Editorial List
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు
60+ views19 days ago
టాలీవుడ్‌లో హిట్ కాంబోగా అల్లు అర్జున్- సుకుమార్‌లకు మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఆ సినిమాలేంటో చూడండి
1 . పుష్ప 2: ది రూల్(డిసెంబర్ 05 , 2024)
UA|యాక్షన్,డ్రామా
పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఓ రోజు సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి (రష్మిక) ఆశగా అడుగుతుంది. పుష్ప ఇందుకు యత్నించగా సీఎం హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)ను సీఎం చేస్తానని సవాలు విసురుతాడు. ఇందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
2 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
3 . ఆర్య 2(నవంబర్ 27 , 2009)
UA|165 minutes|రొమాన్స్
ఇద్దరు అనాథలు చిన్నతనంలో విడిపోయి పెద్దయ్యాక కలుసుకుంటారు. ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు కథ ఆసక్తికరంగా మారుతుంది.
4 . ఆర్య(మే 07 , 2004)
U|151 minutes|డ్రామా,రొమాన్స్
అజయ్ గీతను ప్రేమిస్తాడు. కానీ గీత అతను చేసిన ప్రేమప్రతిపాదనను తిరస్కరించినప్పుడు బిల్డింగ్‌పై నుంచి దూకెస్తానని అజయ్ బెదిరిస్తాడు. దీంతో గీత అజయ్ లవ్ ప్రపోజలన్‌ను అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా గీతకు ఆర్య లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.