Editorial List
యానిమల్ సినిమా మాదిరి తండ్రి- కొడుకుల మధ్య అనుబంధాన్ని చాటిన సంఘర్షణాత్మక చిత్రాలు
500+ views11 months ago
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న యానిమల్ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కథ.. తండ్రి, కొడుకుల మధ్య సాగే భావోద్వేగాల పరంపర, ఇరువురి మధ్య అనుబంధం సంఘర్షణాత్మక ధోరణిలో సాగినట్లు యానిమల్ సినిమా ట్రైలర్ ద్వారా అర్థమైంది. అయితే యానిమల్ చిత్రాన్ని పోలిన సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. తండ్రి- కొడుకుల అనుబంధాన్ని చాటిచెప్పిన చిత్రాలను ఇక్కడ సేకరించడం జరిగింది. వాటిపై ఓ లుక్ వేయండి.
1 . ఇడియట్(ఆగస్టు 22 , 2002)
U|133 minutes|యాక్షన్,హాస్యం
చంటి అనే యువకుడిని దుండగులు కొట్టినప్పుడు సుచిత్ర అనే యువతి అతనికి రక్త దానం చేసి కాపాడుతుంది. ఈ విషయం తెలిసిన చంటి ఆమెతో ప్రేమలో పడుతాడు. సుచిత్ర తండ్రి పోలీస్ కమిషనర్ కావడంతో చంటి అతని నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
2 . వాసు(ఏప్రిల్ 10 , 2002)
U|147 minutes|మ్యూజికల్
వాసు గొప్ప సంగీతకారుడు కావాలని కలలు కంటుంటాడు. సివిల్స్ చేయాలన్న తన కోరికకు విరుద్ధంగా వాసు వెళ్తుండటంతో తండ్రి కోపం పెంచుకుంటాడు. చివరికి వాసు ఏం చేశాడు? అన్నది కథ.
3 . దూకుడు(సెప్టెంబర్ 23 , 2011)
UA|175 minutes|యాక్షన్,డ్రామా
మాజీ ఎమ్మెల్యే శంకర్ కోమాలోకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. డాక్టర్లు ఆయనకు షాకింగ్ విషయాలు చెప్పవద్దని చెప్తారు. దీంతో పోలీసాఫీసర్ అయిన అజయ్ తన తండ్రిని సంతోషంగా ఉంచేందుకు యత్నిస్తాడు. అదే సమయంలో తండ్రికి అన్యాయం చేసిన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అన్నది కథ.
4 . ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(ఏప్రిల్ 27 , 2007)
UA|157 minutes|డ్రామా
గణేష్ ఒక నిరుద్యోగి.. కీర్తిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె సాయంతో కీర్తి పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధిస్తాడు. అయితే, ఆమె అప్పటికే వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నట్లు గణేష్ తెలుస్తుంది. ఓ సంఘటన వల్ల గణేష్ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్తాడు. గణేష్‌ను మాములు మనిషి చేసేందుకు అతని స్నేహితుడు తన ఊరికి తీసుకెళ్తాడు. ఈ క్రమంలో అతనికి ఓ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.
5 . సూర్యవంశం(ఫిబ్రవరి 25 , 1998)
U|163 minutes|డ్రామా
భాను నిరక్షరాస్యుడు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు నోచుకోడు. ఒక అమ్మాయితో తండ్రి పెళ్లి నిశ్చయించగా ఓ కారణం చేత చేసుకోనని చెబుతాడు. దీంతో తండ్రికి మరింత దూరం అవుతాడు. భాను మంచి మనసు గురించి తెలుసుకున్న పట్నం యువతి అతడ్ని పెళ్లి చేసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది.
6 . అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(ఏప్రిల్ 19 , 2003)
U|154 minutes|యాక్షన్,ఫ్యామిలీ,రొమాన్స్
చందుకు కిక్‌బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైన నేషనల్ ఛాంపియన్ కావాలనేది అతని కల. తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే చందు తల్లి చనిపోయేటప్పుడు... తండ్రి రఘువీర్‌ను కలవమని కోరడంతో అతని జీవితం మారుతుంది.
7 . S/O సత్యమూర్తి(ఏప్రిల్ 09 , 2015)
UA|163 minutes|యాక్షన్,డ్రామా
ఈ సినిమా కథ విరాజ్ ఆనంద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ధనవంతుడైన తండ్రి చనిపోయిన తరువాత అతని జీవితం మారుతుంది. కుటుంబ గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ.. బంధాలు, నైతిక విలువల మధ్య నడవడం ప్రారంభిస్తాడు.
8 . కొత్త బంగారు లోకం(అక్టోబర్ 09 , 2008)
U|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
బాలు తన క్లాస్‌మేట్ అయిన స్వప్నతో ప్రేమలో పడతాడు. అయితే వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటో పేపర్‌లో వస్తుంది. అది చూసి స్వప్న నాన్న ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు బాలు ఏం చేశాడు? అన్నది కథ.
9 . కిక్(మే 08 , 2009)
UA|162 minutes|యాక్షన్,క్రైమ్,రొమాన్స్
ఎప్పుడు సాహసాలు అంటే ఇష్టపడే కళ్యాణ్‌తో నైనా విడిపోతుంది. అతన్ని వదిలి కళ్యాణ్‌ను వెంబడిస్తున్న పోలీసును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది.
10 . దమ్ము(ఏప్రిల్ 27 , 2012)
A|155 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
రామచంద్ర ఓ అనాథ. సత్యను ప్రేమించడం ద్వారా రెండు రాయల్ కుటుంబాల మధ్య జరుగుతున్న వైరంలో పాలుపంచుకుంటాడు. సత్య కుటుంబంలో భాగమైన రామచంద్రకు సంచలన నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం? సత్య ఫ్యామిలీకి హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
11 . హిట్లర్(జనవరి 04 , 1997)
U|153 minutes|డ్రామా
మాధవరావుకి తన ఐదుగురు చెల్లెళ్లంటే ప్రాణం. క్రూరమైన సమాజం నుండి చెల్లెళ్లను రక్షించే క్రమంలో వారి పట్ల కాస్త కఠినంగా ఉంటాడు. సిస్టర్స్ తన అన్నకు ఎదురు తిరిగినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
12 . అందరివాడు(జూన్ 04 , 2005)
UA|162 minutes|హాస్యం
గోవిందరాజులు (చిరంజీవి) అనే మేస్త్రికి టెలివిజన్ షోను నడిపించే సిద్ధార్థ్ (చిరంజీవి) కుమారుడు. సిద్ధార్థ్ చిన్నతనంలోనే తల్లి మరణిస్తే గోవిందరాజులు తన కొడుకు కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుండా అతన్ని ప్రేమగా పెంచుతాడు. సిద్ధార్థ్ ఒక టీవీ ఛానల్‌లో రిపోర్టరుగా పనిచేస్తుంటాడు. అయితే, సిద్ధార్థ్ ఓ కాంట్రాక్టర్ కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత గోవిందరాజులు దూరమయ్యే అవకాశం ఏర్పడుతుంది.
13 . శంకర్ దాదా MBBS(అక్టోబర్ 15 , 2004)
U|172 minutes|హాస్యం
శంకర్ దాదా.. స్థానికంగా సెటిల్‌మెంట్లు చేసే రౌడీ. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయిన శంకర్ దాదా... తన తల్లిదండ్రులకు తానొక డాక్టర్ అని అబద్దం చెబుతాడు. అయితే శంకర్ డాక్టర్ కాదన్న విషయాన్ని రామలింగేశ్వరరావు అతని తల్లిదండ్రులకు చెబుతాడు.
14 . తులసి(అక్టోబర్ 12 , 2007)
UA|153 minutes|యాక్షన్,డ్రామా
పర్వతనేని తులసిరాం తన భార్య, బిడ్డల కోసం కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని సంఘటనలు తులసిని అతని కుటుంబానికి దూరం చేస్తాయి.
15 . తమ్ముడు(జూలై 15 , 1999)
U|162 minutes|డ్రామా,రొమాన్స్,క్రీడలు
సుభాష్ (పవన్ కల్యాణ్) కాలేజ్ స్టూడెంట్. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ రోజులు గడుపుతుంటాడు. కిక్ బాక్సర్ అయిన సుభాష్ సోదరుడికి ఓ రోజు తీవ్రంగా గాయపడతాడు. దీంతో ఎలాంటి బాక్సింగ్ అనుభవం లేకపోయిన ప్రతర్థితో సుభాష్ తలపడాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
16 . డార్లింగ్(ఏప్రిల్ 23 , 2010)
U|153 mins|డ్రామా
ప్రభ తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో తన చిన్ననాటి స్నేహితురాలు నందినిని కలుస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. అయితే, గ్యాంగ్‌స్టర్ కుమార్తె నిషా అతనితో ప్రేమలో పడడంతో కథ మలుపు తిరుగుతుంది.
17 . ఈశ్వర్(నవంబర్ 11 , 2002)
U|164 minutes|యాక్షన్,డ్రామా
కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఓ యువకుడు స్థానిక ఎమ్మెల్యే కూతురితో ప్రేమలో పడుతాడు. అయితే ఆ రాజకీయ నాయకుడు అతన్ని చంపాలని ప్లాన్ చేయడంతో అతని జీవితం మారుతుంది.
18 . రెబెల్(సెప్టెంబర్ 28 , 2012)
A|176 minutes|యాక్షన్
రిషి తల్లిదండ్రులు దారుణ హత్యకు గురవుతారు. ఇంతకి వారిని చంపిందెవరు? రిషి తండ్రి భూపతిరాజు గతం ఏంటి? స్టీఫెన్ - రాబర్ట్‌ను రిషి ఎందుకు వెతుకున్నాడు? అన్నది కథ.
19 . నాన్నకు ప్రేమతో(జనవరి 13 , 2016)
UA|168 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
20 . నీది నాదీ ఒకే కథ(మార్చి 23 , 2018)
U|డ్రామా
కొడుకు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్ అవ్వాలని కోరుకునే తండ్రి రుద్రరాజు (దేవీ ప్రసాద్). కానీ సాగర్ (శ్రీ విష్ణు) భవిష్యత్తుపై క్లారిటీ లేకుండా టైమ్‌పాస్ చేస్తుంటాడు. మరి సాగర్ తండ్రి కోసం మారాడా? లేదా తనకు నచ్చినట్లే ఉండిపోయాడా? అన్నది కథ.