితులను ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది కథ.
  19 . స్వాతి ముత్యం(అక్టోబర్ 05 , 2022)
  U/A|హాస్యం,డ్రామా
  బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ.
  20 . లవ్లీ(మార్చి 30 , 2012)
  U|డ్రామా,రొమాన్స్
  కిట్టు-లల్లి సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌. వారిద్దరు నేరుగా కలవాలని నిర్ణయించుకుంటారు. కానీ కిట్టు అతని స్థానంలో ఆకాష్‌ను పంపగా, లల్లి తన బదులు లావణ్యను పంపుతుంది. అయితే అనూహ్యంగా ఆకాష్‌, లావణ్య ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ
  21 . పుష్పక విమానం(నవంబర్ 12 , 2021)
  U/A|142 minutes|హాస్యం,థ్రిల్లర్
  సుందర్‌ (ఆనంద్‌ దేవరకొండ) మీనాక్షి (గీత్‌ సైనీ)ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన ఎనిమిదో రోజే ఆమె లెటర్‌ రాసి వెళ్లిపోవడంతో రేఖ (శాన్వి మేఘన)ను భార్యగా నటించమని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ మీనాక్షి ఎక్కడికి వెళ్లింది? అన్నది కథ.
  22 . కృష్ణ అండ్ హిస్ లీల(జూన్ 25 , 2020)
  U/A|145 minutes|హాస్యం,రొమాన్స్
  కృష్ణ అనే యువకుడు తన మాజీ ప్రేయసి సత్యతో విడిపోయి.. మరో అమ్మాయి రాధతో ప్రేమలో పడుతాడు. కానీ సత్య మళ్లీ దగ్గర కావడంతో ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధం కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
  23 . శంకరాభరణం(డిసెంబర్ 04 , 2015)
  U/A|154 minutes|యాక్షన్,హాస్యం,క్రైమ్
  గౌతమ్ ఒక NRI. తన తండ్రి అప్పులు తీర్చేందుకు ఇండియాలోని తమ ప్యాలెస్‌ను అమ్మేందుకు భారత్‌ వస్తాడు. అక్కడ అతన్ని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ

  @2021 KTree