• TFIDB EN
  • Editorial List
    ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!
    Dislike
    200+ views
    1 month ago

    ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేవి ఉంటాయి. లవ్‌, ఫ్యామిలీ, క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌ ఇలా వివిధ జానర్‌లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఏప్రిల్ నెల సగం గడిచి పోయింది. మరి ఈ 15 రోజుల కాలంలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి మరి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ప్రేమలు(మార్చి 08 , 2024)
    U|156 minutes|హాస్యం,రొమాన్స్
    స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌.
    2 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
    U/A|హాస్యం,డ్రామా
    క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
    3 . గామి(మార్చి 08 , 2024)
    U/A|అడ్వెంచర్,ఫాంటసీ,థ్రిల్లర్
    అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్‌ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.
    4 . కాజల్ కార్తీక(మే 19 , 2023)
    A|డ్రామా
    కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్లి అక్కడ వందేళ్ల నాటి పుస్తకాన్ని చదువుతుంది. అందులోని ఐదు దయ్యాల పాత్రలు ఒక్కొక్కటిగా కళ్ల ముందుకు వస్తుంటాయి. అలా వచ్చిన కార్తిక (కాజల్‌) ఎవరు? ఆమె మరణానికి గ్రామస్తులు ఎందుకు కారణమయ్యారు? మిగిలిన నాలుగు దెయ్యాల పాత్రలు ఏంటి? అన్నది కథ.
    5 . తంత్ర(మార్చి 15 , 2024)
    A|డ్రామా,హారర్
    రేఖ (అనన్య)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. బాల్య స్నేహితుడు తేజూను ఆమె ఇష్టపడటంతో ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? విగత (వంశీ), రాజేశ్వరి (సలోని) పాత్రలతో రేఖకు సంబంధం ఏంటి? అన్నది కథ.
    6 . లంబసింగి (మార్చి 15 , 2024)
    U/A|డ్రామా
    కానిస్టేబుల్‌ వీరబాబు.. నర్సు హరితను ప్రేమిస్తాడు. ఆమె.. నక్సలైట్ల లీడర్‌ కోనప్ప కూతురని వీరబాబుకు తెలుస్తుంది. ఓ రోజు కోనప్ప నేతృత్వంలోని దళం వీరబాబు పనిచేసే పోలీసుస్టేషన్‌పై దాడి చేస్తుంది. ఆ దళంలో హరిత కూడా ఉండటంతో వీరబాబు షాకవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    7 . చారి 111(మార్చి 01 , 2024)
    U/A|యాక్షన్,హాస్యం
    చారి (వెన్నెల కిషోర్) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఏజెంట్. సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్‌ చేత చివాట్లు తింటుంటాడు. ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ కేసును సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. అతడు ఈ కేసును ఎలా ఛేదించాడు? క్రైమ్‌ వెకనున్న వ్యక్తి ఎవరు? అన్నది కథ.
    8 . అదృశ్యం(అక్టోబర్ 07 , 2022)
    U/A|క్రైమ్,థ్రిల్లర్
    జానకి (అపర్ణ బాలమురళి) పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితుడ్ని హత్య చేసినట్లు సీఐ కరుణన్‌తో చెప్తుంది. పాతిపెట్టిన స్థలాన్ని కూడా చూపిస్తుంది. అయితే మీడియాతో ఈ హత్య చేసింది సీఐ కురణన్‌ అని జానకి చెప్పడంతో అంతా షాకవుతారు. పైగా పాతిపెట్టిన చోట రెండు శవాలు దొరకడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ బాడీలు ఎవరివి? జానకి లవర్‌ అశ్విన్‌ ఏమయ్యాడు? అన్నది కథ.
    9 . శర్మ & అంబానీ
    U/A|క్రైమ్,డ్రామా
    భరత్‌ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం 'శర్మ అండ్‌ అంబానీ'. ఈ సినిమా ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఏప్రిల్‌ 11 నుండి స్ట్రీమింగ్‌లోకి రానుంది. కార్తీక్‌ సాయి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచింది.

    @2021 KTree