• TFIDB EN
  • Editorial List
    ETV WIN ఓటీటీ యాప్‌లో తప్పక చూడాల్సిన సినిమాలు
    Dislike
    300+ views
    6 months ago

    ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌పాంలో అలనాటి క్లాసిక్ మూవీలను ఉచితంగా వీక్షించేందుకు అవకాశం ఉంది. వీటిలో సామాజిక స్ఫూర్తిని గుర్తుతెచ్చే సినిమాలు కొన్నికాగా, కుటుంబం, బంధుత్వం, ప్రేమ వంటి విలువలను ఎంతో అద్భుతంగా చూపించిన సినిమాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సినిమాను చూసి పాత తరం నాటి భావాలను నెమరువేసుకోండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . పల్లెటూరి చిన్నోడు(జనవరి 09 , 1974)
    U|148 mins|డ్రామా
    లక్షణుడు భూస్వామితో కలిసి తన అన్న రామయ్యను మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయం తెలుసుకొని రామయ్య లక్ష్మణుడ్ని ఇల్లు వదిలి వెళ్లమని ఆదేశించడంతో సోదరులు విడిపోతారు.
    2 . మంగమ్మ సపధం(మార్చి 06 , 1965)
    U/A|176 minutes|డ్రామా
    ఒక యువరాజుచే అవమానించబడిన ఒక అమ్మాయి, రాజకుమారుడిని వివాహం చేసుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుంది, అతని ద్వారా ఆమె ఒక బిడ్డను కంటుంది. నిజం తెలిసిన యువరాజు ఆమెను జైలుకు పంపిస్తాడు.
    3 . భలే మొనగాడు(జూలై 12 , 1968)
    U/A|డ్రామా
    'భలే మొనగాడు' ఒక జానపద చిత్రం. దీనిని సునందిని పిక్చర్స్‌ పతాకంపై పి.మల్లిఖార్జునరావు రూపొందించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో జానపద బ్రహ్మగా గుర్తింపు పొందిన బి.విఠలాచార్య దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 12, 1968న విడుదల అయ్యింది.
    4 . జగన్మోహిని(జనవరి 01 , 1978)
    U/A|డ్రామా
    మోహిని ఒక రాజు చేత మోసం చేయబడి ఆత్మహత్య చేసుకుంటుంది. తర్వాత దెయ్యంగా మారుతుంది. మరోవైపు రాజు చనిపోయి రాజా అనే రైతుగా పునర్జన్మ పొందుతాడు. దీంతో మోహిని అతనిపై ప్రతీకారానికి యత్నిస్తుంది.
    5 . దసరా బుల్లోడు(జనవరి 13 , 1971)
    U|160 minutes|డ్రామా
    రాధ, నిర్మల ఇద్దరూ గోపిని ప్రేమిస్తారు. కానీ గోపికి రాధ మాత్రమే ఇష్టం. వారి మనసులు తెలుసుకున్న నిర్మల వారిద్దరిని కలపాలని నిర్ణయించుకుంటుంది.
    6 . స్వాతీ కిరణం(జనవరి 01 , 1992)
    U|130 minutes|డ్రామా,మ్యూజికల్
    ఒక వృద్ధుడిని గొర్రెల కాపరులు దొంగ అని తప్పుగా భావించి కొడుతారు. అతన్ని అరెస్టు చేసిన పోలీసు అధికారి అతను ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు అని తెలుసుకుంటాడు.
    7 . గూడాచారి 116(ఆగస్టు 11 , 1966)
    U|170 minutes|యాక్షన్,థ్రిల్లర్
    అంతర్జాతీయ క్రిమినల్ ముఠాకు వ్యతిరేకంగా ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలను సేకరించిన తర్వాత సీక్రెట్ ఏజెంట్ 303 హత్యకు గురవుతాడు. దీంతో ఏజెంట్ 116 తన సహోద్యోగి హత్య గురించి నిజాన్ని వెలికితీసే లక్ష్యంతో బయలుదేరాడు.
    8 . మయూరి(undefined 00 , 1985)
    U|142 minutes|మ్యూజికల్
    మయూరి అనేది సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన మరియు రామోజీ రావు నిర్మించిన 1985 భారతీయ తెలుగు భాషా జీవిత చరిత్ర నృత్య చిత్రం. సుధా చంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, పి.ఎల్.నారాయణ, నిర్మలమ్మ, వై.విజయ, పొట్టి ప్రసాద్, కె.కె.శర్మ, ఎస్.ఆర్.రాజు, సుత్తి వీరభద్రరావు సహాయక పాత్రలు పోషించారు.
    9 . నవ మోహిని(నవంబర్ 08 , 1984)
    U/A|డ్రామా,హారర్
    రాజా, రాధా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇది ఇష్టం లేని రాజా తండ్రి రాధాను చంపేస్తాడు. ప్రతీకారం కోసం ఆమె దయ్యంగా తిరిగివచ్చినప్పుడు కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
    10 . గోల్‌మాల్ గోవిందం(ఫిబ్రవరి 08 , 1992)
    U/A|హాస్యం,డ్రామా
    గోవిందానికి ఓ ముగ్గురు వ్యక్తులతో సంబంధం ఉన్న ఓ యువతి డైరీ దొరుకుతుంది. అయితే ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయినట్లు తెలుసుకుంటాడు. అయితే ఆమెకు ఒక అబ్బాయి జన్మించాడని ఆ పిల్లాడు ఓ ముగ్గురి కొడుకు అని వెర్వేరుగా చెప్పి నమ్మిస్తాడు. వారి నుంచి డబ్బు గుంజేందుకు ప్లాన్ చేస్తాడు.
    11 . షావుకారు(ఏప్రిల్ 07 , 1950)
    U|177 minutes|డ్రామా
    వడ్డీ వ్యాపారి కొడుకు సత్యం తన పొరుగింటి అమ్మాయి సుబ్బులుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే, కొన్ని కారణాల వల్ల సత్యం జైలుకు వెళ్లడంతో సమస్యలు ఎదురవుతాయి.
    12 . పాడుతా తీయగా(మే 28 , 1998)
    U/A|డ్రామా
    వినీత్‌, హీరా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి క్రాంతి కుమార్‌ దర్శకత్వం వహించారు. ఉషాకిరణ్‌ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించారు. మహేష్‌ సంగీతం అందించారు.
    13 . అసెంబ్లీ రౌడీ(జూన్ 03 , 1991)
    U/A|యాక్షన్,డ్రామా
    తప్పుడు హత్య కేసులో శివాజీ అరెస్ట్‌ అవుతాడు. ఆ కేసు విచారణలో ఉండగా శివాజీ ఎన్నికల్లో పోరాడి గెలుస్తాడు. అతను రాజకీయాల్లో ఉన్న అవినీతిని బయటకు తీసి ప్రజల తరఫున పోరాడుతాడు.
    14 . కాళి(సెప్టెంబర్ 19 , 1980)
    A|144 minutes|యాక్షన్,డ్రామా
    జైలు నుండి విడుదలైన తర్వాత, కాళి తన కుటుంబ సభ్యుల మరణానికి కారణమైన ధనిక వ్యాపారవేత్త రాజారావుపై ప్రతీకారం తీర్చుకునేందుకు బయల్దేరుతాడు.

    @2021 KTree