Editorial List
జూ. ఎన్టీఆర్ నటించిన టాప్ కామెడీ సినిమాల లిస్ట్ ఇదే4 days ago
జూనియర్ ఎన్టీఆర్ కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ అవలీలగా జీవించారు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన సినిమాల్లో అదుర్స్ సినిమా హెలెరియస్‌గా ఉంటుంది.
1 . బాద్ షా(ఏప్రిల్ 05 , 2013)
UA|164 minutes|యాక్షన్,రొమాన్స్,థ్రిల్లర్
ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
2 . యమదొంగ(ఆగస్టు 15 , 2007)
U|179 minutes|డ్రామా,ఫాంటసీ
రాజా ఒక అనాథ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. ఈక్రమంలో ఓ ధనవంతుడి మనవరాలు మహిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసే క్రమంలో మరణిస్తాడు. అతను యమలోకానికి వెళ్లి యమదేవుడితో తన జీవితాన్ని తిరిగిపొందేందుకు అతనితో పోరాడుతాడు.
3 . అల్లరి రాముడు(జూలై 19 , 2002)
UA|156 minutes|డ్రామా
చాముండేశ్వరికి గర్వం చాలా ఎక్కువ. మానవ సంబంధాల కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తుంది. అయితే ఇంట్లో పనిచేసే సహాయకుడితో ఆమె కూతురు ప్రేమలో పడుతుంది. వారిద్దరినీ విడదీయటానికి ఆమె కుట్రలు చేస్తుంది. చాముండేశ్వరికి ఆ పనివాడు ఎలా బుద్ది చెప్పాడు? అన్నది కథ.
4 . రాఖీ(డిసెంబర్ 22 , 2006)
UA|173 minutes|యాక్షన్,డ్రామా
రామ కృష్ణ(రాఖీ) అనే యువకుడు తన సోదరి మరణంతో పాటు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాఖీ చెల్లెల్ని ఆమె అత్తమామలు కట్నం కోసం సజీవ దహనం చేస్తాడు. దీంతో మహిళలను వేధించే పురుషులను రాఖీ వెంటాడి చంపుతాడు.
5 . బృందావనం(అక్టోబర్ 14 , 2010)
UA|170 minutes|డ్రామా,రొమాన్స్
ఇందు తన ప్రియుడు కృష్ణని తన స్నేహితురాలు భూమి లవర్‌గా నటించాలని కోరుతుంది. దీంతో భూమి కుటుంబం వరుడి కోసం వెతకడం ఆపేస్తుంది. అయితే, భూమి కృష్ణతో ప్రేమలో పడడంతో వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగాయన్నది కథ.
6 . జై లవ కుశ(సెప్టెంబర్ 21 , 2017)
UA|153 minutes|యాక్షన్
విధివశాత్తు విడిపోయిన ముగ్గురు అన్నదమ్ములు తిరిగి కలిసినప్పుడు వారి మధ్య.. ప్రేమ, వంచన, ప్రతీకారం వంటి భావోద్వేగ కుటుంబ బంధాన్ని ఈ సినిమా కథ పరీక్షిస్తుంది.
7 . టెంపర్(ఫిబ్రవరి 13 , 2015)
UA|141 minutes|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
దయా ఒక అవినీతి పోలీసు అధికారి. వైజాగ్‌కు బదిలీ అయిన తర్వాత అక్కడ వాల్టర్ వాసు అనే గూండాతో చేతులు కలుపుతాడు. అవినీతి మార్గంలో ప్రయాణిస్తాడు. అతని ప్రేయసి కాజల్ అగర్వాల్‌ను అనుకోకుండా వాల్టర్ వాసు కిడ్నాప్ చేయడంతో కథలో ట్విస్ట్ పుడుతుంది
8 . స్టూడెంట్ నెం: 1(సెప్టెంబర్ 27 , 2001)
UA|148 minutes|డ్రామా,మ్యూజికల్
ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించే క్రమంలో సమస్యల్లో పడుతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు.
9 . ఊసరవెల్లి(అక్టోబర్ 06 , 2011)
UA|162 minutes|యాక్షన్,హాస్యం,రొమాన్స్
డబ్బుకోసం ఎలాంటి పనైనా చేసే టోని.. నిహారిక కోసం హైదరాబాద్‌కు వస్తాడు. ఆమె కోసం హత్యలు చేస్తుంటాడు. ఇంతకు ఎవరా టోని? ఊసరవెల్లిగా మారి ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అన్నది కథ.
10 . అదుర్స్(జనవరి 13 , 2010)
UA|150 minutes|యాక్షన్,రొమాన్స్
పుట్టినప్పుడే విడిపోయిన ఇద్దరు కవల సోదరులు వేర్వేరు పరిస్థితుల్లో పెరుగుతారు. ఓ గ్యాంగ్‌స్టర్ నుంచి తమ తండ్రిని కాపాడుకునేందుకు ఇద్దరు ఏకమవుతారు.