• TFIDB EN
  • Editorial List
    బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన హిట్ సినిమాల జాబితా
    Dislike
    30+ views
    22 days ago

    తెలుగులో అగ్రశ్రేణి మాస్‌ డైరెక్టర్లలో బోయపాటి ఒకరు. ఆయన చిత్రాల్లో హీరో ఎలివేషన్ సీన్లు మరో స్థాయిలో ఉంటాయి. తొలి సినిమా భద్రతోనే భారీ విజయం అందుకుని అగ్ర హీరోలకు ఛాయిస్ అయ్యాడు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన హిట్ సినిమాల జాబితాను ఇక్కడ చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అఖండ(డిసెంబర్ 02 , 2021)
    UA|167 minutes|యాక్షన్,డ్రామా
    మురళీకృష్ణ(బాలకృష్ణ) ఊరి పెద్దగా ఉంటూ పేదవారికి బాసటగా నిలుస్తుంటాడు. వరద రాజులు (శ్రీకాంత్‌) ఆ ఊరిలో యూరేనియం తవ్వకాలు ప్రారంభిస్తాడు. దాని వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ క్రమంలో మురళీకృష్ణ ఏం చేశాడు? అతడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు అఖండ ఎవరు? మైనింగ్‌ మాఫియాకు ఎలా అడ్డుకట్ట వేశాడు? అన్నది కథ.
    2 . జయ జానకి నాయక(ఆగస్టు 11 , 2017)
    UA|149 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    గగన్, స్వీటీ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ ఆమె తండ్రి గగన్‌ను అంగీకరించకపోవడంతో విడిపోవాల్సి వస్తుంది. ఒక రోజు దుండగుల నుంచి ఒక కుటుంబాన్ని రక్షించే సమయంలో, గగన్ తనకు తెలియకుండా స్వీటీని రక్షిస్తాడు.
    3 . సరైనోడు(ఏప్రిల్ 22 , 2016)
    UA|160 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    హీరో ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వస్తాడు. నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ది చెబుతుంటాడు. ఈ క్రమంలో వ్యవస్థ మొత్తాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న వైరం ధనుష్ (ఆది)ని హీరో ఎలా ఎదిరించాడు? అతడికి హీరోకు మధ్య గొడవేంటి? అన్నది కథ.
    4 . లెజెండ్(మార్చి 28 , 2014)
    A|161 minutes|యాక్షన్,డ్రామా
    ఇండియాకు వచ్చిన కృష్ణ (బాలకృష్ణ) ఓ సందర్భంలో జితేందర్‌ (జగపతిబాబు) కొడుకుతో గొడవపడతాడు. దీంతో హీరోను చంపాలని వెళ్లిన జితేందర్‌ అతడ్ని చూసి షాక్ అవుతాడు. జితేందర్‌కు కృష్ణకు ఇంతకు ముందే పరిచయం ఉందా? కథలో జయదేవ్‌ (సీనియర్ బాలకృష్ణ) పాత్ర ఏంటి? అన్నది కథ.
    5 . సింహ(ఏప్రిల్ 30 , 2010)
    A|156 minutes|యాక్షన్
    శ్రీమన్నారాయణ కాలేజీ ప్రొఫెసర్. అతని కాలేజీలోకి జానకి అనే యువతి కొత్తగా చేరుతుంది. శ్రీమన్నారాయణను చూసిన వెంటనే ఆమె ప్రేమలో పడుతుంది. అయితే జానకి గతం.. శ్రీమన్నారయణ తండ్రి గతంతో లింక్ అయి ఉంటుంది. ఇంతకు జానకి ఎవరు? శ్రీమన్నారాయణ తండ్రి గతం ఏమిటి అన్నది మిగతా కథ.
    6 . తులసి(అక్టోబర్ 12 , 2007)
    UA|153 minutes|యాక్షన్,డ్రామా
    పర్వతనేని తులసిరాం తన భార్య, బిడ్డల కోసం కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని సంఘటనలు తులసిని అతని కుటుంబానికి దూరం చేస్తాయి.
    7 . భద్ర(మే 12 , 2005)
    UA|డ్రామా
    భద్ర తన స్నేహితుడి చెల్లెలైన అనుని ప్రేమిస్తాడు. ఓ రోజు శత్రువుల దాడిలో అను మినహా అమె ఫ్యామిలీ అంతా చనిపోతుంది. విలన్ల నుంచి అనుని రక్షిస్తానని చనిపోతున్న తన ఫ్రెండ్‌కు భద్ర మాట ఇస్తాడు.

    @2021 KTree