Editorial List
ఈ వారం ఓటీటీల్లో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు
400+ views5 months ago
తాజాగా ఓటీటీల్లోకి వచ్చిన వెబ్‌సిరీస్‌లు ఆయా ప్లాట్‌ఫామ్‌లలో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో చూడదగిన బెస్ట్ వెబ్ సిరీస్‌లు/సినిమాలను YouSay Tfidb అందిస్తోంది.. వాటిపై ఓ లుక్ వేయండి
1 . మర్డర్ ముబారక్(మార్చి 15 , 2024)
UA|హాస్యం,డ్రామా
రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్‌విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
2 . భ్రమయుగం(ఫిబ్రవరి 23 , 2024)
UA|హారర్,థ్రిల్లర్
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
3 . ఓపెన్‌హైమర్(జూలై 21 , 2023)
UA|బయోగ్రఫీ,డ్రామా,హిస్టరీ
ప్రముఖ అమెరికన్ సైంటిస్ట్ జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా - నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ.
4 . ఆపరేషన్ వాలెంటైన్(మార్చి 01 , 2024)
UA|130 minutes|యాక్షన్,థ్రిల్లర్
రుద్ర (వరుణ్‌తేజ్) భారత వైమానిక దళంలో స్వ్కాడ్రన్ లీడర్. రాడార్ ఆఫీసర్ అహనా గిల్‌తో ప్రేమలో ఉంటాడు. ప్రాజెక్ట్ వజ్ర కోసం నడుం కట్టిన సమయంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆపరేషన్ వెనక ఉన్న కథేమిటి? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేమిటి? అన్నది స్టోరీ
5 . హను మాన్(జనవరి 12 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్,ఫాంటసీ
సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ (వినయ్ రాయ్) చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.
6 . లూటెర్(మార్చి 22 , 2024)
UA|యాక్షన్,డ్రామా
2017లో చోటుచేసుకున్న యదార్థ సంఘటన ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. భారత దేశానికి చెందిన ఇండియన్ కార్గో షిప్‌ను సోమాలియాకు చెందిన సముద్రపు దొంగలు హైజాక్ చేస్తారు. దీంతో భారత సంతతి వ్యక్తి విక్రాంత్ గాంధీ ఆ సముద్రపు దొంగలతో జరిపిన చర్చలు ఏంటి? షిప్ కెప్టెన్ ఏకే సింగ్ సహా అందులోని సిబ్బంది పైరెట్స్ బారి నుంచి క్షేమంగా బయటపడ్డారా? లేదా? అన్నది కథ.
7 . ట్రూ లవర్(ఫిబ్రవరి 10 , 2024)
UA|డ్రామా,రొమాన్స్
అరుణ్, దివ్య కాలేజీ రోజుల నుంచి లవర్స్. దివ్య ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుండగా.. అరుణ్ ఒక కాఫీ షాపు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవలు మెుదలవుతాయి. ఆ తర్వాత ఏమైంది? అరుణ్ - దివ్య కలిశారా? లేదా? అన్నది కథ.
8 . మిస్ పర్ఫెక్ట్(ఫిబ్రవరి 02 , 2024)
UA|డ్రామా
లావణ్య రావు (లావణ్య త్రిపాఠి)కి ఓసీడీ. అపరిశుభ్రత కనిపిస్తే అసలు సహించలేదు. ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన లావణ్య.. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే అద్దెకు దిగుతుంది. ఓ కారణం చేత ఆమె.. రోహిత్ ఫ్లాట్‌గా వెళ్లగా పనిమనిషి అని అతడు భ్రమపడతాడు. ఆ తర్వాత ఏమైంది? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్నది స్టోరీ.
9 . సుందరం మాస్టర్(ఫిబ్రవరి 23 , 2024)
U|హాస్యం,డ్రామా
సుందరం మాస్టర్ గవర్నమెంట్ టీచర్. ఇంగ్లీష్ నేర్పడం కోసం ఓ మిస్టరీ గ్రామానికి వెళ్తాడు. అక్కడి పరిస్థితులు సుందరంను ఆశ్చర్య పరుస్తాయి. ఆ గ్రామస్తులు ఎలా ఉన్నారు? సుందరంకు ఎమ్మెల్యే అప్పగించిన రహస్య పని ఏంటి? దాన్ని నెరవేర్చాడా లేదా? అన్నది కథ.
10 . భామాకలాపం 2(ఫిబ్రవరి 16 , 2024)
UA|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
కొత్తగా హోటల్ పెట్టుకున్న అనుపమ (ప్రియమణి) అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురవుతుంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? ఆ పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? అన్నది కథ
11 . అన్వేషిప్పిన్ కండెతుమ్(ఫిబ్రవరి 09 , 2024)
UA|క్రైమ్,డ్రామా,థ్రిల్లర్
ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
12 . సేవ్ ది టైగెర్స్ S2(మార్చి 15 , 2024)
UA|హాస్యం,డ్రామా
హీరోయిన్ హంసలేఖ కనిపించకుండా పోతుంది. ఆమె కిడ్నాప్ వెనకాల ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం ఉన్నారని పోలీసులు అనుమానిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది?
హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి? వారి భార్యలు ఎందుకు అనుమానించారు? అన్నది స్టోరీ.