• TFIDB EN
  • Editorial List
    ప్రభాస్ కెరీర్‌లో బెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలు
    Dislike
    20+ views
    1 month ago

    టాలీవుడ్‌లో కామెడీని అద్భుతంగా పండించగల అతికొద్ది మంది నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఆయన తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అందుకే ప్రభాస్ సినిమాలో హాస్య సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా డైరెక్టర్లు జాగ్రత్త పడుతుంటారు. మరి ప్రభాస్ నటించిన బెస్ట్ కామెడీ ఎంటర్‌ టైనర్ సినిమాలు ఏంటో మీరు చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కల్కి 2898 ఎ.డి(జూన్ 27 , 2024)
    UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్
    కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
    2 . అడవి రాముడు(మే 21 , 2004)
    U|డ్రామా,రొమాన్స్
    సంపన్న కుటుంబానికి చెంందిన రాముని మధు ప్రేమిస్తుంది. రాముని కాలేజీకి వెళ్లి చదువుకునేలా ప్రేరేపిస్తుంది. అయితే, వీరి ప్రేమను మధు తల్లి త్రిభువన వ్యతిరేకిస్తుంది. రాముడిని చంపడానికి ప్రయత్నిస్తుంది.
    3 . ఈశ్వర్(నవంబర్ 11 , 2002)
    U|164 minutes|యాక్షన్,డ్రామా
    కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఓ యువకుడు స్థానిక ఎమ్మెల్యే కూతురితో ప్రేమలో పడుతాడు. అయితే ఆ రాజకీయ నాయకుడు అతన్ని చంపాలని ప్లాన్ చేయడంతో అతని జీవితం మారుతుంది.
    4 . బుజ్జిగాడు(మే 22 , 2008)
    UA|146 minutes|యాక్షన్,డ్రామా
    బుజ్జి రజనీకాంత్‌ ఫ్యాన్‌. చిన్నప్పుడు ఇంటి పక్కన ఉండే చిట్టితో గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. 12 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన బుజ్జి.. చిట్టిని వెత్తుకుంటూ వెళ్తాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ.
    5 . చక్రం(మార్చి 25 , 2005)
    U|150 minutes|డ్రామా
    మెడికల్‌ విద్యార్థులైన చక్రం, లక్ష్మీ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఓ రోజు తనకు క్యాన్సర్ ఉన్నట్లు చక్రం తెలుసుకుంటాడు. దీంతో ఆమెకు దూరంగా వెళ్లిపోతాడు.
    6 . డార్లింగ్(ఏప్రిల్ 23 , 2010)
    U|153 mins|డ్రామా
    ప్రభ తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో తన చిన్ననాటి స్నేహితురాలు నందినిని కలుస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. అయితే, గ్యాంగ్‌స్టర్ కుమార్తె నిషా అతనితో ప్రేమలో పడడంతో కథ మలుపు తిరుగుతుంది.
    7 . ఏక్ నిరంజన్(అక్టోబర్ 29 , 2009)
    UA|155 minutes|యాక్షన్,డ్రామా
    రోడ్లపై పిల్లల్ని అడుక్కునే రాకెట్‌ను నడిపే వ్యక్తి చిన్నతనంలో చోటును కిడ్నాప్ చేస్తాడు. అయితే, అతన్ని అరెస్టు చేయడంలో పోలీసులకు చోటు సహాయం చేస్తాడు. ఆ తర్వాత తన కుటుంబం కోసం వెతుకుతాడు.
    8 . వర్షం(జనవరి 14 , 2004)
    U|159 minutes|యాక్షన్,రొమాన్స్
    వెంకట్, శైలజ రైలులో కలుసుకుని ప్రేమలో పడతారు. కానీ శైలజ తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. ఆమెను ఇష్టపడ్డ భద్రన్న అనే పెద్ద రౌడీతో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు.
    9 . మిస్టర్ పర్ఫెక్ట్(ఏప్రిల్ 22 , 2011)
    U|145 min|హాస్యం,రొమాన్స్
    విక్కీ తన చిన్ననాటి స్నేహితురాలి ప్రియతో జరిగిన నిశ్చితార్థాన్ని బ్రేక్‌ చేసుకుంటాడు. అచ్చం తనలాగే ఆలోచించే మరో యువతితో పెళ్లికి సిద్ధపడతాడు. అయితే ప్రియ తన కోసం ఎంతో త్యాగం చేసిందని గ్రహించిన విక్కీ ఏం చేశాడు అన్నది కథ.
    10 . మిర్చి(ఫిబ్రవరి 08 , 2013)
    A|160 minutes|యాక్షన్
    ఈ సినిమా కథ జై అనే యువకుడి చూట్టూ తిరుగుతుంది. తన ఊరు, కుటుంబంతో శతృత్వం ఉన్న ఓ కుటుంబాన్ని మార్చేందుకు వారి ఇంటికి వెళ్తాడు. కానీ అతనేవరో ఆ కుటుంబానికి తెలిసిపోతుంది

    @2021 KTree