• TFIDB EN
  • Editorial List
    జేవీ సోమయాజులు నటించిన చిత్రాల్లో టాప్ 20 బెస్ట్ సినిమాలు
    Dislike
    400+ views
    10 months ago

    శంకరాభరణం శంకరశాస్త్రిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన జెవి సోమయాజులు ఆ ఒక్క సినిమాతోనే స్టార్ నటుడిగా ఎదిగారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే పాత్రల్లో ఆయన విశేష ప్రభావం చూపారు. సోమయాజులు నటించిన చిత్రాల్లో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన టాప్ చిత్రాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గోవిందా గోవిందా(జనవరి 21 , 1994)
    U|145 mins|డ్రామా,థ్రిల్లర్
    భగవంతుడైన వేంకటేశ్వరుడు దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది.
    2 . ముఠా మేస్త్రి(జనవరి 17 , 1993)
    U|యాక్షన్,డ్రామా
    బోసు (చిరంజీవి) ఒక దేశభక్తి గలవాడు. కూరగాయల మార్కెట్‌లో కూలివారికి అన్యాయం జరగకుండా కాపాడుతుంటాడు. ఆత్మా (శరత్ సక్సేనా) ఆ ప్రాంతంలో ఒక ముఠా నాయకుడు. బోసు అతనికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. బోసు దేశభక్తిని మెచ్చిన సీఎం (గుమ్మడి వెంకటేశ్వర రావు) అతడ్ని మంత్రిగా చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది అసలు కథ.
    3 . రౌడీ అల్లుడు(అక్టోబర్ 18 , 1991)
    U|డ్రామా,థ్రిల్లర్
    కళ్యాణ్ ఒక పారిశ్రామికవేత్త, అతని శత్రువులు కుట్ర పన్ని అతని స్థానంలో జానీ అనే మోసగాడిని పంపిస్తారు. అయితే కళ్యాణ్ అమాయకత్వాన్ని తెలుసుకున్న జానీ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.
    4 . అభినందన(మార్చి 10 , 1988)
    U|డ్రామా,మ్యూజికల్
    రాణి ఒక నృత్యకారిణి. ఆమె గాయకుడు, చిత్రకారుడు అయిన రాజాతో ప్రేమలో పడుతుంది. విధి ఆమెను మరొకరితో వివాహం చేసుకునేలా చేస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తరువాత, మాజీ ప్రేమికులు మళ్లీ కలుసుకుంటారు.
    5 . అల్లరి మొగుడు(ఫిబ్రవరి 14 , 1992)
    U|డ్రామా
    ఒక గాయకుడు ఇద్దరు మహిళలను అనుకోని పరిస్థితుల్లో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరు అతని గురువు కుమార్తె, మకరు సంపన్న మహిళ. వీరిద్దరికి పెళ్లిళ్ల గురించి తెలియకుండా ఉండేందుకు నానా కష్టాలు పడుతాడు.
    6 . అప్పుల అప్పారావు(జనవరి 24 , 1992)
    U|140 mins|హాస్యం,డ్రామా
    అప్పులు చేసి జీవనం సాగించే అప్పారావు, సుబ్బలక్ష్మి ప్రేమలో పడుతాడు. అయితే, ఒక జ్యోతిష్యుడు సుబ్బ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే ఆమె చనిపోతుందని చెప్పడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
    7 . స్వయంకృషి(సెప్టెంబర్ 03 , 1987)
    U|డ్రామా,మ్యూజికల్
    సాంబయ్య (చిరంజీవి) చెప్పులు కుట్టుకుంటూ స్వయం కృషితో వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. గంగ (విజయశాంతి)ను పెళ్లి చేసుకొని చెల్లెలు కొడుకు చిన్నాను సొంత బిడ్డలా పెంచుతాడు. అయితే ధనిక జీవితానికి ఇష్టపడ్డ చిన్నా కాయ కష్టం పనులను అసహ్యించుకుంటాడు. చిన్నా అసలు తండ్రి గోవింద్‌ (చరణ్‌రాజ్‌) రాకతో సాంబయ్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది కథ.
    8 . చక్రవర్తి(జూన్ 04 , 1987)
    U|136 minutes|యాక్షన్,ఫ్యామిలీ
    అంజి ఎవరికి అన్యాయం జరిగినా సహించలేడు. అయితే ఓ గ్రామ పెద్ద దురాగతాల కారణంగా అతని గురువు మరణించినప్పుడు, అతను తన గురువు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరాడు.
    9 . మగధీరుడు(మార్చి 07 , 1986)
    U|డ్రామా,మ్యూజికల్
    చిరు ఒక అమ్మాయిని తన ప్రేమిస్తాడు. తన కుటుంబానికి ఇష్టం లేకున్నా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇదే సమయంలో అతని తండ్రి మరణిస్తాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్తి కోసం తగాదా పడుతారు. మరోవైపు చిరు జైలుకు వెళ్లిపోవడంతో అతని భార్య ఒంటరిగా మిగిలిపోతుంది.
    10 . ఆలాపన(మే 12 , 1986)
    U|డ్రామా,థ్రిల్లర్
    వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్‌, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. వేటూరి, సి. నారాయణ రెడ్డి పాటలు రాశారు.
    11 . స్వాతి ముత్యం(మార్చి 13 , 1986)
    U|161 minutes|డ్రామా,ఫ్యామిలీ
    మంద బుద్ధితో బాధపడుతున్న శివయ్య తన అమ్మమ్మతో కలిసి గ్రామంలో జీవిస్తుంటాడు. అక్కడ వితంతువు లలితను ఆమె వదిన వేదింపుల నుంచి రక్షించడానికి ఆమెను పెళ్లి చేసుకోవడంతో వారి జీవితం మలుపు తిరుగుతుంది.
    12 . సితార(ఏప్రిల్ 12 , 1984)
    U|మ్యూజికల్
    దేవదాస్‌ ఒక ఫొటోగ్రాఫర్‌. నిరాశ్రయురాలైన సితారకు సాయం చేస్తాడు. ఆమె మోడల్‌గా, ఫిల్మ్‌స్టార్‌గా ఎదిగేందుకు సహాయం చేస్తాడు. ఆమె ప్రేమించిన వ్యక్తితో కలిపేందుకు కృషి చేస్తాడు.
    13 . నెలవంక(undefined 00 , 1983)
    U|డ్రామా
    నెలవంక జంధ్యాల దర్శకత్వం వహించిన 1983 భారతీయ తెలుగు-భాషా చిత్రం.
    14 . త్యాగయ్య(undefined 00 , 1981)
    U|143 minutes|డ్రామా,మ్యూజికల్
    త్యాగయ్య బాపు దర్శకత్వం వహించిన 1981 భారతీయ తెలుగు భాషా చిత్రం. తారాగణం జె.వి.సోమయాజులు మరియు కె.ఆర్.విజయ. ఈ చిత్రం సెయింట్, గాయకుడు మరియు స్వరకర్త త్యాగరాజు జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఫిల్మోత్సవ్'82 యొక్క ఇండియన్ పనోరమలో త్యాగయ్య ప్రదర్శించబడింది.
    15 . వంశ వృక్షం(నవంబర్ 20 , 1980)
    U|166 minutes|డ్రామా
    వంశవృక్షం చిత్రంలో అనిల్ కపూర్, జేవీ సోమయాజులు, జ్యోతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ద్వారా అనిల్ కపూర్ తెలుగులో అరంగేట్రం చేశాడు. ఈ సినిమాను ఎల్ బైరప్ప రాసిన 'సేమ్ నేమ్' నవల ఆధారంగా తెరకెక్కించారు.
    16 . శంకరాభరణం(ఫిబ్రవరి 02 , 1980)
    U|143 minutes|మ్యూజికల్
    శంకర శాస్త్రి సుప్రసిద్ధ శాస్త్రీయ సంగీత గాయకుడు, అతన్ని ఒక వేశ్య కుమార్తె తులసి అభిమానిస్తుంది. అతనికి సేవ చేయాలని కోరుకుంటుంది. అయితే ఆమె తల్లి మాత్రం వేశ్యగా మారాలని బలవంతం చేస్తుంది.

    @2021 KTree