• TFIDB EN
  • Editorial List
    అల్లు అర్జున్ టాప్ కామెడీ సినిమాల లిస్ట్ ఇదే!
    Dislike
    1 day ago

    తెలుగులో తనదైన కామెడీతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఆయన సినిమాల్లో ఎక్కువ భాగం కామెడీ సన్నివేశాలు ఉంటాయి. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తుంటారు.మరి బన్నీ నటించిన బెస్ట్ కామెడీ ఎంటర్‌ టైనర్ సినిమాలు ఏంటో మీరు చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . దేశముదురు(జనవరి 12 , 2007)
    UA|148 minutes|యాక్షన్,రొమాన్స్
    ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే బాలా గ్యాంగ్‌స్టర్ తమ్ముడిని కొట్టి ఇబ్బందుల్లో పడుతాడు. అతని నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. గ్లాంగ్‌ స్టర్‌తో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది మిగతా కథ.
    2 . గంగోత్రి(మార్చి 28 , 2003)
    U|డ్రామా,రొమాన్స్
    నీలకంఠం ఇంట్లో పనిచేసే సింహాద్రిని అతని కూతురు గంగోత్రి ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన నీలకంఠం నాయుడు సింహాద్రిని చంపాలని నిర్ణయించుకుంటాడు. ఈక్రమంలో తప్పించుకున్న సింహాద్రి.. గంగోత్రిని ఎలా దక్కించుకున్నాడు అనేది కథ
    3 . హ్యాపీ(జనవరి 27 , 2006)
    U|152 minutes|డ్రామా,రొమాన్స్
    ఒక రాజకీయనాయకుడు తన కూతురు పెళ్లిని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్‌తో నిశ్చయిస్తాడు. అయితే ఆ పెళ్లి ఇష్టంలేని ఆమె ఓ పిజ్జా బాయ్‌ను లవ్ చేస్తున్నట్లు నాటకం ఆడటంతో కథ మలుపు తిరుగుతుంది.
    4 . DJ:దువ్వాడ జగన్నాథం(జూన్ 23 , 2017)
    UA|156 minutes|యాక్షన్,హాస్యం,థ్రిల్లర్
    దువ్వాడ జగన్నాధం(అల్లు అర్జున్) వంట చేసే బ్రహ్మణ యువకుడు. తోటివారికి ఆపదలో సాయం చేస్తుంటాడు. అతని గుణాన్ని చూసి ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి ఓ సిక్రెట్ ఆపరేష్ నిర్వహించేందుకు DJను నియమిస్తాడు.
    5 . ఆర్య 2(నవంబర్ 27 , 2009)
    UA|165 minutes|రొమాన్స్
    ఇద్దరు అనాథలు చిన్నతనంలో విడిపోయి పెద్దయ్యాక కలుసుకుంటారు. ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు కథ ఆసక్తికరంగా మారుతుంది.
    6 . జులాయి(ఆగస్టు 08 , 2012)
    UA|152 minutes|యాక్షన్,హాస్యం
    రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్‌ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.
    7 . ఇద్దరమ్మాయిలతో(మే 31 , 2013)
    UA|143 minutes|రొమాన్స్,థ్రిల్లర్
    సంజు రెడ్డి స్పెయిన్‌లో లీడ్ గిటారిస్ట్. కొంతమందితో కలిసి బ్యాండ్ నడుపుతుంటాడు. ఈక్రమంలో ఇండియాలో బాగా ధనవంతురాలైన, యూనియన్ మినిస్టర్ కూతురైన ఆకాంక్ష సైకాలజీలో పిజి చేయడానికి స్పెయిన్ వస్తుంది. తను దిగిన ఇంట్లో, ఇదివరకూ అదే ఇంట్లో ఉన్న వారికి సంబందించిన డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీకి సంజూ రెడ్డికి మధ్య సంబంధమే సినిమా కథ.
    8 . S/O సత్యమూర్తి(ఏప్రిల్ 09 , 2015)
    UA|163 minutes|యాక్షన్,డ్రామా
    ఈ సినిమా కథ విరాజ్ ఆనంద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ధనవంతుడైన తండ్రి చనిపోయిన తరువాత అతని జీవితం మారుతుంది. కుటుంబ గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ.. బంధాలు, నైతిక విలువల మధ్య నడవడం ప్రారంభిస్తాడు.
    9 . రేసు గుర్రం(ఏప్రిల్ 11 , 2014)
    UA|163 minutes|యాక్షన్,రొమాన్స్
    హీరోకి తన అన్న అంటే అస్సలు పడదు. పోలీసు అధికారైన తన అన్నను ఓ పోలిటిషియన్‌ చంపాలని చూస్తున్నట్లు హీరో తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? అన్నను కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్లాన్లు వేశాడు? అన్నది కథ.
    10 . ఆర్య(మే 07 , 2004)
    U|151 minutes|డ్రామా,రొమాన్స్
    అజయ్ గీతను ప్రేమిస్తాడు. కానీ గీత అతను చేసిన ప్రేమప్రతిపాదనను తిరస్కరించినప్పుడు బిల్డింగ్‌పై నుంచి దూకెస్తానని అజయ్ బెదిరిస్తాడు. దీంతో గీత అజయ్ లవ్‌ ప్రపోజలన్‌ను అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా గీతకు ఆర్య లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.
    11 . అలా వైకుంఠపురములో(జనవరి 12 , 2020)
    UA|165 minutes|యాక్షన్,డ్రామా
    బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.

    @2021 KTree