Editorial List
త్రివిక్రమ్ హిట్ చిత్రాలు
30+ views19 days ago
తెలుగులో మాటల మాంత్రికుడిగా పేరొందిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేశారు. అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను డైరెక్ట్ చేసి అగ్రదర్శకుడిగా ఎదిగాడు. మరి ఆయన అందించిన హిట్ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం
1 . గుంటూరు కారం(జనవరి 12 , 2024)
UA|యాక్షన్,డ్రామా
రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల అతని తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లికి దూరంగా 25 ఏళ్లు పెరిగిన తర్వాత తిరిగి ఆమె ప్రస్తావన వస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతాయి. మరి రమణ తన తల్లిని కలిశాడా? లేదా? అసలు వసుంధర తన కొడుకును ఎందుకు దూరం పెట్టింది ? ఇద్దరి మధ్య దూరానికి కారణం ఎవరు? అన్నది మిగతా కథ.
2 . అలా వైకుంఠపురములో(జనవరి 12 , 2020)
UA|165 minutes|యాక్షన్,డ్రామా
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
3 . అరవింద సమేత వీర రాఘవ(అక్టోబర్ 11 , 2018)
UA|162 minutes|యాక్షన్,డ్రామా
రెండు ఊర్ల మధ్య 30 ఏళ్లుగా వైరం జరుగుతుంటుంది. ఈ క్రమంలో శత్రువులు రాఘవ రెడ్డి (ఎన్టీఆర్) నాన్న (నాగబాబు)ను చంపేస్తారు. భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని రాఘవ నిర్ణయించుకుంటాడు. గొడవలను చల్లార్చే క్రమంలో హీరోకు ఎదురైన సమస్యలేంటి? అన్నది కథ.
4 . అ ఆ(జూన్ 02 , 2016)
U|153 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
హీరో హీరోయిన్ బావ మరదళ్లు. అయితే వారి కుటుంబాల మధ్య ఓ విషయమై మనస్ఫర్థలు తలెత్తుతాయి. అనుకోకుండా హీరో ఇంటికి వచ్చిన హీరోయిన్ అతడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారా లేదా? చివరికీ ఏం జరిగింది? అన్నది కథ.
5 . S/O సత్యమూర్తి(ఏప్రిల్ 09 , 2015)
UA|163 minutes|యాక్షన్,డ్రామా
ఈ సినిమా కథ విరాజ్ ఆనంద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ధనవంతుడైన తండ్రి చనిపోయిన తరువాత అతని జీవితం మారుతుంది. కుటుంబ గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ.. బంధాలు, నైతిక విలువల మధ్య నడవడం ప్రారంభిస్తాడు.
6 . అత్తారింటికి దారేది(సెప్టెంబర్ 27 , 2013)
U|175 minutes|యాక్షన్,డ్రామా,ఫ్యామిలీ
హీరో తన అత్తయ్యను తాతయ్యతో కలిపేందుకు ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అత్తను తన కుటుంబంలో ఎలా కలిపాడు? అన్నది కథ.
7 . జులాయి(ఆగస్టు 08 , 2012)
UA|152 minutes|యాక్షన్,హాస్యం
రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.
8 . జల్సా(ఏప్రిల్ 01 , 2008)
A|167 minutes|యాక్షన్,హాస్యం
సంజయ్ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
9 . అతడు(ఆగస్టు 10 , 2005)
U|172 minutes|యాక్షన్,రొమాన్స్
ఓ రాజకీయ నాయకుడు మరో పొలిటిషియన్‌ను హత్య చేసేందుకు ప్రొఫెషనల్ కిల్లర్ నంద గోపాల్‌ను నియమించుకుంటాడు. కానీ, మరో వ్యక్తి చేత ఆ హత్య చేయించి నేరం నంద గోపాల్‌పై వేయిస్తాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతడు పార్ధు అనే వ్యక్తిగా ఓ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
10 . నువ్వే.. నువ్వే...(అక్టోబర్ 10 , 2002)
U|డ్రామా,రొమాన్స్
కోటీశ్వరుడి కుమార్తె మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తుంది. అయితే వారి ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డుచెప్తాడు. వారిద్దర్ని విడదీసేందుకు యత్నిస్తాడు. చివరికి వారు కలిశారా లేదా? అన్నది కథ.