Editorial List
సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాల లిస్ట్
50+ views20 days ago
వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. అతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్ గా నిలబెట్టింది. ఆ తర్వాత జగడం మూవీ ప్లాప్ అయినా 100% లవ్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు. మరి ఆయన ఇప్పటి వరకు తీసిన చిత్రాలేంటో ఓసారి చూడండి.
1 . పుష్ప 2: ది రూల్(డిసెంబర్ 05 , 2024)
UA|యాక్షన్,డ్రామా
పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఓ రోజు సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి (రష్మిక) ఆశగా అడుగుతుంది. పుష్ప ఇందుకు యత్నించగా సీఎం హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)ను సీఎం చేస్తానని సవాలు విసురుతాడు. ఇందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
2 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
3 . రంగస్థలం(మార్చి 30 , 2018)
UA|174 minutes|డ్రామా,హిస్టరీ,రొమాన్స్
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
4 . నాన్నకు ప్రేమతో(జనవరి 13 , 2016)
UA|168 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
5 . '1' నేనొక్కడినే (జనవరి 10 , 2014)
UA|177 minutes (theatrical version) 157 minutes (trimmed version)|యాక్షన్,థ్రిల్లర్
హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది కథ.
6 . ఆర్య 2(నవంబర్ 27 , 2009)
UA|165 minutes|రొమాన్స్
ఇద్దరు అనాథలు చిన్నతనంలో విడిపోయి పెద్దయ్యాక కలుసుకుంటారు. ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు కథ ఆసక్తికరంగా మారుతుంది.
7 . 100 % లవ్(మే 06 , 2011)
U|140 minutes|డ్రామా,రొమాన్స్
బాలు, మహాలక్ష్మీ బావ మరదళ్లు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఈగో వల్ల బహిర్గతం చేసుకోరు. ఈ క్రమంలోనే మహాలక్ష్మీకి ఇంకొకరితో పెళ్లి నిశ్చయమవుతుంది. మరి బాలు - మహాలక్ష్మీ కలిశారా లేదా? అన్నది కథ.
8 . జగడం(మార్చి 16 , 2007)
A|163 minutes|డ్రామా
శీను స్థానిక గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో కీలక సభ్యుడిగా ఎదుగుతాడు. శీను కారణంగా అతని తమ్ముడు హత్యకు గురికావడంతో పరిస్థితులు ఊహించని మలుపు తిరుగుతాయి.
9 . ఆర్య(మే 07 , 2004)
U|151 minutes|డ్రామా,రొమాన్స్
అజయ్ గీతను ప్రేమిస్తాడు. కానీ గీత అతను చేసిన ప్రేమప్రతిపాదనను తిరస్కరించినప్పుడు బిల్డింగ్‌పై నుంచి దూకెస్తానని అజయ్ బెదిరిస్తాడు. దీంతో గీత అజయ్ లవ్ ప్రపోజలన్‌ను అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా గీతకు ఆర్య లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.