• TFIDB EN
  • Editorial List
    పద్మనాభం సినిమాల్లో టాప్ 15 బెస్ట్ సినిమాలు
    Dislike
    300+ views
    6 months ago

    తెలుగులో తొలి తరం హాస్య నటుల్లో పద్మనాభం ప్రముఖులు. హాస్యంలో ఆయనది ప్రత్యేక శైలీ. ఆయన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. కూనిరాగాలతో విచిత్రమైన డైలాగ్‌లతో కామెడీ పండించేవారు. ఆయన నటించిన టాప్ చిత్రాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ప్రేమాభిషేకం(ఫిబ్రవరి 18 , 1981)
    U|147 minutes|డ్రామా,రొమాన్స్
    రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.
    2 . చాణక్య చంద్రగుప్త(ఆగస్టు 25 , 1977)
    U|178 minutes|డ్రామా,హిస్టరీ
    మౌర్య సామ్రాజ్యానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు.. అలెగ్జాండర్‌ను ఓఢిస్తాడు. ఈ స్టోరీలైన్‌ను ఆధారంగా చేసుకొని సినిమాను రూపొందించారు. యుద్ధంలో చాణిక్యుడు ఎలాంటి పాత్ర పోషించాడు? అన్నది స్టోరీ.
    3 . దేశోద్ధారకులు(మార్చి 29 , 1973)
    U|156 minutes|డ్రామా
    దేశోద్ధారకులు 1973లో విడుదలైన భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం, దీప్తి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యు. విశ్వేశ్వర రావు నిర్మించారు మరియు సి. ఎస్. రావు దర్శకత్వం వహించారు. ఇందులో N. T. రామారావు మరియు వాణిశ్రీ నటించారు, K. V. మహదేవన్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం 1973లో దేవుడు చేసిన మనుషులు తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రం.
    4 . శ్రీ కృష్ణ విజయము(జనవరి 11 , 1971)
    U|148 mins|డ్రామా
    కృష్ణుడు కాలయవనుడిని అంతం చేసినప్పుడు మహోదరుడు తన సోదరుడి తరపున ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేస్తాడు. శివుడు మహోదరుడికి వరం ఇవ్వడంతో విషయాలు మలుపు తిరుగుతాయి.
    5 . తిక్క శంకరయ్య(మార్చి 29 , 1968)
    U|157 minutes|హాస్యం,డ్రామా
    రాము, మోహన్‌ ఒకే విధమైన రూపాలను కలిగి ఉంటారు. దీంతో ప్రజలు వారిని గుర్తించడంలో తికమకపడుతుంటారు. ఈ గందరగోళాన్ని క్లియర్‌ చేయాల్సిన పరిస్థితి వారికి ఎదురవుతుంది.
    6 . శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(undefined 00 , 1967)
    UA|133 min|డ్రామా,హిస్టరీ
    రాజు అయిన మర్యాద రామన్నకు తన మంత్రుల గురించి ఒక విషయం తెలుస్తుంది. వారు డబ్బు కోసం ప్రజలను పీడిస్తున్నట్లు రాజు గ్రహిస్తాడు. ఆ తర్వాత రామన్న ఏం చేశాడు? మంత్రులకు ఎలా బుద్ది చెప్పాడు? అన్నది కథ.
    7 . పొట్టి ప్లీడర్(మే 05 , 1966)
    U|170 minutes|హాస్యం,డ్రామా
    ప్రసాదం చాలా కష్టపడి లా చదువు పూర్తి చేసి ఉద్యోగం నిమిత్తం పట్టణానికి వెళ్తాడు. అక్కడ ధనవంతుడు అయిన ధనరాజ్‌ని కలుస్తాడు. ఈక్రమంలో ధనరాజ్ కుమార్తె శాంతతో ప్రసాదం ప్రేమలో పడుతాడు.
    8 . తేనే మనసులు(ఏప్రిల్ 24 , 1987)
    U|డ్రామా
    భానుమతి అనే యువతి ఓ వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అయితే, ఆమె ప్రేమించిన వ్యక్తి తన స్నేహితురాలు సీత భర్త అని తెలియడంతో పరిస్థితి మారుతుంది.
    9 . డాక్టర్ చక్రవర్తి(జూలై 10 , 1964)
    U|167 minutes|డ్రామా
    డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు.
    10 . వెలుగు నీడలు(జనవరి 07 , 1961)
    U|డ్రామా
    సుగుణ అనే వైద్యురాలు క్షయవ్యాధితో బాధపడుతున్న చంద్రంను ప్రేమిస్తుంది. అయితే సుగుణను, రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చంద్రం బలవంతం చేస్తాడు. కానీ చంద్రం వ్యాధి నయం అవుతుంది. ఈలోపు సుగుణ భర్త మరణిస్తాడు.
    11 . పాండురంగ మహత్యం(నవంబర్ 28 , 1957)
    U|175 minutes|డ్రామా,హిస్టరీ
    ఈ చిత్రం మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్ర వైభవాన్ని చాటుతుంది. సనాతన సంప్రదాయాల్నీ, ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతుంది. నాస్తికుడైన ఒక యువకుడు పాండురంగడుకి పరమభక్తుడిగా ఎలా మారాడో చూపించారు.
    12 . చంద్రహారం(జనవరి 06 , 1954)
    U|174 minutes|డ్రామా
    యువరాజు చందన రాజు ప్రాణం అతను ధరించే చంద్రహారంలో భద్రపరచబడి ఉంటుంది. యక్షకన్య చంచల తనను ప్రేమించమని యువరాజు వద్దకు వస్తుంది. అతడు నిరాకరించడంతో భంగపడి హారాన్ని తీసుకొని పోతుంది.
    13 . పెళ్లి చేసి చూడు(ఫిబ్రవరి 29 , 1952)
    U|156 minutes|డ్రామా
    పెళ్లి చేసి చూడు అనేది L. V. ప్రసాద్ దర్శకత్వం వహించిన 1952 భారతీయ వ్యంగ్య హాస్య చిత్రం మరియు నాగి రెడ్డి మరియు చక్రపాణి వారి సంస్థ విజయ ప్రొడక్షన్స్ క్రింద నిర్మించారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది, తరువాతి చిత్రానికి కళ్యాణం పన్ని పర్ అనే పేరు పెట్టారు. ఇందులో ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, యండమూరి జోగారావు, సావిత్రి నటించారు. తెలుగు వెర్షన్‌లో ఎస్‌వి రంగారావు, శివరామ కృష్ణయ్య, దొరస్వామి, సూర్యకాంతం సహాయక పాత్రలు పోషిస్తుండగా, తమిళంలో కృష్ణయ్య స్థానంలో సివివి పంతులు నటించారు.
    14 . పాతాళ భైరవి(మార్చి 15 , 1951)
    U|195 minutes|డ్రామా,ఫాంటసీ
    ఉజ్జయిని యువరాణి ఇందుమతితో సాధారణ తోటమాలి కొడుకు అయిన తోటరాముడు ప్రేమలో పడుతాడు. ఈ విషయం తెలిసిన మహారాజు అతన్ని మందలిస్తాడు. కానీ తోటరాముడు, యువరాణిని తనతో పెళ్లి చేయాలంటే ఏం కావాలో అడగమని రాజును ఛాలెంజ్ చేస్తాడు. అయితే తన దగ్గర ఉన్న సంపదతో సమానమైన సంపదను తెస్తే పెళ్లి చేస్తానని మహారాజు హామీ ఇస్తాడు. మరి తోటరాముడు అంత ఆస్తిని సంపాదించాడా? లేదా అన్నది మిగతా కథ

    @2021 KTree