Editorial List
NTR టాప్ 15 బెస్ట్ చిత్రాలు
300+ views8 months ago
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారాకరామారావు దిగ్గజ నటులు. ఆయన నటించిన ప్రతి సినిమా ఒక రత్నం లాంటింది. తెలుగింటి శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో NTR పరకాయ ప్రవేశం చేసేవారు. ఎంత పెద్ద డైలాగ్‌నైనా సింగిల్ టేక్‌లో చెప్పడం ఆయన ప్రత్యేకత. NTR నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన చిత్రాలను ఓసారి చూద్దాం.
1 . మేజర్ చంద్రకాంత్(ఏప్రిల్ 23 , 1993)
U|డ్రామా
ఆర్మీ మేజర్‌గా రిటైర్ అయిన చంద్రకాంత్ సమాజంలో అవినీతి రాజకీయనాయకులపై పోరాడుతాడు. ఈక్రమంలో తన కొడుకు డ్రగ్ మాఫియాలో చిక్కుకున్నాడని తెలిసి.. అతన్ని మంచివాడిగా మార్చేందుకు పూనుకుంటాడు.
2 . బొబ్బిలి పులి(జూలై 09 , 1982)
A|176 mins|యాక్షన్,డ్రామా
అవినీతి మయంగా మారిన ప్రభుత్వ రంగాన్ని తనదైన రీతిలో బాగు చేయాలని ఒక ఆర్మీ ఆఫీసర్ నిర్ణయించుకుంటాడు. అయితే పరిస్థితులు అతనికి సహకరించకపోవడంతో ఇబ్బందుల్లో పడుతాడు.
3 . జస్టిస్ చౌదరి(మే 28 , 1982)
U|155 minutes|డ్రామా
జస్టిస్ చౌదరి 1982లో విడుదలైన భారతీయ తెలుగు-భాష యాక్షన్ డ్రామా చిత్రం, దీనిని T. త్రివిక్రమ రావు నిర్మించారు మరియు K. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో N. T. రామారావు మరియు శ్రీదేవి నటించారు, చక్రవర్తి సంగీతం అందించారు. ఈ చిత్రం హిందీలో జస్టిస్ చౌదరిగా, తమిళంలో నీతిబతిగా మరియు మలయాళంలో జస్టిస్ రాజాగా రీమేక్ చేయబడింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది మరియు రామారావు స్వంత బొబ్బిలి పులి తర్వాత 1982 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది.
4 . వేటగాడు(జూలై 05 , 1979)
U|149 mins|డ్రామా
వేటగాడైన రామారావు.. శ్రీదేవిని ప్రేమిస్తాడు. అయితే శ్రీదేవి తండ్రి జగ్గయ్య వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. శ్రీదేవి తల్లి మరణానికి రామారావు తండ్రి కారణమని జగ్గయ్య భావిస్తుంటాడు. మరోవైపు శ్రీదేవిని పెళ్లి చేసుకోని ఆస్తి కొట్టేయాలని విలన్ కొడుకు యత్నిస్తుంటాడు. చివరికీ ఏమైంది? అన్నది కథ.
5 . రక్త సంబంధం(నవంబర్ 01 , 1962)
U|144 minutes|డ్రామా
నిరుపేద రాజు తన సోదరి రాధకు మంచి జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. సంపన్న వ్యక్తితో ఆమె వివాహాన్ని నిశ్చయిస్తాడు. కానీ ఆమె తన స్నేహితుడు ఆనంద్‌తో ప్రేమలో ఉందని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది.
6 . కన్యాశుల్కం(ఆగస్టు 26 , 1955)
U|167 minutes|డ్రామా
ఈ చిత్రం ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యాశుల్కం నాటకం ఆధారంగా రూపొందింది. వెంకటేశం తన తొమ్మిదేళ్ల కుమార్తెను డబ్బుకోసం ధనవంతుడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. దీంతో కరటక శాస్త్రి వెంకటేశంకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు.
7 . మల్లీశ్వరి(డిసెంబర్ 20 , 1951)
U|175–194 minutes|డ్రామా,రొమాన్స్
రాణి వాసం అంటే అందమైన యువతులు వచ్చి ప్యాలెస్‌లో బస చేయడం, మగవాళ్లను కలవడానికి వీలుండదు. అయితే నాగరాజును గాఢంగా ప్రేమిస్తున్న మల్లీశ్వరి తనకు ఇష్టం లేకున్న రాణివాసం వెళ్లాల్సి వస్తుంది. ఈక్రమంలో వేరుపడిన నాగరాజు, మల్లీశ్వరి విరహ వేదనను అనుభవిస్తారు.
8 . గుండమ్మ కథ(జూన్ 07 , 1962)
U|166 minutes|హాస్యం,డ్రామా
గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు.
9 . మిస్సమ్మ(జనవరి 12 , 1955)
U|181 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు.
10 . దాన వీర శూర కర్ణ(జనవరి 14 , 1977)
U|226 minutes|డ్రామా,ఫాంటసీ
కర్ణుడు.. దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు. స్నేహాన్ని గౌరవించడం కోసం చాలా వరకూ వెళ్తాడు. పాండవులతో యుద్ధంలో దుర్యోధనుడికి సాయం చేస్తాడు.
11 . భూకైలాస్(మార్చి 20 , 1958)
U|174 minutes|డ్రామా,మ్యూజికల్
రావణుడు భక్తికి మెచ్చి శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. దానిని నెలపై ఉంచితే ఆత్మలింగం శక్తులు పోతాయని షరతు విధిస్తాడు. రావణాసురుడికి అమరత్వం వస్తే భూలోకం నాశనం అవుతుందని భావించిన నారధుడు గణేశుడి సాయం కోరతాడు.
12 . లవ కుశ(మార్చి 29 , 1963)
U|208 min|డ్రామా,మ్యూజికల్
రాముడు గర్భవతి అయిన సీతను వనవాసానికి పంపినప్పుడు ఆమె కవల కుమారులకు జన్మనిస్తుంది. వారు పెద్దయ్యాక అశ్వమేధ యజ్ఞానికి అంతరాయం కలిగించడానికి అయోధ్యకు వెళ్లినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
13 . శ్రీ కృష్ణార్జున యుద్ధం(జనవరి 09 , 1963)
U|167 mins|డ్రామా,హిస్టరీ
గంధర్వుడు పుష్పక విమానంలో వెళ్తూ తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంద్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని దోసిలిలో పడుతుంది. ఆగ్రహించిన కృష్ణుడు గంధర్వుడ్ని సంహరిస్తానని శపథం చేస్తాడు. దీంతో గంధర్వుడు అర్జునుడి శరణు కోరతాడు. ఇచ్చిన మాట కోసం అర్జునుడు కృష్ణుడితో పోరాడతాడు.
14 . నర్తనశాల(అక్టోబర్ 11 , 1963)
U|174 minutes|డ్రామా,మ్యూజికల్
పాండవులు 13 సంవత్సరాల వనవాసాన్ని ముగించి, విజయదశమి వరకు తమ నిజస్వరూపాన్ని దాచుకోవాలి. అర్జున్ కుమారుడు, అభిమన్యు, విరాట కుమార్తె ఉత్తరాతో ప్రేమలో పడతాడు, కానీ అతని గుర్తింపును వెల్లడించలేదు.
15 . పాతాళ భైరవి(మార్చి 15 , 1951)
U|195 minutes|డ్రామా,ఫాంటసీ
ఉజ్జయిని యువరాణి ఇందుమతితో సాధారణ తోటమాలి కొడుకు అయిన తోటరాముడు ప్రేమలో పడుతాడు. ఈ విషయం తెలిసిన మహారాజు అతన్ని మందలిస్తాడు. కానీ తోటరాముడు, యువరాణిని తనతో పెళ్లి చేయాలంటే ఏం కావాలో అడగమని రాజును ఛాలెంజ్ చేస్తాడు. అయితే తన దగ్గర ఉన్న సంపదతో సమానమైన సంపదను తెస్తే పెళ్లి చేస్తానని మహారాజు హామీ ఇస్తాడు. మరి తోటరాముడు అంత ఆస్తిని సంపాదించాడా? లేదా అన్నది మిగతా కథ
16 . మాయాబజార్(మార్చి 27 , 1957)
U|184 minutes(Telugu)174 minutes(Tamil)|హాస్యం,డ్రామా,మైథలాజికల్
బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.