Editorial List
అలనాటి నటి జమున టాప్ 10 బెస్ట్ చిత్రాలు
200+ views8 months ago
తెలుగులో అభినవ సత్యభామగా జమున గుర్తింపు పొందారు. పొగరుబోతు పాత్రలకు ఆమె ప్రసిద్ధి చెందారు. తన హావభావాలతో పెద్ద ఎత్తున అభిమానులు సంపాదించారు. ఆమె నటించిన టాప్ చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం.
1 . శ్రీకృష్ణ తులాభారం(ఆగస్టు 25 , 1966)
U|178 mins|డ్రామా
శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ అహంకారంగా ప్రవర్తిస్తుండటంతో ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. తానెప్పుడు భక్తుల హృదయాల్లో ఉంటానని తులభారంతో బోధపడేలా చేస్తాడు.
2 . లేత మనసులు(సెప్టెంబర్ 16 , 1966)
U|డ్రామా
లేత మనసులు చిత్రం లల్లి, పప్పి అనే ఇద్దరు కవల పిల్లల మానసిక సంఘర్షణకు అద్దంపడుతుంది. తమ తల్లిదండ్రుల మధ్య విబేధాల కారణంగా విడిపోయి వేరుగా జీవిస్తుంటారు. వారు తమ తల్లిదండ్రులను కలపాలని నిర్ణయించుకుంటారు. లేత మన్సులు 1961లో వచ్చిన ఆంగ్ల చిత్రం ది పేరెంట్ ట్రాప్‌కి రీమేక్.
3 . మూగ మనసులు(జనవరి 31 , 1964)
U|160 mins|డ్రామా
కొత్త దంపతులు గోపీనాథ్, రాధ హనీమూన్ కోసం గోదావరిలో పడవ ప్రయాణం చేస్తుండగా వారికి సుడిగుండాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఆ జంటకు గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి.
4 . పల్నాటి యుద్ధం(ఫిబ్రవరి 18 , 1966)
UA|182 mins|డ్రామా,హిస్టరీ
బ్రహ్మనాయుడు తన కొడుకు కాలజ్ఞానం కారణంగా అతనిని చంపడానికి ప్రయత్నించినప్పుడు అతని బావ రక్షిస్తాడు. కొన్ని ఏళ్ల తర్వాత, అతను తన కొడుకు తిరుగుబాటు నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి బ్రహ్మనాయుడు ఓ కఠిన నిర్ణయం తీసుకుంటాడు.
5 . రాముడు భీముడు(మే 21 , 1964)
U|డ్రామా
రాముడు, భీముడు చూడటానికి ఒకేలా కనిపిస్తారు, ఇద్దరూ తమ తమ జీవితాలతో విసిగిపోయి ఉంటారు. అయితే వారు తమ ఇళ్లలో ఒకరి స్థానాన్ని మరొకరు మార్చుకోవాలని అనుకుంటారు. దీంతో వారి జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి.
6 . గుండమ్మ కథ(జూన్ 07 , 1962)
U|166 minutes|హాస్యం,డ్రామా
గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు.
7 . భూకైలాస్(మార్చి 20 , 1958)
U|174 minutes|డ్రామా,మ్యూజికల్
రావణుడు భక్తికి మెచ్చి శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. దానిని నెలపై ఉంచితే ఆత్మలింగం శక్తులు పోతాయని షరతు విధిస్తాడు. రావణాసురుడికి అమరత్వం వస్తే భూలోకం నాశనం అవుతుందని భావించిన నారధుడు గణేశుడి సాయం కోరతాడు.
8 . పెళ్లినాటి ప్రమాణాలు(డిసెంబర్ 17 , 1958)
U|172 minutes|డ్రామా
కృష్ణారావు, రుక్మిణిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొన్నేళ్ల తర్వాత కృష్ణ తన సెక్రటరీతో సంబంధం పెట్టుకుంటాడు. ఇది భార్యకు తెలియకుండా దాచాలని చూస్తాడు.
9 . మిస్సమ్మ(జనవరి 12 , 1955)
U|181 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు.
10 . బంగారు పాప(మార్చి 19 , 1955)
U|183 minutes|డ్రామా
కోటయ్య తన భార్య చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేక మద్యానికి బానిసవుతాడు. తన జైలు శిక్షకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అయితే కూతురి బాధ్యత మీద పడటంతో అతడి దృక్పథం మారుతుంది.