• TFIDB EN
  • Editorial List
    ‘గుంటూరుకారం’ మూవీ మరో ఇండస్ట్రీ హిట్?.. మహేష్‌ బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాలు!
    Dislike
    500+ views
    8 months ago

    సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన చిత్రం గుంటూరు కారం టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేస్తోంది. జనవరి 12 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా ఆ కుర్చి మడతపెట్టి సాంగ్ యుట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మరోవైపు జనవరి 7న రిలీజైన ట్రైలర్ సైతం ఒక్క రోజులోనే 25 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సంక్రాంతి బరిలో నా సామిరంగ, సైంధవ్, హనుమాన్ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ.. అందరి కళ్లు గుంటూరు కారం చిత్రంపైనే ఉన్నాయి. ఈ సినిమా టాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించి టాప్ చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . భరత్ అనే నేను(ఏప్రిల్ 20 , 2018)
    UA|173 minutes|డ్రామా,థ్రిల్లర్
    సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.

    బడ్జెట్: 75 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్: రూ. 53.8cr ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు : రూ.164.9cr ఇండియా వైడ్ కలెక్షన్స్: రూ. 133.6cr

    2 . బిజినెస్‌మెన్(జనవరి 13 , 2012)
    A|131 minutes|యాక్షన్
    ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.

    బడ్జెట్: రూ.40 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్: రూ.13cr ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు: రూ. 70cr

    3 . దూకుడు(సెప్టెంబర్ 23 , 2011)
    UA|175 minutes|యాక్షన్,డ్రామా
    మాజీ ఎమ్మెల్యే శంకర్‌ కోమాలోకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. డాక్టర్లు ఆయనకు షాకింగ్ విషయాలు చెప్పవద్దని చెప్తారు. దీంతో పోలీసాఫీసర్ అయిన అజయ్‌ తన తండ్రిని సంతోషంగా ఉంచేందుకు యత్నిస్తాడు. అదే సమయంలో తండ్రికి అన్యాయం చేసిన వారిపై ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ.

    బడ్జెట్: రూ. 35 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్: రూ.12.5cr ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు: రూ.101.3cr ఇండియావైడ్ గ్రాస్ కలెక్షన్స్ : రూ. 85.6cr

    4 . '1' నేనొక్కడినే (జనవరి 10 , 2014)
    UA|177 minutes (theatrical version) 157 minutes (trimmed version)|యాక్షన్,థ్రిల్లర్
    హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది కథ.

    బడ్జెట్: రూ. 70cr ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్: రూ. 8.4cr ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు : రూ. 75.6cr ఇండియావైడ్ గ్రాస్ కలెక్షన్: రూ. 61.3cr

    5 . మహర్షి(మే 09 , 2019)
    UA|178 minutes|యాక్షన్,రొమాన్స్
    మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది.

    బడ్జెట్: 90 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్: రూ. 48.2cr ప్రపంచవ్యాప్త కలెక్షన్: రూ. 170.5cr ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్: 149.2cr

    6 . సర్కారు వారి పాట(మే 12 , 2022)
    UA|161 minutes|యాక్షన్,డ్రామా
    అమెరికాలో ఫైనాన్స్ వ్యాపారం చేసే మహేశ్‌ దగ్గర కళావతి (కీర్తి సురేష్‌) అబద్దాలు చెప్పి డబ్బు అప్పు తీసుకుంటుంది. డబ్బు ఇవ్వనని చెప్పడంతో వైజాగ్‌లో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్‌ (సముద్రఖని) దగ్గరకు మహేశ్ వెళ్తాడు. రూ.10 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఇంతకీ ఆ రూ.10 వేల కోట్ల కథేమిటి? ఇంతకీ మహేశ్ గతం ఏమిటి? అనేది కథ.

    బడ్జెట్: రూ. 125 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 1st డే కలెక్షన్స్: రూ. 75.5cr ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్: రూ.195.8cr దేశవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్: 161.3cr

    7 . శ్రీమంతుడు(ఆగస్టు 07 , 2015)
    UA|158 minutes|యాక్షన్,డ్రామా
    కోటీశ్వరుడి కుమారుడైన హర్ష, పేదరికం సామాజిక సమస్యలతో కుదేలైన ఊరిని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిలో మార్పు తెచ్చే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటాడు.

    బడ్జెట్: 70 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్: రూ.32.8cr ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్: రూ.145.2cr ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్ : రూ.121.8cr

    8 . పోకిరి(ఏప్రిల్ 27 , 2006)
    A|168 minutes|యాక్షన్,థ్రిల్లర్
    పండు డబ్బు కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధపడే యువకుడు. కొన్ని కారణాల వల్ల అతను మాఫియా డాన్ అలీ భాయ్‌కి శత్రువు అవుతాడు. తర్వాత ఏమి ఏం జరిగింది? పండుకి ఉన్న గతం ఏంటి? అన్నది కథ.

    బడ్జెట్: రూ.10 కోట్లు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్: రూ.3.2cr ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు: 63.45cr ఇండియావైడ్ గ్రాస్ కలెక్షన్: రూ. 61cr

    9 . స్పైడర్(సెప్టెంబర్ 27 , 2017)
    UA|145 minutes|యాక్షన్,థ్రిల్లర్
    ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు.

    బడ్జెట్: రూ.120 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ : రూ.41.5cr ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: రూ. 117.8cr ఇండియావైడ్ గ్రాస్ కలెక్షన్: రూ.97.5cr

    10 . సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(జనవరి 11 , 2013)
    U|159 minutes|డ్రామా,ఫ్యామిలీ
    ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.

    బడ్జెట్: రూ.45 కోట్లు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్: రూ.6.43cr ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు: రూ. 88.3cr ఇండియావైడ్ గ్రాస్ కలెక్షన్: రూ.72.8cr

    11 . సరిలేరు నీకెవ్వరు(జనవరి 11 , 2020)
    UA|169 minutes|యాక్షన్,డ్రామా
    అజయ్( మహేష్ బాబు) పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఓ పని నిమిత్తం కర్నూలుకు బయల్దేరుతాడు. మరోవైపు భారతి( విజయశాంతి) కర్నూలులో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటుంది. ఈ క్రమంలో భారతికి స్థానిక మంత్రి ప్రకాశ్ రాజ్‌ వల్ల సమస్య ఎదురవుతుంది. ఇదే సమయంలో కర్నూలుకు వచ్చిన అజయ్ భారతికి ఎలాంటి సాయం చేస్తాడు. అసలు భారతికి అజయ్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగతా కథ

    బడ్జెట్: రూ.85 కోట్లు బడ్జెట్: 85 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్: రూ. 64.7cr ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ. 214కోట్లు


    @2021 KTree