నెట్‌ఫ్లిక్స్‌లో హరర్ మిస్టరీ చిత్రాల లిస్ట్ ఇదే
2k+ views1 year ago
వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలను కొంతమంది అదే పనిగా చూస్తుంటారు. అవి చూస్తున్నంత సేపు వారు అనుభవించే థ్రిల్ మాటలకు అందనిది. ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో స్ట్రీమ్ అవుతున్న హారర్ మిస్టరీ చిత్రాలను ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. భయపడేందుకు రెడీ అవ్వండి మరి.
1 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
A|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
2 . దసరా(మార్చి 30 , 2023)
UA|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ
3 . కొండ పొలం(అక్టోబర్ 08 , 2021)
U|యాక్షన్,అడ్వెంచర్,థ్రిల్లర్
రవీంద్రనాథ్ (వైష్ణవ్‌తేజ్) నాలుగేళ్లుగా ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో పాటు గొర్రెల్ని మేపడానికి కొండపొలానికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడికి అడవి ఏం నేర్పింది? అతనిలో వచ్చిన మార్పేమిటి? అన్నది కథ.
4 . ది గోట్ లైఫ్ (మార్చి 28 , 2024)
UA|అడ్వెంచర్,డ్రామా
నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
5 . ఆదిపురుష్(ఆగస్టు 11 , 2023)
UA|యాక్షన్,అడ్వెంచర్,మైథలాజికల్
ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ
6 . ఫ్యామిలీ ప్యాక్(అక్టోబర్ 23 , 2024)
UA|అడ్వెంచర్,హాస్యం,ఫాంటసీ
ఓ కుటుంబంలోని సభ్యులు పాతకాలం నాటి ఓ కార్డ్ గేమ్ ఆడతారు. గేమ్ వల్ల అనుకోకుండా మధ్యయుగం నాటి కాలానికి వెళ్లిపోతారు. అక్కడ తోడేళ్ల నుంచి వారికి సవాళ్లు ఎదురవుతాయి. వాటితో వారు ఎలా పోరాడారు? ప్రస్తుత కాలానికి వారు రాగలిగారా? లేదా? అన్నది స్టోరీ.
7 . డామ్‌సెల్(మార్చి 08 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్
ప్రిన్స్ హెన్రీని యువరాణి ఎలోడి వివాహం చేసుకుంటుంది. అనంతరం ఎలోడిని ఫైర్ డ్రాగెన్ ఉన్న గుహలో ప్రిన్స్ వదిలేస్తాడు. మరి ఆ గుహలోని డ్రాగెన్ నుంచి ఎలోడి తప్పించుకుందా? ఆ గుహలో ఎలోడి తెలుసుకున్న విషయాలు ఏంటి? చివరికీ ఎలోడి ఏమైంది? అన్నది కథ.
8 . అంధకారం(నవంబర్ 24 , 2020)
UA|హారర్
అంధకారం ఇంద్రన్ అనే మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది, మనోరోగ వైద్యుడు, క్రికెట్ కోచ్ వినోద్ మరియు విజువల్ ఛాలెంజ్డ్ సూర్యం పాత్రల కథే ఈ సినిమా కథ.
9 . చంద్రముఖి 2(సెప్టెంబర్ 28 , 2023)
UA|హాస్యం,హారర్
రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. ఆ ఫ్యామిలీని అనుకోని సమస్యలు వరుసగా చుట్టుముడతాయి. కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. దీంతో లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (2005లో మొదటి చంద్రముఖి సినిమా కథ జరిగిన ఇల్లు) ఉంటుంది.
10 . అశ్విన్స్(జూన్ 23 , 2023)
A|హారర్
కొత్త దర్శకుడు తరుణ్ తేజ రూపొందించిన చిత్రం అస్విన్స్. వసంత్ రవి, విమలా రామన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. అర్జున్(వసంత్ రవి) లండన్‌లో వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. అయితే తాను తన టీమ్‌తో ఒక హాంటెడ్ హౌస్‌ని వ్లాగ్ చేయడానికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళాక వారికి అనూహ్య ఘటనలు ఎదురవుతాయి. మరి అక్కడ ఏం జరిగింది? ఆ ఇల్లు ఎవరిది? వారు ఎలా బయటపడ్డారు? అనేది మిగతా కథ.