• TFIDB EN
  • Editorial List
    Jr.NTR Top 10 Movies: తారక్‌ హీరోగా చేసిన అత్యుత్తమ చిత్రాలు
    Dislike
    2 Likes 2k+ views
    11 months ago

    టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు జూ.ఎన్టీఆర్‌. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న తారక్‌.. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఎదిగారు. తనదైన నటన, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించారు. తారక్‌ సినిమా వస్తుందంటే రాష్ట్రంలో ఓ విధమైన పండగ వాతావరణ ఏర్పడుతుంది. ఇప్పటివరకూ 29 చిత్రాలు చేసిన తారక్.. ఇండస్ట్రీకి పలు సూపర్‌ హిట్స్‌ అందించారు. తద్వారా టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నారు. జూ.ఎన్టీఆర్‌ చేసిన టాప్-10 బెస్ట్ సినిమాలు మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అదుర్స్(జనవరి 13 , 2010)
    UA|150 minutes|యాక్షన్,రొమాన్స్
    పుట్టినప్పుడే విడిపోయిన ఇద్దరు కవల సోదరులు వేర్వేరు పరిస్థితుల్లో పెరుగుతారు. ఓ గ్యాంగ్‌స్టర్ నుంచి తమ తండ్రిని కాపాడుకునేందుకు ఇద్దరు ఏకమవుతారు.

    వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అదుర్స్‌’ చిత్రం తారక్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో తారక్‌ తొలిసారి బ్రాహ్మణుడి పాత్ర పోషించారు. బ్రహ్మానందంతో కలిసి తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా నయనతార, షీలా కౌర్‌ నటించారు. బ్రహ్మానందం, షియాజీ షిండే, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

    2 . బృందావనం(అక్టోబర్ 14 , 2010)
    UA|170 minutes|డ్రామా,రొమాన్స్
    ఇందు తన ప్రియుడు కృష్ణని తన స్నేహితురాలు భూమి లవర్‌గా నటించాలని కోరుతుంది. దీంతో భూమి కుటుంబం వరుడి కోసం వెతకడం ఆపేస్తుంది. అయితే, భూమి కృష్ణతో ప్రేమలో పడడంతో వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగాయన్నది కథ.
    3 . యమదొంగ(ఆగస్టు 15 , 2007)
    U|179 minutes|డ్రామా,ఫాంటసీ
    రాజా ఒక అనాథ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. ఈక్రమంలో ఓ ధనవంతుడి మనవరాలు మహిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసే క్రమంలో మరణిస్తాడు. అతను యమలోకానికి వెళ్లి యమదేవుడితో తన జీవితాన్ని తిరిగిపొందేందుకు అతనితో పోరాడుతాడు.
    4 . జనతా గ్యారేజ్(సెప్టెంబర్ 01 , 2016)
    UA|162 minutes|యాక్షన్,డ్రామా
    హీరో ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగిన సహించడు. మరోవైపు జనతా గ్యారెజ్‌ అణగారిన వారికి అండగా ఉంటూ వారి తరపున పోరాడుతుంటుంది. మరి హీరో, గ్యారేజీకి మధ్య ఉన్న బంధం ఏంటి? గ్యారేజీని నడిపే బాధ్యతను అతడు ఎందుకు తీసుకున్నాడు? అన్నది కథ.
    5 . ఆది(మార్చి 28 , 2002)
    UA|162 minutes|యాక్షన్
    ధనవంతుడైనా ఆది తండ్రి అమెరికా నుంచి ఇండియా వచ్చి తన తాతల ఆస్తి పేదలకు పంచాలనుకొంటాడు. ఆ ఆస్తిని ఆక్రమించుకుని ఓ భూస్వామి అతడిని, అతని భార్యను హత్య చేస్తాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో పనిచేసే ఓ నమ్మకస్తుడైన వ్యక్తి అతని కొడుకు ఆదిని తీసుకొని పారిపోతాడు. పెరిగి పెద్దయిన ఆదికి తన గతం గురించి చెప్పి ఆ ఆస్తిని తిరిగి తీసుకోమంటాడు. ఊరికి వెళ్ళిన ఆది తన ఆస్తిని తిరిగి ఎలా తీసుకుంటాడనేది కథ.

    వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఆది'. 2002లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఫ్యాక్షనిస్ట్‌గా ఎన్టీఆర్‌ అదరగొట్టాడు. సినిమా కథ విషయానికి వస్తే ఆది (ఎన్టీఆర్‌) తండ్రి ఎంతో ధనవంతుడు. ఆయన అమెరికా నుండి వచ్చి తాతల ఆస్తిని పేదలకు పంచాలని భావిస్తాడు. ఈ క్రమంలో విలన్‌ అతడ్ని హత్య చేస్తాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో నమ్మకంగా ఉండే చలపతిరావు ఆదిని ఎత్తుకెళ్లి పెంచి పెద్దచేస్తాడు. పెద్దయ్యాక ఊరి విషయాలు చెప్పి ఆస్తి తీసుకోమంటాడు. అయితే ఆస్తిని తారక్‌ దక్కించుకున్నాడా? విలన్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది అసలు కకథ.

    6 . అరవింద సమేత వీర రాఘవ(అక్టోబర్ 11 , 2018)
    UA|162 minutes|యాక్షన్,డ్రామా
    రెండు ఊర్ల మధ్య 30 ఏళ్లుగా వైరం జరుగుతుంటుంది. ఈ క్రమంలో శత్రువులు రాఘవ రెడ్డి (ఎన్టీఆర్‌) నాన్న (నాగబాబు)ను చంపేస్తారు. భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని రాఘవ నిర్ణయించుకుంటాడు. గొడవలను చల్లార్చే క్రమంలో హీరోకు ఎదురైన సమస్యలేంటి? అన్నది కథ.
    7 . సింహాద్రి(జూలై 09 , 2003)
    U|175 minutes|డ్రామా
    సింహాద్రి (జూ.ఎన్టీఆర్‌)ను రామ్ భూపాల్‌ వర్మ (నాజర్‌) చిన్నప్పుడే దత్తత తీసుకుంటాడు. వర్మ మనవరాలు సింహాద్రిని ప్రేమిస్తుంది. అయితే సింహాద్రి వద్ద ఓ మతిస్థిమితం లేని అమ్మాయి ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు? కేరళతో హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    8 . టెంపర్(ఫిబ్రవరి 13 , 2015)
    UA|141 minutes|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    దయా ఒక అవినీతి పోలీసు అధికారి. వైజాగ్‌కు బదిలీ అయిన తర్వాత అక్కడ వాల్టర్ వాసు అనే గూండాతో చేతులు కలుపుతాడు. అవినీతి మార్గంలో ప్రయాణిస్తాడు. అతని ప్రేయసి కాజల్ అగర్వాల్‌ను అనుకోకుండా వాల్టర్ వాసు కిడ్నాప్ చేయడంతో కథలో ట్విస్ట్ పుడుతుంది
    9 . నాన్నకు ప్రేమతో(జనవరి 13 , 2016)
    UA|168 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.

    జూ.ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. తండ్రి చివరి కోరిక నెరవేర్చే అభిరామ్‌ పాత్రలో తారక్‌ ‌అద్భుతంగా నటించాడు. భావోద్వేగాలను చక్కగా పలికించాడు. ఇందులో తారక్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటించింది. రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్ అవసరాల, తాగుబోతు రమేష్‌, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

    10 . ఆర్ఆర్ఆర్(మార్చి 25 , 2022)
    UA|182 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.

    @2021 KTree