Editorial List
నాగార్జున నటించిన టాప్ కామెడీ చిత్రాలు
20+ views1 month ago
అక్కినేని నాగార్జున టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా ఆయన వెలుగొందుతున్నారు. తెలుగులో కామెడీని సహజంగా పంచగల అతికొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. నాగేశ్వరరావు నట వారసుడిగా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. తన తండ్రిలాగే ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. ఆయన కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన కామెడీ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1 . అల్లరి అల్లుడు(అక్టోబర్ 06 , 1993)
U|158 minutes|డ్రామా
కాలేజీ స్టూడెంట్ అయిన కళ్యాణ్‌ను శ్రావణి ప్రేమిస్తున్నట్లు చెప్పి అందరి ముందు అవమానిస్తుంది. దీంతో శ్రావణికి గుణపాఠం చెప్పేందుకు మారువేషంలో ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆమె తల్లి అఖిలండేశ్వరి ఆస్తి తాలుకు సమస్యల నుంచి కాపాడుతాడు.
2 . మాస్(డిసెంబర్ 23 , 2004)
UA|162 minutes|యాక్షన్,డ్రామా
మాస్ ఒక అనాథ. మాఫియా డాన్ కూతురితో ప్రేమలో ఉన్న తన యజమాని కొడుకు ఆదితో మంచి బంధం ఏర్పడుతుంది. ప్రేమికులను విడదీసే ప్రయత్నంలో, గ్యాంగ్‌స్టర్లు ఆదిని చంపుతారు. దీంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మాస్ బయలుదేరుతాడు.
3 . దేవదాస్(సెప్టెంబర్ 27 , 2018)
U|164 mins|యాక్షన్,డ్రామా
దేవ (నాగార్జున) పెద్ద డాన్. ఓ రోజు బుల్లెట్ గాయంతో దాస్ (నాని) క్లినిక్‌కు వస్తాడు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. దాస్‌తో స్నేహం దేవ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? తనని చంపాలని చూస్తున్న డేవిడ్‌ను దేవ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
4 . గీతాంజలి(మే 12 , 1989)
UA|135 minutes|రొమాన్స్
క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రకాష్.. అదే సమస్యతో పోరాడుతున్న గీతాంజలిని ప్రేమిస్తాడు. ప్రకాష్ అనారోగ్యం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె అతడి జీవితం నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది.
5 . చంద్రలేఖ(జూలై 30 , 1998)
U|151 minutes|డ్రామా,మ్యూజికల్
సీతారామారావు చంద్రికను రోడ్డు ప్రమాదం నుండి కాపాడి ఆస్పత్రిలో చేరుస్తాడు. చంద్రిక కోమాలోకి వెళ్తుంది. ఆమెను చూసేందుకు వచ్చిన బంధువులు సీతారామారావును చంద్రిక భర్తగా భ్రమపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
6 . సిసింద్రీ(సెప్టెంబర్ 14 , 1995)
U|151 minutes|హాస్యం,చిన్నపిల్లల సినిమా
ఒక ధనిక పారిశ్రామికవేత్త తన బంధువు కంపెనీ నిధులను దుర్వినియోగం చేశాడని గుర్తించి అతడ్ని తొలగిస్తాడు. దీంతో అతడు ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యాపారవేత్త కుమారుడ్ని కిడ్నాప్ చేస్తాడు. తెలివిగల ఆ చిన్నారి కిడ్నాపర్లను ఎలాంటి ఇబ్బందులకు గురిచేశాడు అన్నది కథ.
7 . బాస్(సెప్టెంబర్ 27 , 2006)
U|160 minutes|డ్రామా,రొమాన్స్
అనురాధ GKకి సెక్రటరీగా పని చేస్తుంది. అతనితో ప్రేమలో పడుతుంది. కానీ జీకే తనను అవమానించాడన్న కారణంతో ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. అయితే GK తన మొదటి భార్య సంజనను మరచిపోలేక పోతున్నాడని ఆమె తర్వాత తెలుసుకుంటుంది.
8 . హలో బ్రదర్(ఏప్రిల్ 20 , 1994)
U|152 minutes|యాక్షన్,హాస్యం
కవల సోదరులైన దేవా, రవి వర్మ పుట్టగానే మిస్రో అనే గూండా వల్ల వేరు చేయబడుతారు. అయితే వారు పెద్దయ్యాక తిరిగి కలుసుకుని తమ తండ్రికి హాని తలపెట్టాలని చూస్తున్న మిస్రో కొడుకు మిత్రాపై పోరాడుతారు.
9 . కింగ్(డిసెంబర్ 25 , 2008)
UA|181 minutes|యాక్షన్,హాస్యం,డ్రామా
చంద్ర ప్రతాప్ వర్మ రాజ కుటుంబానికి చెందినవాడు. తన తల్లి, మేనమామలు ఇతర కుటుంబ సభ్యులతో నివసిస్తుంటాడు. తన తండ్రి మరణం తర్వాత వారసత్వం చంద్ర ప్రతాప్ వర్మకు దక్కుతుంది. అయితే ఆ ఆస్తి దక్కించుకోవాలని అతని బంధువులే శత్రువులుగా మారుతారు.
10 . సూపర్(జూలై 21 , 2005)
UA|151 minutes|యాక్షన్,డ్రామా
సోను, అఖిల్ మంచి ఫ్రెండ్స్. సోను చెల్లెలు అఖిల్‌ను ఇష్టపడుతుంది. ఇందుకు నో చెప్పడంతో ఆమె సూసైడ్ చేసుకుంటుంది. దీంతో సోను, అఖిల్ వైరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
11 . నిన్నే పెళ్ళాడతా(అక్టోబర్ 04 , 1996)
UA|146 minutes|డ్రామా,రొమాన్స్
శీను, మహాలక్ష్మీ ఓ పెళ్లిలో కలుసుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వీరి పెళ్లికి శీను ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. కానీ మహా నాన్న ఈ వివాహానికి అడ్డుపడతాడు.
12 . మనం(మే 23 , 2014)
UA|163 minutes|డ్రామా,ఫ్యామిలీ
పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ.
13 . రగడ(డిసెంబర్ 24 , 2010)
A|146 min|యాక్షన్
డబ్బులు సంపాదించాలన్న ఆశతో సత్య హైదరాబాద్‌కు వచ్చి గ్యాంగ్‌స్టర్ జికె వద్ద పనిచేయడం ప్రారంభించాడు. అయితే, అతని చర్యల వల్ల మరో గ్యాంగ్‌స్టర్ పెద్దన్నకు టార్గెట్ అవుతాడు. మరి సత్య ఆ గ్యాంగ్‌స్టర్‌ను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ.
14 . మన్మధుడు(డిసెంబర్ 20 , 2002)
U|142 minutes|రొమాన్స్
అభిరామ్ తన మామకు చెందిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఆడవారంటే అతడికి ద్వేషం. అసిస్టెంట్ మేనేజర్‌గా వచ్చిన హారికపై అభిరామ్ అనుచితంగా ప్రవర్తిస్తుంటాడు. ఆమెపై కోపం ప్రేమగా మారినప్పుడు కథ కీలక మలుపు తిరుగుతుంది.
15 . సోగ్గాడే చిన్ని నాయనా(జనవరి 15 , 2016)
UA|145 minutes|హాస్యం,డ్రామా
బంగార్రాజు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. కొడుకు కాపురం గురించి ఆందోళన చెందుతున్న భార్య కోసం తిరిగి భూమి పైకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భూమిపైకి వచ్చిన బంగర్రాజు ఆత్మ ఏం చేసింది? అన్నది కథ.
16 . బంగార్రాజు(జనవరి 14 , 2022)
UA|160 minutes|హాస్యం,ఫాంటసీ
మనవడి కళ్యాణంతో పాటు, లోక కళ్యాణం కోసం బంగార్రాజు (నాగార్జున)ని కిందికి పంపిస్తాడు యమధర్మరాజు. మరి చిన్న బంగార్రాజు (నాగ చైతన్య), నాగలక్ష్మీ (కృతిశెట్టి)ని ఎలా కలిపాడు? ఊరి గుడిలో ఉన్న నిధులను ఎలా కాపాడాడు? అన్నది కథ.