Editorial List
గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన టాప్ 15 సినిమాలు ఇవే!
300+ views8 months ago
తెలుగులో దిగ్గజ నటుల్లో గుమ్మడి ఒకరు. జమిందారు పాత్ర అయిన, కడు బీద పాత్రలోనైనా ఆ పాత్రలో ఇట్టే పరకాయ ప్రవేశం చేసేవారు. ఆయన ఎక్కువశాతం స్టార్ హీరోలకు తండ్రి, పెద్దన్న పాత్రల్లో నటించారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. గుమ్మడి నటించి సినిమాల్లో అత్యంత ప్రేక్షాకాదరణ పొందిన టాప్ చిత్రాలను ఓసారి చూద్దాం.
1 . మరో మలుపు(undefined 00 , 1982)
U|డ్రామా
మరో మలుపు వేజెల్ల సత్యనారాయణ దర్శకత్వం వహించిన 1982 భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ నంది అవార్డు గెలుచుకున్న చిత్రం భారతదేశంలోని కుల వ్యవస్థ మరియు సామాజిక పరిస్థితులపై ఆధారపడింది. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది.
2 . నెలవంక(undefined 00 , 1983)
U|డ్రామా
నెలవంక జంధ్యాల దర్శకత్వం వహించిన 1983 భారతీయ తెలుగు-భాషా చిత్రం.
3 . జ్యోతి(జూన్ 04 , 1976)
U|డ్రామా
జ్యోతి అనే టీనేజ్ అమ్మాయి రవితో ప్రేమలో పడుతుంది. అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో ఆమె డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు రవి ఏం చేశాడు? అన్నది కథ.
4 . కుల గోత్రాలు(ఆగస్టు 24 , 1961)
U|158 mins|డ్రామా
రవి తన తండ్రికి ఇష్టంలేని పెళ్లి చేసుకుంటాడు. రవి సవతి సోదరి, ఆమె భర్త ఈ పరిస్థితిని ఉపయోగించుకుని వారి మధ్య విభేదాలు సృష్టిస్తారు.
5 . మా ఇంటి మహాలక్ష్మి(జనవరి 01 , 1959)
U|డ్రామా,ఫ్యామిలీ
ఒక వృద్ధ న్యాయవాది యువతిని వివాహం చేసుకుంటాడు. ఆ యువతి న్యాయవాది కుటుంబాన్ని ఎంతగానో అభిమానిస్తుంది. అయితే ఆ యువతికి మెుదటి భార్య కొడుకు మధ్య సంబంధాన్ని న్యాయవాది అనుమానించడంతో పరిస్థితులు కఠినంగా మారతాయి.
6 . మాయాబజార్(మార్చి 27 , 1957)
U|184 minutes(Telugu)174 minutes(Tamil)|హాస్యం,డ్రామా,మైథలాజికల్
బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
7 . మహామంత్రి తిమ్మరుసు(జూలై 26 , 1962)
U|170 mins|డ్రామా,హిస్టరీ
శ్రీకృష్ణదేవరాయలు గజపతి కూతుర్ని వివాహం చేసుకుంటాడు. రాయలుపై ద్వేషంతో రగిలిపోయే గజపతి కూతురితో అతడ్ని చంపించాలని పన్నాగం పన్నుతాడు. ఈ ప్రయత్నాలను రాయలు ఆస్థాన మంత్రి తిమ్మరుసు అడ్డుకుంటాడు.
8 . భక్త పోతన(జనవరి 07 , 1943)
U|186 minutes|డ్రామా
ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవిత ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చిత్తూరు నాగయ్య పోతన పాత్రలో నటించారు. ఇదే సినిమా మళ్లీ 1966లో వచ్చినప్పుడు అందులో నాగయ్య వేదవ్యాసునిగా కనిపించారు.
9 . మిస్సమ్మ(జనవరి 12 , 1955)
U|181 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు.