Editorial List
నితిన్ టాప్ 10 కామెడీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు
400+ views11 months ago
నితిన్ నటిస్తున్న ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆసాంతం కామెడీ పంచ్‌లతో నిండిపోగా... మధ్య మధ్యలో కాస్త యాక్షన్ సీన్లతో ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్‌ను రూపుదిద్దారు. ఈచిత్రాన్ని వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించి నవ్వులు పూయించారు. ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం డిసెంబర్ 8న విడుదలకానున్న నేపథ్యంలో... నితిన్ నటించిన టాప్ కామెడీ యాక్షన్ చిత్రాలు మీకోసం.
1 . చల్ మోహన్ రంగ.(ఏప్రిల్ 05 , 2018)
U|డ్రామా,రొమాన్స్
మోహన్ రంగ (నితిన్) జాబ్ కోసం అమెరికాకు వెళ్తాడు. అక్కడ మేఘను ఇష్టపడతాడు. ఇద్దరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు వేరు కావడంతో ప్రేమ వ్యక్తం చేసుకోకుండానే విడిపోతారు. వారు తిరిగి ఎలా కలిశారు? రంగ తన ప్రేమను చెప్పాడా లేదా? అన్నది కథ.
2 . లై(ఆగస్టు 11 , 2017)
UA|141 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
సత్యం, చైత్ర అనుకోకుండా కలుసుకుంటారు. తమ నేపథ్యాల గురించి ఒకరికొకరు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుంటారు. వారి ప్రయాణంలో ప్రేమలో పడతారు. ఈక్రమంలో ఇండియన్ పోలీసుల నుంచి తప్పించుకున్న నేరస్థుడు పద్మనాభాన్ని సత్యం కలవడంతో అతని జీవితం మలుపు తిరుగుతుంది.
3 . అల్లరి బుల్లోడు(సెప్టెంబర్ 15 , 2005)
UA|175 minutes|రొమాన్స్
సంపన్నుడైన వ్యాపారవేత్త ప్రమాదానికి గురైనప్పుడు కంపెనీని చూసుకునే బాధ్యత ఆయన కూతురు త్రిషపై పడుతుంది. అయితే ఆ కంపెనీని నాశనం చేయాలని ఓ యువకుడు వస్తాడు. మరి ఆ కంపెనీని త్రిష ఎలా కాపాడుకుంది? కంపెనీని నాశనం చేయాలని వచ్చిన వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది? అన్నది మిగతా కథ.
4 . ద్రోణ(ఫిబ్రవరి 20 , 2009)
A|148 minutes|డ్రామా
తన రివాల్వర్‌తో ఆడుతున్నందుకు ద్రోణని అతని తండ్రి మందలిస్తాడు. దీంతో అతను ఇంట్లో నుంచి పారిపోతాడు. చాలా సంవత్సరాల తరువాత, అతను ఇంటికి తిరిగి వస్తాడు, కానీ అతని తల్లిదండ్రుల తను ఎవరనే నిజాన్ని దాచిపెడుతాడు.
5 . అ ఆ(జూన్ 02 , 2016)
U|153 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
హీరో హీరోయిన్ బావ మరదళ్లు. అయితే వారి కుటుంబాల మధ్య ఓ విషయమై మనస్ఫర్థలు తలెత్తుతాయి. అనుకోకుండా హీరో ఇంటికి వచ్చిన హీరోయిన్ అతడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారా లేదా? చివరికీ ఏం జరిగింది? అన్నది కథ.
6 . సై(సెప్టెంబర్ 23 , 2004)
UA|163 minutes[citation needed]|యాక్షన్,డ్రామా,క్రీడలు
ఓ మాఫియా లీడర్ నుంచి తమ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ఆర్ట్స్, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ లీడర్స్ అయిన శశాంక్, పృథ్వీ చేతులు కలుపుతారు. మాఫియా లీడర్‌తో రగ్బీ మ్యాచ్ గెలిస్తే మైదానం విద్యార్థులది అవుతుంది.
7 . హార్ట్ ఎటాక్(జనవరి 31 , 2014)
A|140 min|యాక్షన్,రొమాన్స్
స్పెయిన్‌లో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడతారు. కానీ హీరోకి పెళ్లి అంటే ఇష్టం ఉండదు. దీంతో హీరోయిన్ గోవా వెళ్లిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్రేమను రియలైజ్ అయిన హీరో ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
8 . మాచర్ల నియోజకవర్గం(ఆగస్టు 12 , 2022)
UA|159 minutes|డ్రామా,యాక్షన్
మాచర్ల నియోజకవర్గంలో రాజప్ప (సముద్రఖని) 30 ఏళ్లుగా ఎన్నికలు జరగనివ్వకుండా అభ్యర్థులను హత్యలు చేస్తూ ఎమ్మెల్యేగా గెలుస్తుంటాడు. గుంటూరు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన సిద్దార్థ్ రెడ్డి (నితీన్) మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఎలా జరిపించాడు? ఈ క్రమంలో అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది కథ.
9 . ఇష్క్(ఫిబ్రవరి 24 , 2012)
UA|రొమాన్స్
రాహుల్ ఎయిర్‌పోర్టులో ప్రియాను చూసి ఇష్టపడతాడు. హైదరాబాద్‌కు వెళ్తున్న వారి విమానం అనుకోకుండా గోవాలో ఆగిపోతుంది. దీంతో గోవాలో జరుగుతున్న ఫ్రెండ్ పెళ్లికి ప్రియాను తీసుకెళ్తాడు రాహుల్. అక్కడే ఆమె హృదయాన్ని గెలుచుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రియా అన్నయ్యకు శివకు మధ్య ఉన్న వైరం ఏంటి? అన్నది కథ.
10 . భీష్మ(ఫిబ్రవరి 21 , 2020)
U|138 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ ఉద్యోగి అయిన చైత్ర(రష్మిక)ను భీష్మ(నితిన్) ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించే క్రమంలో సేంద్రీయ వ్యవసాయంపై ఇష్టం పెంచుకుంటాడు. ఇదే సమయంలో భీష్మ ఆర్గానిక్స్‌కు ఓ సమస్య వచ్చిపడుతుంది. ఆ కంపెనీతో ఏ సంబంధం లేని భీష్మ ఎలా పరిష్కరించాడు అనేది కథ.