Editorial List
రాజ్ తరుణ్ టాప్ బెస్ట్ సినిమాలు
400+ views9 months ago
ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. సినిమాల్లోకి రాక ముందు దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి హీరోగా అవకాశం అందిపుచ్చుకున్నాడు. తనదైన స్లాంగ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. ఫలితంతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.
1 . సినిమా చూపిస్త మావా(ఆగస్టు 14 , 2015)
UA|143 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
2 . కిట్టు ఉన్నాడు జాగ్రత్త(మార్చి 03 , 2017)
UA|హాస్యం,రొమాన్స్
కిట్టు ఒక కార్ మెకానిక్. జానకిని ప్రేమిస్తాడు. ఆమెతో లైఫ్‌ను ఆనందంగా లీడ్ చేయాలని కోరుకుంటాడు. ఈక్రమంలో కొంతమంది.. ఓ గ్యాంగ్‌స్టర్ వద్ద ఉన్న పెంపుడు కుక్కను కిడ్నాప్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పుతామని డీల్ కుదుర్చుకుంటారు. మరి కిట్టు ఏం చేశాడు? ఎలాంటి ప్రమాదంలో పడ్డాడు అనేది కథ.
3 . లవర్(జూలై 20 , 2018)
UA|130 minutes|డ్రామా,రొమాన్స్
హీరో రాజ్ నర్సుగా పనిచేసే చందన (రిద్ది కుమార్)ను ప్రేమిస్తాడు. ఆస్పత్రిలో లక్ష్మీ అనే పాపను కాపాడే క్రమంలో చందనకు విలన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. అయితే హీరో ఆమెను ఎలా కాపాడాడు? అన్నది కథ.
4 . నాన్నా నేను నా బాయ్‌ఫ్రెండ్స్(డిసెంబర్ 16 , 2016)
UA|140 minutes|హాస్యం,రొమాన్స్
హీరోయిన్ ఒకేసారి ముగ్గురు యువకుల్ని ఇష్టపడుతుంది. వారిలో ఎవర్ని పెళ్లి చేసుకోవాలన్న కన్ఫ్యూజన్‌తో తండ్రి సాయం కోరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
5 . కుమారి 21F(నవంబర్ 20 , 2015)
A|135 minutes|రొమాన్స్
సిద్ధూ, కుమారి అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. బోల్డ్ యాటిట్యూడ్ వల్ల ఆమె ప్రేమను అనుమానిస్తాడు. ఓ రోజు ఓ సంఘటన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది.
ఈ చిత్రం రాజ్ తరుణ్ సూపర్ హిట్ అంటే ఏమిటో రుచి చూపించింది. స్టార్ డం అందించింది.
ఈ చిత్రం రాజ్ తరుణ్ సూపర్ హిట్ అంటే ఏమిటో రుచి చూపించింది. స్టార్ డం అందించింది.
6 . ఉయ్యాల జంపాలా(డిసెంబర్ 25 , 2013)
U|124 minutes|డ్రామా,రొమాన్స్
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఈ చిత్రం రాజ్ తరుణ్‌కు మంచి విజయాన్ని అందించింది. సెన్సిటివిటీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.
ఈ చిత్రం రాజ్ తరుణ్‌కు మంచి విజయాన్ని అందించింది. సెన్సిటివిటీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.