• TFIDB EN
  • Editorial List
    జగ్గయ్య టాప్ 10 బెస్ట్ సినిమాలు
    Dislike
    200+ views
    7 months ago

    తెలుగులో అల్‌టైమ్ గ్రేట్ నటుల్లో ఒకరైన జగ్గయ్య ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు నట వైభవాన్ని చాటారు. ఆయన పౌరాణికం, జానపదం, సాంఘికం, మోడ్రన్‌ ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో జీవించేవారు. ఆయన నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న చిత్రాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గుడి గంటలు(జనవరి 14 , 1964)
    U|168 minutes|డ్రామా
    ధనికుడైన వాసు, హరి ప్రాణ స్నేహితులు. మాయ అనే యువతిని ఇద్దరూ ప్రేమిస్తారు. కానీ మాయ హరిని ప్రేమిస్తుంది. వాసు భావాలను తెలుసుకున్న హరి.. మాయతో తమ ప్రేమను వదులుకోమని చెప్తాడు.
    2 . టాక్సీ రాముడు(అక్టోబర్ 18 , 1961)
    U|153 minutes|డ్రామా
    టాక్సీ డ్రైవర్ రాము తన చిన్ననాటి ప్రియురాలు సరోజను కలుసుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆమె తండ్రి ఆర్థికంగా నష్టపోవడంతో మోహన్‌ని ఇష్టంలేకున్న పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
    3 . బడి పంతులు(నవంబర్ 22 , 1972)
    U|165 minutes|డ్రామా
    పదవీ విరమణ తర్వాత, రాఘవరావు అతని భార్య పిల్లల చేత కష్టాలు పడుతారు. అతని పిల్లలు ఇంటిని అమ్మి భార్యభర్తలను వేరు చేసి రొటేషన్‌ విధానంలో వారికి ఆశ్రయం కల్పిస్తూ అవమానిస్తారు.
    4 . ఆమె ఎవరు?(జనవరి 01 , 1966)
    U|153 minutes|డ్రామా
    ఆనంద్ అనే ఓ డాక్టర్ ఒక యువతికి లిఫ్ట్‌ ఇచ్చి స్మశానవాటిక వద్ద వదిలేస్తాడు. ఆ తర్వాత, అతను ఆ మహిళ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాడు.
    5 . పండంటి కాపురం(జూలై 21 , 1972)
    U|165 minutes|డ్రామా
    ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన తర్వాత, అతనికి, అతని కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడతాయి. ఒక స్త్రీ వారి ఆనందాన్ని నాశనం చేయడానికి వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. దీంతో వారి జీవితాలు మరింత దిగజారుతాయి.
    6 . ఆత్మ గౌరవం(undefined 00 , 1965)
    UA|170 mins|డ్రామా
    వారసుడు లేని జమీందార్ శ్రీనివాస్‌ని దత్తత తీసుకోవాలని కోరుకున్నాడు. అయితే, అతని భార్య దానిని వ్యతిరేకిస్తుంది. బదులుగా తన సోదరి కొడుకు అయిన వేణుని దత్తత తీసుకోవాలని కోరుకుంటుంది.
    7 . డాక్టర్ చక్రవర్తి(జూలై 10 , 1964)
    U|167 minutes|డ్రామా
    డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు.
    8 . అల్లూరి సీతారామ రాజు(మే 01 , 1974)
    U|187 minutes|యాక్షన్,డ్రామా
    స్వాతంత్య్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు.. రైతులు, గిరిజనుల పక్షాన నిలబడి బ్రిటిష్‌ వారికి ఎదురు తిరుగుతాడు. భూమి హక్కులను ఉల్లంఘించిన బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటుకు పిలుపునిస్తాడు.
    9 . బంగారు పాప(మార్చి 19 , 1955)
    U|183 minutes|డ్రామా
    కోటయ్య తన భార్య చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేక మద్యానికి బానిసవుతాడు. తన జైలు శిక్షకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అయితే కూతురి బాధ్యత మీద పడటంతో అతడి దృక్పథం మారుతుంది.

    @2021 KTree