• TFIDB EN
  • Editorial List
    మహేష్ బాబు నటించిన టాప్ కామెడీ చిత్రాలు
    Dislike
    2 days ago

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం యాక్షన్ చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైమ్‌మెంట్ చిత్రాలే కాకుండా కామెడీ చిత్రాల్లోనూ నటించారు. కమర్షియల్ హంగులతో బ్లాక్‌ బాస్టర్ హిట్లు సాధించారు. ఆయన కెరీర్ ఆరంభంలో తొలుత కామెడీ జనర్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన నటించిన బెస్ట్ కామెడీ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . రాజకుమారుడు(జూలై 30 , 1999)
    U|162 minutes|డ్రామా,రొమాన్స్
    సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ. (హీరోగా మహేష్‌కు ఇది తొలి చిత్రం)
    2 . మురారి(ఫిబ్రవరి 17 , 2001)
    UA|182 minutes|డ్రామా,రొమాన్స్,థ్రిల్లర్
    మురారి.. తన మరదలు వసుంధరను గాఢంగా ప్రేమిస్తాడు. అయితే తన వంశానికి ఉన్న ఓ శాపం వల్ల తాను చనిపోతానని మురారి తెలుసుకుంటాడు. వసుంధరను ప్రేమించిన బుల్లబ్బాయి కోపంతో మురారి గునపంతో పొడుస్తాడు. దీంతో మురారి చావుబతుకుల మధ్య పోరాడుతాడు.
    3 . యువరాజు(ఏప్రిల్ 14 , 2000)
    U|166 minutes|డ్రామా,రొమాన్స్
    శ్రీనివాస్, శ్రీవల్లి అనే ఇద్దరు క్లాస్‌మేట్స్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే శ్రీనివాస్‌తో కొన్నేళ్లుగా పరిచయం ఉన్న శ్రీలత వారి నిశ్చితార్థానికి రావడంతో వారి జీవితాలు మలుపు తిరుగుతాయి.
    4 . ఒక్కడు(జనవరి 15 , 2003)
    U|171 minutes|యాక్షన్,రొమాన్స్
    అజయ్ జాతీయ స్థాయి కబడ్డి ప్లేయర్. శిక్షణ నిమిత్తం కర్నూలుకు వెళ్తాడు. అక్కడ స్వప్న అనే అమ్మాయిని ఓబుల్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు చెర నుంచి కాపాడుతాడు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి తన కుటుంబానికి తెలియకుండా ఇంట్లోనే ఉంచుతాడు. మహేష్ బాబు కేరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా.
    5 . ఖలేజా(అక్టోబర్ 07 , 2010)
    UA|164 minutes|యాక్షన్
    ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు.
    6 . సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(జనవరి 11 , 2013)
    U|159 minutes|డ్రామా,ఫ్యామిలీ
    ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.
    7 . బిజినెస్‌మెన్(జనవరి 13 , 2012)
    A|131 minutes|యాక్షన్
    ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.
    8 . దూకుడు(సెప్టెంబర్ 23 , 2011)
    UA|175 minutes|యాక్షన్,డ్రామా
    మాజీ ఎమ్మెల్యే శంకర్‌ కోమాలోకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. డాక్టర్లు ఆయనకు షాకింగ్ విషయాలు చెప్పవద్దని చెప్తారు. దీంతో పోలీసాఫీసర్ అయిన అజయ్‌ తన తండ్రిని సంతోషంగా ఉంచేందుకు యత్నిస్తాడు. అదే సమయంలో తండ్రికి అన్యాయం చేసిన వారిపై ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ.
    9 . ఆగడు(సెప్టెంబర్ 19 , 2014)
    UA|163 minutes|యాక్షన్,హాస్యం
    పోలీసు అధికారి అయిన హీరో సమస్యలతో నిండిన పట్టణానికి వస్తాడు. అక్కడ విలన్‌ చేస్తున్న చట్ట విరుద్ధ పనులను అడ్డుకుంటాడు. ఈ క్రమంలో హీరోకు ఎదురైన సమస్యలు ఏంటి? విలన్ - హీరోకు మధ్య అంతకుముందే ఏమైన గొడవ ఉందా? అన్నది కథ.
    10 . గుంటూరు కారం(జనవరి 12 , 2024)
    UA|యాక్షన్,డ్రామా
    రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల అతని తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లికి దూరంగా 25 ఏళ్లు పెరిగిన తర్వాత తిరిగి ఆమె ప్రస్తావన వస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతాయి. మరి రమణ తన తల్లిని కలిశాడా? లేదా? అసలు వసుంధర తన కొడుకును ఎందుకు దూరం పెట్టింది ? ఇద్దరి మధ్య దూరానికి కారణం ఎవరు? అన్నది మిగతా కథ.

    @2021 KTree