• TFIDB EN
  • Editorial List
    నితిన్ నటించిన టాప్ కామెడీ సినిమాల లిస్ట్ ఇదే
    Dislike
    20+ views
    1 month ago

    తెలుగులో తనదైన కామెడీతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుల్లో యంగ్ హీరో నితిన్ ఒకరు. ఆయన సినిమాల్లో ఎక్కువ భాగం కామెడీ సన్నివేశాలు ఉంటాయి. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తుంటారు.మరి నితిన్ నటించిన బెస్ట్ కామెడీ ఎంటర్‌ టైనర్ సినిమాలు ఏంటో మీరు చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . హార్ట్ ఎటాక్(జనవరి 31 , 2014)
    A|140 min|యాక్షన్,రొమాన్స్
    స్పెయిన్‌లో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడతారు. కానీ హీరోకి పెళ్లి అంటే ఇష్టం ఉండదు. దీంతో హీరోయిన్‌ గోవా వెళ్లిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ ప్రేమను రియలైజ్ అయిన హీరో ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    2 . దిల్(ఏప్రిల్ 04 , 2003)
    UA|డ్రామా,రొమాన్స్
    శీను తన కాలేజీలో నందు అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. అయితే నందు తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. శీను నుంచి దూరంగా ఆమెను పంపిస్తాడు.
    3 . ఇష్క్(ఫిబ్రవరి 24 , 2012)
    UA|రొమాన్స్
    రాహుల్ ఎయిర్‌పోర్టులో ప్రియాను చూసి ఇష్టపడతాడు. హైదరాబాద్‌కు వెళ్తున్న వారి విమానం అనుకోకుండా గోవాలో ఆగిపోతుంది. దీంతో గోవాలో జరుగుతున్న ఫ్రెండ్‌ పెళ్లికి ప్రియాను తీసుకెళ్తాడు రాహుల్‌. అక్కడే ఆమె హృదయాన్ని గెలుచుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రియా అన్నయ్యకు శివకు మధ్య ఉన్న వైరం ఏంటి? అన్నది కథ.
    4 . గుండె జారి గల్లంతయ్యిందే(ఏప్రిల్ 19 , 2013)
    UA|153 minutes|రొమాన్స్
    నీలిమకు ప్రేమ అంటే ఇష్టం ఉండదు. బాలు వెంటపడుతుండటంతో తాను రాజేష్‌ను ప్రేమిస్తున్నట్లు ఒక పాత్రను సృష్టించి అబద్దం చెప్తుంది. అయితే క్రమంగా ఆమె బాలును లవ్‌ చేయడం ప్రారంభిస్తుంది. కట్‌ చేస్తే రాజేష్‌ పాత్ర నీలిమ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    5 . సై(సెప్టెంబర్ 23 , 2004)
    UA|163 minutes[citation needed]|యాక్షన్,డ్రామా,క్రీడలు
    ఓ మాఫియా లీడర్ నుంచి తమ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ఆర్ట్స్, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ లీడర్స్ అయిన శశాంక్, పృథ్వీ చేతులు కలుపుతారు. మాఫియా లీడర్‌తో రగ్బీ మ్యాచ్ గెలిస్తే మైదానం విద్యార్థులది అవుతుంది.
    6 . మాచర్ల నియోజకవర్గం(ఆగస్టు 12 , 2022)
    UA|159 minutes|డ్రామా,యాక్షన్
    మాచర్ల నియోజకవర్గంలో రాజప్ప (సముద్రఖని) 30 ఏళ్లుగా ఎన్నికలు జరగనివ్వకుండా అభ్యర్థులను హత్యలు చేస్తూ ఎమ్మెల్యేగా గెలుస్తుంటాడు. గుంటూరు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన సిద్దార్థ్‌ రెడ్డి (నితీన్) మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్‌ ఎలా జరిపించాడు? ఈ క్రమంలో అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది కథ.
    7 . చల్ మోహన్ రంగ.(ఏప్రిల్ 05 , 2018)
    U|డ్రామా,రొమాన్స్
    మోహన్‌ రంగ (నితిన్‌) జాబ్‌ కోసం అమెరికాకు వెళ్తాడు. అక్కడ మేఘను ఇష్టపడతాడు. ఇద్దరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు వేరు కావడంతో ప్రేమ వ్యక్తం చేసుకోకుండానే విడిపోతారు. వారు తిరిగి ఎలా కలిశారు? రంగ తన ప్రేమను చెప్పాడా లేదా? అన్నది కథ.
    8 . అ ఆ(జూన్ 02 , 2016)
    U|153 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
    హీరో హీరోయిన్‌ బావ మరదళ్లు. అయితే వారి కుటుంబాల మధ్య ఓ విషయమై మనస్ఫర్థలు తలెత్తుతాయి. అనుకోకుండా హీరో ఇంటికి వచ్చిన హీరోయిన్‌ అతడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారా లేదా? చివరికీ ఏం జరిగింది? అన్నది కథ.
    9 . ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(డిసెంబర్ 08 , 2023)
    UA|రొమాన్స్,డ్రామా,హాస్యం
    అభి (నితిన్) సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తుంటాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని హీరో కావాలన్నది అతడి కల. ఓ సినిమాలో అతని హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి.. సైతాన్ పాత్రలోకి ఇన్‌వాల్వ్‌ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్‌లా మారాడు? అన్నది మిగతా కథ
    10 . రంగ్ దే(మార్చి 26 , 2021)
    UA|130 minutes|డ్రామా,రొమాన్స్
    అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
    11 . భీష్మ(ఫిబ్రవరి 21 , 2020)
    U|138 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
    భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ ఉద్యోగి అయిన చైత్ర(రష్మిక)ను భీష్మ(నితిన్) ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించే క్రమంలో సేంద్రీయ వ్యవసాయంపై ఇష్టం పెంచుకుంటాడు. ఇదే సమయంలో భీష్మ ఆర్గానిక్స్‌కు ఓ సమస్య వచ్చిపడుతుంది. ఆ కంపెనీతో ఏ సంబంధం లేని భీష్మ ఎలా పరిష్కరించాడు అనేది కథ.

    @2021 KTree