• TFIDB EN
  • Editorial List
    SS రాజమౌళి సినిమాల జాబితా
    Dislike
    1 day ago

    భారత చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి, RRR విజయాలతో దేశంలోనే అగ్రశ్రేణి డైరెక్టర్‌గా నిలిచాడు. మరి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఏవో ఇక్కడ చూడండి

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఆర్ఆర్ఆర్(మార్చి 25 , 2022)
    UA|182 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
    2 . బాహుబలి 2: ది కన్‌క్లూజన్(ఏప్రిల్ 28 , 2017)
    UA|171 minutes|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి తన వారసత్వం గురించి కట్టప్ప ద్వారా తెలుసుకుంటాడు. మాహిష్మతి సింహాసనాన్ని అధిష్టించేందుకు.. భళ్లాలదేవుడితో యుద్ధంలో పోరాడుతాడు.
    3 . బాహుబలి: ది బిగినింగ్(జూలై 10 , 2015)
    UA|158 minutes (Telugu)159 minutes (Tamil)|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు... ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు.
    4 . ఈగ(జూలై 06 , 2012)
    UA|134 minutes|ఫాంటసీ,రొమాన్స్
    నాని, బిందు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే బిందుపై కన్నేసిన సుదీప్‌ నానిని చంపేస్తాడు. పూనర్జన్మలో ఈగగా పుట్టిన నాని.. సుదీప్‌పై ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది కథ.
    5 . మర్యాద రామన్న(జూలై 23 , 2010)
    U|125 minutes|యాక్షన్,హాస్యం
    రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
    6 . మగధీర(జూలై 31 , 2009)
    A|166 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    రఘువీర్ ఇందిర తండ్రిని హత్య చేసి ఆ నేరాన్ని ఆమె ప్రేమించిన హర్షపై వేస్తాడు. దీంతో అపార్థం చేసుకున్న ఆమె హర్షకు దూరంగా వెళ్లిపోతుంది. ఇందిరను వెతుకుతూ బయల్దేరిన హర్ష తన పూర్వ జన్మ గురించి తెలుసుకుంటాడు.
    7 . యమదొంగ(ఆగస్టు 15 , 2007)
    U|179 minutes|డ్రామా,ఫాంటసీ
    రాజా ఒక అనాథ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. ఈక్రమంలో ఓ ధనవంతుడి మనవరాలు మహిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసే క్రమంలో మరణిస్తాడు. అతను యమలోకానికి వెళ్లి యమదేవుడితో తన జీవితాన్ని తిరిగిపొందేందుకు అతనితో పోరాడుతాడు.
    8 . విక్రమార్కుడు(జూన్ 23 , 2006)
    UA|161 minutes|యాక్షన్,హాస్యం
    సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాథోడ్‌ను పోలి ఉండే సత్తిబాబు, అతని మరణం తర్వాత అతని కుమార్తెను దత్తత తీసుకుంటాడు. రాథోడ్ స్థానంలో పోలీసు అధికారిగా వెళ్లి దుష్ట బావూజీ దోపిడీలను అంతం చేస్తాడు.
    9 . ఛత్రపతి(సెప్టెంబర్ 29 , 2005)
    UA|165 minutes|డ్రామా
    శివాజీ అతడి కుటుంబం ఓ కారణం చేత శ్రీలంక నుంచి విశాఖకు వలస వస్తారు. అక్కడ తమను బానిసలుగా చూస్తున్న బాజీరావు అనే రౌడీకి శివాజీ ఎదురు తిరుగుతాడు. తన వారికి అండగా నిలిచి లీడర్‌గా ఎదుగుతాడు.
    10 . సై(సెప్టెంబర్ 23 , 2004)
    UA|163 minutes[citation needed]|యాక్షన్,డ్రామా,క్రీడలు
    ఓ మాఫియా లీడర్ నుంచి తమ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ఆర్ట్స్, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ లీడర్స్ అయిన శశాంక్, పృథ్వీ చేతులు కలుపుతారు. మాఫియా లీడర్‌తో రగ్బీ మ్యాచ్ గెలిస్తే మైదానం విద్యార్థులది అవుతుంది.
    11 . సింహాద్రి(జూలై 09 , 2003)
    U|175 minutes|డ్రామా
    సింహాద్రి (జూ.ఎన్టీఆర్‌)ను రామ్ భూపాల్‌ వర్మ (నాజర్‌) చిన్నప్పుడే దత్తత తీసుకుంటాడు. వర్మ మనవరాలు సింహాద్రిని ప్రేమిస్తుంది. అయితే సింహాద్రి వద్ద ఓ మతిస్థిమితం లేని అమ్మాయి ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు? కేరళతో హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    12 . స్టూడెంట్ నెం: 1(సెప్టెంబర్ 27 , 2001)
    UA|148 minutes|డ్రామా,మ్యూజికల్
    ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించే క్రమంలో సమస్యల్లో పడుతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు.

    @2021 KTree