Editorial List
నాగచైతన్య టాప్ యాక్షన్ సినిమాలు
400+ views1 year ago
అక్కినేని నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య నటనపరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జయపజయాలతో సంబంధం లేకుండా.. విలక్షణమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. డిఫరెంట్ యాక్షన్ జనర్స్‌లో నటిస్తూ మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. తాజాగా ఆయన నటించిన 'ధూత' వెబ్ సిరీస్ డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈక్రమంలో చైతూ నటించిన టాప్ 10 యాక్షన్ చిత్రాలు మీకోసం..
1 . సాహసం శ్వాసగా సాగిపో(నవంబర్ 11 , 2016)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్,థ్రిల్లర్
ఓ లాంగ్ రైడ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను ఎలా చిగురింప చేసింది? ఈ క్రమంలో వారు పొందిన అనుభూతులు ఏంటి? ఈ రైడ్‌లో వారికి ఎదురైన భయానక సంఘటన ఏమిటీ? అన్నది కథ.
2 . జోష్(సెప్టెంబర్ 05 , 2009)
UA|168 minutes|డ్రామా
దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు.
3 . తడాఖా(మే 10 , 2013)
UA|147 minutes|యాక్షన్,రొమాన్స్
శివరామ కృష్ణ, కార్తీక్ అన్నదమ్ములు. శివరామ కృష్ణ పిరికి కాగా.. కార్తీక్ ధైర్యవంతుడు. వారి తండ్రి పోలీస్ అధికారి డ్యూటీలో ఉండగా చనిపోతారు. ఆ ఉద్యోగాన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ శివరామ కృష్ణకు అందిస్తుంది.
4 . దోచెయ్(ఏప్రిల్ 24 , 2015)
U|136-minute|యాక్షన్,హాస్యం,థ్రిల్లర్
చందు అనే యువకుడు తన తండ్రిని జైలు నుండి తప్పించి, తన సోదరిని డాక్టర్‌గా మార్చాలని అనుకుంటాడు. అయితే, క్రిమినల్ అయిన మాణిక్యంతో తలపడినప్పుడు అతని కలలు చెదిరిపోతాయి.
5 . ఆటోనగర్ సూర్య(జూన్ 27 , 2014)
A|157 minutes(Initial Version)145 minutes(Final Version)|డ్రామా,థ్రిల్లర్
ఆటోనగర్‌ను ఇంద్రన్న(జయ ప్రకాష్ రెడ్డి), మేయర్ కోటిలింగం (మధు) గుప్పెట్లోకి తీసుకుంటారు. ప్రజలను మభ్యపెట్టి అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంటారు. జైలు నుంచి ఆ ప్రాంతానికి వచ్చి సూర్య (నాగచైతన్య) రాబందుల రాజ్యాన్ని కూలదోయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం చేశాడు? విలన్లతో ఎలా తలపడ్డాడు? అన్నది కథ.
6 . బెజవాడ(డిసెంబర్ 01 , 2011)
A|యాక్షన్,క్రైమ్
విజయవాడలో కాళి సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. అతడికి కుడి భుజంగా ఉంటూ సహకరిస్తుంటాడు విజయ్. ఇది చూసి ఓర్వలేక కాళీ తమ్ముడు శంకర్.. విజయ్‌ను చంపుతాడు. తన అన్న చావుపై రివేంజ్ తీర్చుకునేందుకు శివ (హీరో) రంగంలోకి దిగుతాడు. శంకర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
7 . యుద్ధం శరణం(సెప్టెంబర్ 08 , 2017)
UA|141m|యాక్షన్,రొమాన్స్,థ్రిల్లర్
అర్జున్ తల్లిదండ్రుల శవాలు నదిలో కపిస్తాయి. వారి చావుకు కారణమైన వారిని కనుగొనేందుకు అర్జున్ బయలుదేరాడు. కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకున్న తర్వాత హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకు అర్జున్‌కు తెలిసిన నిజం ఏమిటి అన్నది మిగతా కథ.
8 . సవ్యసాచి(నవంబర్ 02 , 2018)
UA|150 minutes|యాక్షన్,డ్రామా
విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య) వానిషింగ్ ట్వీన్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడే యువకుడు. ఆనందం, ఆందోళన సమయంలో వ్యాధి కారణంగా అతడి రెండో చేయి తీవ్రంగా స్పందిస్తుంది. ఇందుకు కారణం ఏమిటీ? తన భావ మరణానికి కారణమైన విలన్ (మాధవన్)పై అతడు ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది కథ.
9 . కస్టడీ(మే 12 , 2023)
UA|148 minutes|థ్రిల్లర్,క్రైమ్ సినిమా,యాక్షన్,క్రైమ్
శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. అయితే పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి)ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మరోవైపు రేవతికి వేరే పెళ్లి నిశ్చయించారని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు తీసుకెళ్తాడు. అసలు రాజన్న ఎవరు? అతన్ని చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.