• TFIDB EN
  • Editorial List
    కిరణ్ అబ్బవరం నటించిన టాప్ హిట్ చిత్రాలు
    Dislike
    200+ views
    3 months ago

    టాలెంట్ ఉన్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. సినిమాల్లోకి రాకముందు షార్ట్‌ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు. అతను నటించిన చిత్రాల్లో ప్రేక్షకులన అలరించిన సినిమాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మీటర్(ఏప్రిల్ 07 , 2023)
    UA|127 minutes|యాక్షన్,డ్రామా
    అర్జున్‌ కళ్యాణ్‌ (కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ మంచి పోలీసు ఆఫీసర్‌. కానిస్టేబుల్‌గా చేస్తూ ఎన్నో అవమానాలు పడుతుంటాడు. కొడుకుని ఎస్సైని చేయాలని తండ్రి కలలు కంటాడు. కాని అర్జున్‌కు అది అసలు ఇష్టం ఉండదు. అయితే అనుకోకుండా పరీక్ష రాసిన అర్జున్.. ఎస్సై అయిపోతాడు. ఈ క్రమంలో హోమంత్రి కంఠం బైరెడ్డి(పవన్‌), అర్జున్‌ మధ్య గొడవ జరుగుతుంది. బైరెడ్డి చేసిన స్కామ్‌ ఏంటి?. అర్జున్‌ దాన్ని ఎలా బయటపెడతాడు? అనేది అసలు కథ
    2 . సమ్మతమే(జూన్ 24 , 2022)
    UA|130 minutes|హాస్యం,డ్రామా
    కృష్ణ (కిరణ్‌ అబ్బవరం) తన ఆలోచనలకు పూర్తిగా విరుద్దంగా ఉన్న శాన్వీ (చాందిని చౌదరి)ని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమెను ఎలాగైన తన పద్దతిలోకి మార్చాలనుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య సమస్యలు మెుదలవుతాయి. వాటిని కృష్ణ ఎలా పరిష్కరించాడు? అనేది కథ.
    3 . వినరో భాగ్యము విష్ణు కథ(ఫిబ్రవరి 18 , 2023)
    UA|143 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
    దర్శన (కాశ్మీరా పరదేశి), ఒక యూట్యూబర్, ఆమె ఫోన్ నంబర్‌లో లాస్ట్‌ నెంబర్‌కు తర్వాత ఉన్న విష్ణు (కిరణ్ అబ్బవరం)తో అనుకోకుండా ఓ రోజు ఫోన్ కలుస్తుంది. వీరి పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారుతుంది. మరోవైపు మురళి శర్మతో ఇదే తరహా ఫొన్ పరిచయం ఏర్పడుతుంది. దర్శన తన యూట్యూబ్ ఛానెల్‌ని మరింత విస్తరించేందుకు విష్ణు, శర్మ సాయం చేస్తారు. అయితే ఓ రోజు శర్మను దర్శన కాల్చి చంపుతుంది? అసలు శర్మను దర్శన ఎందుకు కాల్చి చంపుతుంది అన్నది మిగతా కథ.
    4 . రూల్స్ రంజన్!(అక్టోబర్ 06 , 2023)
    UA|డ్రామా,రొమాన్స్
    మనో రంజన్(కిరణ్ అబ్బవరం) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన లైఫ్‌లో కఠినమైన రూల్స్‌ పెట్టుకుని జీవిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత ఫ్రెండ్ సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకున్న.. మనో రంజన్.. ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి షాకవుతాడు. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనేది కథ.
    5 . ఎస్ఆర్ కళ్యాణమండపం: ఎస్టీ. 1975(ఆగస్టు 06 , 2021)
    UA|148 minutes|రొమాన్స్
    కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ.

    @2021 KTree