Editorial List
కృష్ణ సినిమాల్లో టాప్ 10 బెస్ట్ సినిమాలు
300+ views9 months ago
తెలుగులో దిగ్గజ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ విభిన్న పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఆయన ఎక్కువగా యాక్షన్, డ్రామా జనర్ చిత్రాలకు గుర్తింపు పొందారు. "మోసగాళ్లకు మోసగాడు" వంటి చిత్రాలతో తెలుగు చిత్రసీమలో కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. "గూడచారి 116" వంటి సినిమాల ద్వారా జేమ్స్ బాండ్ తరహా గూఢచారి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. "పాండవ వనవాసం" వంటి పౌరాణిక చిత్రాల్లోనూ ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. మరి ఆయన నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలను ఓసారి చూద్దాం.
1 . కొడుకు దిద్దిన కాపురం(సెప్టెంబర్ 21 , 1989)
U|126 mins|డ్రామా
ట్రక్ డ్రైవర్ చక్రవర్తి.. కోటీశ్వరుడి కూతురు శశిరేఖను ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. చక్రవర్తి ఓ జంట హత్యల కేసులో ఇరుక్కుంటాడు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి దూరమవుతారు. వారిద్దరిని కొడుకు ఎలా కలిపాడు? అన్నది కథ.
2 . మంచి కుటుంబం(ఫిబ్రవరి 02 , 1989)
U|డ్రామా
వేణు, శాంత తమ పిల్లలతో హ్యాపీగా వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. ఒక రోజు వేణు గురించి శాంతకు సంచలన నిజం తెలుస్తుంది. దాంతో ఆమె జీవితం తలకిందులు అవుతుంది.
3 . నెంబర్ వన్(జనవరి 14 , 1994)
U|యాక్షన్,డ్రామా
కృష్ణ తన చిన్న వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుంటాడు. తన చెల్లెలు, సోదరుడిని పెంచాల్సి వస్తుంది. అయితే సౌందర్యను కలవడంతో అతని జీవితం మారిపోతుంది.
4 . పండంటి కాపురం(జూలై 21 , 1972)
U|165 minutes|డ్రామా
ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన తర్వాత, అతనికి, అతని కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడతాయి. ఒక స్త్రీ వారి ఆనందాన్ని నాశనం చేయడానికి వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. దీంతో వారి జీవితాలు మరింత దిగజారుతాయి.
5 . రామ్ రాబర్ట్ రహీమ్(మే 31 , 1980)
U|160 minutes|యాక్షన్,డ్రామా
ముగ్గురు అన్నదమ్ములు పుట్టుకతోనే విడిపోయి వేర్వేరు మతాల్లో పెరిగిన తర్వాత మళ్లీ కలుస్తారు. కలిసి, వారు తమ ఎడబాటుకు కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటారు.
6 . ముందడుగు(ఫిబ్రవరి 25 , 1983)
U|యాక్షన్,డ్రామా
గుమ్మడి, శివకృష్ణ ఇద్దరు భిన్నమైన భావజాలం ఉన్న అన్నదమ్ములు. వీరి మధ్య విభేదాల కారణంగా శివకృష్ణ చనిపోవడంతో వారి కుమారులు శత్రువులుగా మారుతారు.
7 . సింహాసనం(మార్చి 21 , 1986)
UA|అడ్వెంచర్,డ్రామా
దసర్ణ రాజ్యానికి విక్రమ సింహ సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు. అయితే సింహసనం నుంచి రాజును తొలగించాలని భావించిన మంత్రి కుట్రలను విక్రమ సింహ భగ్నం చేస్తాడు. దీంతో పగ పెంచుకున్న ఆ మంత్రి, రాజకుమారిపై విక్రమసింహ హత్యా ప్రయత్నం చేశాడని ఆరోపిస్తాడు.
8 . అల్లూరి సీతారామ రాజు(మే 01 , 1974)
U|187 minutes|యాక్షన్,డ్రామా
స్వాతంత్య్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు.. రైతులు, గిరిజనుల పక్షాన నిలబడి బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతాడు. భూమి హక్కులను ఉల్లంఘించిన బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటుకు పిలుపునిస్తాడు.
9 . మోసగాళ్లకు మోసగాడు(ఆగస్టు 27 , 1971)
U|159 minutes|అడ్వెంచర్
కృష్ణ అతడి స్నేహితుడు ధనవంతులను దోచుకులను పేదలకు సాయం చేస్తుంటారు. తన తండ్ర హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే రాధకు కృష్ణ సాయం చేస్తాడు. పాత నిధిని కనుగొనేందుకు వారు బయలుదేరతారు. ఈ క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి.
10 . గూడాచారి 116(ఆగస్టు 11 , 1966)
U|170 minutes|యాక్షన్,థ్రిల్లర్
అంతర్జాతీయ క్రిమినల్ ముఠాకు వ్యతిరేకంగా ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలను సేకరించిన తర్వాత సీక్రెట్ ఏజెంట్ 303 హత్యకు గురవుతాడు. దీంతో ఏజెంట్ 116 తన సహోద్యోగి హత్య గురించి నిజాన్ని వెలికితీసే లక్ష్యంతో బయలుదేరాడు.