Editorial List
Indian 2: భారతీయుడు 2 మాదిరి అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన తెలుగు సినిమాలు ఇవే
200+ views2 months ago
కల్కి 2828 ఏడి మేనియా ముగియక ముందే మరో భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమైంది.దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా భారతీయుడు 2 సినిమా విడుదల కానుంది. ఫస్ట్ ఫార్ట్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. అదే స్థాయిలో అదే స్టోరీ లైన్‌తో డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో అవినీతికి వ్యతిరేకంగా తెలుగులో వచ్చిన సినిమాలు ఓసారి చూద్దాం.
1 . ఇజం(అక్టోబర్ 21 , 2016)
UA|130 mins|యాక్షన్,డ్రామా
జర్నలిస్టు అయిన హీరో (కళ్యాణ్‌రామ్) అవినీతి, మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? సమాజంలో మార్పు కోసం అతడు ఏం చేశాడు? అన్నది కథ.
2 . రాజధాని ఫైల్స్(ఫిబ్రవరి 15 , 2024)
UA|డ్రామా
అరుణప్రదేశ్ రాజధానిగా అయిరావతిని అంగీకరించిన కె.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు అధికారంలోకి వచ్చాక తన స్టాండ్ మార్చుకుంటాడు. నాలుగు రాజధానుల ప్రకటన చేస్తాడు. దీంతో రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులు ఆందోళన బాట పడతారు. ఈ క్రమంలో వారికి ప్రతినిధిగా ఓ కుటుంబం ఎలాంటి పాత్ర పోషించింది? సీఎం దిగిరాకపోవడంతో ప్రజలు ఏం చేశారు? అన్నది కథ.
3 . ఆపరేషన్ దుర్యోధన 2(జూలై 05 , 2013)
UA|105 minutes|యాక్షన్,డ్రామా
నిజాయతీ కలిగిన హీరో రాజకీయ వ్యవస్థలోని అవినీతిపై పోరాటం చేస్తాడు. నేతల అవినీతి చేష్టలను బట్టబయలు చేస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
4 . ఆపరేషన్ దుర్యోధన(మే 31 , 2007)
A|డ్రామా
మహేష్ (శ్రీకాంత్) నిజాయితీగల పోలీసు అధికారి. అతని నిజాయితీ వల్ల నష్టపోతున్న కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల అతని భార్యను, పిల్లలను కోల్పోతాడు. దాంతో మహేష్ రాజకీయాల్లో చేరడానికి తన వేషాన్ని, పేరును మార్చుకుంటాడు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ.
5 . శివాజీ ది బాస్(జూన్ 14 , 2007)
U|188 minutes|డ్రామా
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన శివాజీ దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో భారత్‌కు వస్తాడు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడతాడు. ఈ క్రమంలో ఓ దుర్మార్గుడైన రాజకీయ నేత నుంచి అతడికి సమస్యలు ఎదురవుతాయి. జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత శివాజీ ఏం చేశాడు? గుండు బాస్‌కి అతడికి మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
6 . జెంటిల్‌మన్(జూన్ 17 , 2016)
U|145 minutes|యాక్షన్,రొమాన్స్,థ్రిల్లర్
ఇద్దరు మహిళలు వేర్వేరు సందర్భాల్లో ఒకే వ్యక్తిని ప్రేమిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? అన్నది కథ.
7 . అపరిచితుడు(జూన్ 17 , 2005)
U|181 minutes|యాక్షన్
రామానుజం అన్యాయాన్ని భరించలేని ఓ సాధారణ లాయర్. అయితే అతడు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుంటాడు. మరోవైపు అపరిచితుడు అనే వ్యక్తి వరుస హత్యలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తుంటాడు. ఇంతకి అపరిచితుడు ఎవరు? రామనుజానికి అతడికి సంబంధం ఏంటి? హత్యలకు గరుడ పురణానికి ఉన్న లింకేంటి? అన్నది కథ.
8 . కొండవీటి దొంగ(మార్చి 09 , 1990)
U|151 minutes|యాక్షన్,థ్రిల్లర్
రాజా అనే గిరిజన యువకుడు తన విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తమ గూడెం వారిని స్థానిక గూండాలు హింసించడాన్ని గమనిస్తాడు. వారి అన్యాయాలను ఎదుర్కొనేందుకు కొండవీటి దొంగగా మారతాడు.
9 . నిజం(మే 23 , 2003)
U|187 minutes|డ్రామా
అమాయకుడైన సీతారాం తండ్రిని కొంతమంది చంపుతారు. అయితే అతని తల్లి, అతని తండ్రి చావుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
10 . గణేష్(జూన్ 19 , 1998)
U|166 minutes|డ్రామా
గణేష్ ఓ జర్నలిస్టు. వైద్యశాఖ నిర్లక్ష్యం కారణంగా తండ్రి, చెల్లెలని కోల్పోతాడు. దీంతో హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అవినీతిపై పోరాడాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత గణేశ్ ఏం చేశాడు? అన్నది కథ.
11 . ఠాగూర్(సెప్టెంబర్ 24 , 2003)
U|176 minutes|యాక్షన్,డ్రామా
ప్రభుత్వ వ్యవస్థల్లో లంచగొండి అధికారులను నిర్మూలించడానికి ఠాగూర్ అనే ప్రొఫెసర్ తన స్టూడెంట్స్‌తో ఒక నిఘా సంస్థను రూపొందిస్తాడు. ఆ సంస్థ ద్వారా అవినీతి పరులను ఏరిపారేస్తాడు.
12 . భారతీయుడు(మే 09 , 1996)
UA|185 minutes|యాక్షన్,మ్యూజికల్
భారతీయ సైన్యంలో పనిచేసిన ఒక నిజాయితీపరుడైన అనుభవజ్ఞుడు, అవినీతి అధికారులకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అధికారులు, మంత్రులు, బ్యూరోక్రాట్లను లంచాలు తీసుకోకుండా పట్టుదలతో పని చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈక్రమంలో అతను ఎలాంటి చర్యలకు దిగాడు అనేది కథ.
13 . భారతీయుడు 2
(జూలై 12 , 2024)
UA|డ్రామా,యాక్షన్
దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్‌తో సోషల్ మీడియాలో పోరాటం చేస్తాడు. సేనాపతి తిరిగి రావాలని హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తారు. దీంతో ఇన్నేళ్ల తర్వాత సేనాపతి మళ్లీ ఇండియాకు వస్తాడు. అలా వచ్చిన సేనాపతి అవినీతి, లంచగొండితనంపై ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది కథ.