Editorial List
అల్లు అర్జున్ ఇప్పటి వరకు నటించిన సినిమాల జాబితా
90+ views22 days ago
అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ ఘనత ద్వారా తెలుగు సినిమారంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. మరి ఆయన నటించి సినిమాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.
1 . పుష్ప 2: ది రూల్(డిసెంబర్ 05 , 2024)
UA|యాక్షన్,డ్రామా
పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఓ రోజు సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి (రష్మిక) ఆశగా అడుగుతుంది. పుష్ప ఇందుకు యత్నించగా సీఎం హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)ను సీఎం చేస్తానని సవాలు విసురుతాడు. ఇందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
2 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
3 . అలా వైకుంఠపురములో(జనవరి 12 , 2020)
UA|165 minutes|యాక్షన్,డ్రామా
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
4 . నా పేరు సూర్య,నా ఇల్లు ఇండియా(మే 04 , 2018)
UA|164 minutes|యాక్షన్,డ్రామా
సూర్య (అల్లు అర్జున్) కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సైనికుడు. దీని వల్ల ఆర్మీ నుంచి సస్పెండ్ అవుతాడు. మానసికంగా ఫిట్ అనే సర్టిఫికేట్‌తో వస్తేనే తిరిగి సైన్యంలో చేర్చుకుంటామని అధికారులు కండిషన్ పెడతారు. ఆ పని మీద వైజాగ్‌కు వచ్చిన హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సైకాలజిస్ట్ అర్జున్‌తో సూర్యకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ.
5 . DJ:దువ్వాడ జగన్నాథం(జూన్ 23 , 2017)
UA|156 minutes|యాక్షన్,హాస్యం,థ్రిల్లర్
దువ్వాడ జగన్నాధం(అల్లు అర్జున్) వంట చేసే బ్రహ్మణ యువకుడు. తోటివారికి ఆపదలో సాయం చేస్తుంటాడు. అతని గుణాన్ని చూసి ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి ఓ సిక్రెట్ ఆపరేష్ నిర్వహించేందుకు DJను నియమిస్తాడు.
6 . సరైనోడు(ఏప్రిల్ 22 , 2016)
UA|160 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వస్తాడు. నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ది చెబుతుంటాడు. ఈ క్రమంలో వ్యవస్థ మొత్తాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న వైరం ధనుష్ (ఆది)ని హీరో ఎలా ఎదిరించాడు? అతడికి హీరోకు మధ్య గొడవేంటి? అన్నది కథ.
7 . రుద్రమదేవి(అక్టోబర్ 09 , 2015)
UA|157 minutes|బయోగ్రఫీ,థ్రిల్లర్,హిస్టరీ
కాకతీయ సామ్రాజ్ని అయిన రుద్రమ దేవి జీవిత కథ ఆధారంగా తెరెకెక్కింది. పురుషాధిక్య సమాజంలో లింగ వివక్షకు ఎదుర్కొంటూ, ఆమె సింహాసనం అధిష్టిస్తుంది. ఈక్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటన్నది మిగతా కథ.
8 . S/O సత్యమూర్తి(ఏప్రిల్ 09 , 2015)
UA|163 minutes|యాక్షన్,డ్రామా
ఈ సినిమా కథ విరాజ్ ఆనంద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ధనవంతుడైన తండ్రి చనిపోయిన తరువాత అతని జీవితం మారుతుంది. కుటుంబ గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ.. బంధాలు, నైతిక విలువల మధ్య నడవడం ప్రారంభిస్తాడు.
9 . ఎవడు(జనవరి 12 , 2014)
A|166 minutes|యాక్షన్,రొమాన్స్
సత్య(అల్లు అర్జున్), దీప్తి (కాజల్ అగర్వాల్) ఇద్దరూ లవర్స్. పెద్ద రౌడీ అయిన వీరూ భాయ్ (రాహుల్ దేవ్) దీప్తిని చూసి ఇష్టపడతాడు. సత్య - దీప్తి ఆ రౌడీలకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. కట్ చేస్తే వీరూ భాయ్, అతని గ్యాంగ్‌ని చరణ్ (రామ్ చరణ్) చంపడం మెుదలు పెడతాడు. అసలు చరణ్ ఎవరు? సత్యకి అతనికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
10 . రేసు గుర్రం(ఏప్రిల్ 11 , 2014)
UA|163 minutes|యాక్షన్,రొమాన్స్
హీరోకి తన అన్న అంటే అస్సలు పడదు. పోలీసు అధికారైన తన అన్నను ఓ పోలిటిషియన్ చంపాలని చూస్తున్నట్లు హీరో తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? అన్నను కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్లాన్లు వేశాడు? అన్నది కథ.
11 . ఇద్దరమ్మాయిలతో(మే 31 , 2013)
UA|143 minutes|రొమాన్స్,థ్రిల్లర్
సంజు రెడ్డి స్పెయిన్‌లో లీడ్ గిటారిస్ట్. కొంతమందితో కలిసి బ్యాండ్ నడుపుతుంటాడు. ఈక్రమంలో ఇండియాలో బాగా ధనవంతురాలైన, యూనియన్ మినిస్టర్ కూతురైన ఆకాంక్ష సైకాలజీలో పిజి చేయడానికి స్పెయిన్ వస్తుంది. తను దిగిన ఇంట్లో, ఇదివరకూ అదే ఇంట్లో ఉన్న వారికి సంబందించిన డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీకి సంజూ రెడ్డికి మధ్య సంబంధమే సినిమా కథ.
12 . జులాయి(ఆగస్టు 08 , 2012)
UA|152 minutes|యాక్షన్,హాస్యం
రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.
13 . బద్రీనాథ్(జూన్ 10 , 2011)
A|132 minutes|యాక్షన్
బద్రి తన గురువు భీష్మ దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు. గురువు ఆదేశాలతో బద్రినాథ్ ఆలయానికి సంరక్షకుడిగా వెళ్తాడు. అలకనంద రాకతో బద్రి జీవితం కీలక మలుపు తిరుగుతుంది.
14 . వేదం(జూన్ 04 , 2010)
UA|135 minutes|డ్రామా
రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
15 . వరుడు(మార్చి 31 , 2010)
UA|డ్రామా
సందీప్ అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. తన కాబోయే భార్యను సెలక్ట్ చేసే బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగిస్తాడు. అయితే తీరా అతను పెళ్లి చేసుకునే క్రమంలో వధువు కిడ్నాప్ కావడంతో కథ మలుపు
తిరుగుతుంది.
16 . ఆర్య 2(నవంబర్ 27 , 2009)
UA|165 minutes|రొమాన్స్
ఇద్దరు అనాథలు చిన్నతనంలో విడిపోయి పెద్దయ్యాక కలుసుకుంటారు. ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు కథ ఆసక్తికరంగా మారుతుంది.
17 . పరుగు(మే 01 , 2008)
U|169 minutes|రొమాన్స్
నీలకంఠం పెద్ద కూతురు బాబు అనే కుర్రాడితో వెళ్లిపోతుంది. దీంతో అతడి ఫ్రెండ్స్‌ను నీలకంఠం మనుషులు బందిస్తారు. బందీగా వచ్చిన కృష్ణ నీలకంఠం చిన్న కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
18 . దేశముదురు(జనవరి 12 , 2007)
UA|148 minutes|యాక్షన్,రొమాన్స్
ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే బాలా గ్యాంగ్‌స్టర్ తమ్ముడిని కొట్టి ఇబ్బందుల్లో పడుతాడు. అతని నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. గ్లాంగ్ స్టర్‌తో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది మిగతా కథ.
19 . హ్యాపీ(జనవరి 27 , 2006)
U|152 minutes|డ్రామా,రొమాన్స్
ఒక రాజకీయనాయకుడు తన కూతురు పెళ్లిని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్‌తో నిశ్చయిస్తాడు. అయితే ఆ పెళ్లి ఇష్టంలేని ఆమె ఓ పిజ్జా బాయ్‌ను లవ్ చేస్తున్నట్లు నాటకం ఆడటంతో కథ మలుపు తిరుగుతుంది.
20 . బన్నీ(ఏప్రిల్ 06 , 2005)
U|139 minutes|హాస్యం,రొమాన్స్
ఒక కోటీశ్వరుడి కూతురు తన బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవడానికి అతని ఇష్టానికి విరుద్ధంగా వెళుతుంది. అయితే, ఆమె తండ్రి చివరకు వారి పెళ్లికి ఒప్పుకున్నప్పుడు ఆమె కాబోయే భర్త కట్నంగా తన తండ్రి ఆస్తి మొత్తాన్ని కోరుతాడు.