• TFIDB EN
  • Editorial List
    జగపతి బాబు నటించిన టాప్ కామెడీ సినిమాలు
    Dislike
    3 days ago

    టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన జగపతిబాబు తర్వాతి కాలంలో యాక్షన్‌ హీరోగాను మెప్పించాడు. అంతేకాదు, తనలోని కామెడీ టైమింగ్‌ను బయటపెడుతూ అనేక సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆయన నటించిన పలు కామెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఆయన 33 ఏళ్ల సినిమా కెరీర్‌లో సుమారు 170 చిత్రాల్లో నటించారు. వాటిలో బెస్ట్ కామెడీ సినిమాలెంటో మీరు చూసేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . బడ్జెట్ పద్మనాభం(మార్చి 09 , 2001)
    U|151 minutes|హాస్యం,డ్రామా
    పద్మనాభం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేస్తాడు. అయితే అతని ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చి తిష్ట వేస్తారు. ఇదే క్రమంలో పద్మనాభం భార్య ముగ్గురు కవల పిల్లల్ని కని అతనికి షాకిస్తుంది.
    2 . బాచి(నవంబర్ 09 , 2000)
    UA|యాక్షన్,డ్రామా
    ఓ పోలీస్ అధికారి దగ్గరకు ఒక బాలుడు వచ్చి నువ్వే నా తండ్రివంటూ నిలదీస్తాడు. అతని వాళ్ల ఆ అధికారి జీవితం మలుపు తిరుగుతుంది. పిల్లవాడిని వదిలించుకునేందుకు పోలీస్ అధికారి అన్ని మార్గాలను ప్రయత్నిస్తాడు.
    3 . మూడు ముక్కలాట(సెప్టెంబర్ 01 , 2000)
    U|145 mins|హాస్యం,రొమాన్స్
    శ్రావణి, లహరి, అలివేణి అనే ముగ్గురు అమ్మాయిలు శాంతి స్వరూప్ అనే లెక్చరర్‌ను గాఢంగా ప్రేమిస్తారు. అయితే ఈ ముగ్గురు అతనిని ఆకర్షించడానికి వివిధ ప్రణాళికలు అమలు చేయడంతో అతని జీవితం మలుపు తిరుగుతుంది.
    4 . పెళ్లి పీటలు(జూలై 16 , 1998)
    UA|141 minutes|హాస్యం,రొమాన్స్
    ఎవరి కింద పనిచేయడం ఇష్టం లేని గోపి ఊరిలో వాచ్‌ రిపేర్‌ షాపును పెట్టుకుంటాడు. పల్లెటూరి అమ్మాయి అంజలితో ప్రేమలో పడతాడు. అయితే ఆమె కుటుంబ గతం వీరి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది.
    5 . ఆహ(నవంబర్ 19 , 2021)
    UA|146 minutes|డ్రామా,క్రీడలు
    ఇంద్రజిత్‌ సుకుమారన్‌, మనోజ్‌ కె. జయన్‌, అమిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆహ'. మలయాళ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి బిబిన్‌ పాల్‌ దర్శకత్వం వహించారు. వేర్వేరు పనులు చేస్తూ జీవనం సాగించే ఓ గ్రామానికి చెందిన యువకులు ఓ ఆట ద్వారా ఎలా క్రేజ్‌ సంపాదించారు అన్నది ఈ సినిమా కథాంశం.
    6 . మావిడాకులు(మార్చి 20 , 1998)
    U|142 minutes|హాస్యం,డ్రామా
    ప్రతాప్‌, ప్రియకు వేరే వాళ్లతో పెళ్లై కలహాలతో విడిపోతారు. తమ బిడ్డలతో విడిగా జీవిస్తుంటారు. ఉద్యోగంలో ప్రత్యర్థులుగా ఉండే ప్రతాప్‌, ప్రియ పక్క పక్క ఇళ్లలోకి వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం మెుదలుపెడతారు. అయితే వారి జీవిత భాగస్వాముల ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది.
    7 . దొంగాట(జూలై 11 , 1997)
    U|138 minutes|డ్రామా
    దొంగాట అనేది 1997లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా డ్రామా చిత్రం. ఇందులో జగపతి బాబు, సౌందర్య, సురేష్, రీతు శివపురి నటించారు, భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. దీనిని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డా. కె.ఎల్. నారాయణ నిర్మించారు మరియు S. గోపాల్ రెడ్డి ద్వారా సమర్పించారు. ఈ చిత్రం ఆంగ్ల చిత్రం ఫ్రెంచ్ కిస్ (1995) నుండి ప్రేరణ పొందింది, ఇది హిందీలో ప్యార్ తో హోనా హి థా (1998)గా పునర్నిర్మించబడింది.
    8 . పెళ్లి పందిరి(డిసెంబర్ 26 , 1997)
    U|150 minutes|డ్రామా,ఫ్యామిలీ
    ప్రకాష్‌, గోవింద్‌ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌. వారిద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు. అయితే ఒకే అమ్మాయిని ఇష్టపడటంతో కథ సమస్యలు మెుదలవుతాయి.
    9 . శుభకాంక్షలు(ఫిబ్రవరి 14 , 1997)
    U|154 minutes|డ్రామా
    వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. పర్యవసానంగా ఒకప్పుడు స్నేహంగా ఉన్న కుటుంబాలు శత్రువులుగా మారతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వారు తిరిగి ఎలా కలిశారు? అన్నది కథ.
    10 . హనుమాన్ జంక్షన్(డిసెంబర్ 21 , 2001)
    A|159 minutes|హాస్యం
    కృష్ణ, దాస్ ఇద్దరు మంచి స్నేహితులు. తమ చెల్లెలు దేవితో కలిసి ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటారు. అయితే వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని దేవరాజ్ వారికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంటాడు. ఈ చిత్రం మంచి కామెడీ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. 2001లో ఈ సినిమా చాలా పెద్ద హిట్.
    11 . శుభలగ్నం(సెప్టెంబర్ 30 , 1994)
    U|139 minutes|డ్రామా
    డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది.
    12 . మావిచిగురు(మే 30 , 1996)
    U|141 minutes|డ్రామా
    వ్యాధి బారిన పడిన ఓ వివాహిత త్వరలో తాను చనిపోబోతున్నట్లు తెలుసుకుంటుంది. తన భర్తకు మరో మహిళతో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇందులో భాగంగా భర్తకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తుంది.
    13 . కబడ్డీ కబడ్డీ(ఫిబ్రవరి 16 , 2003)
    UA|131 minutes|డ్రామా,రొమాన్స్
    పనిపాట లేకుండా తిరిగే రాంబాబు కావేరి అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. అయితే, వీరి ప్రేమను ఆమె అన్న ఒప్పుకోడు. తన ఊరి కబడ్డీ టీంతో మ్యాచ్ గెలిస్తే పెళ్లి చేస్తానని కండీషన్ పెడుతాడు.
    14 . ఫ్యామిలీ సర్కస్(జూన్ 01 , 2001)
    U|127 minutes|హాస్యం,డ్రామా
    సుబ్రహ్మణ్యం మరియు అతని కుటుంబం కొత్త ఇంట్లోకి మారినప్పుడు.. అక్కడ అతనికి విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.

    @2021 KTree