• TFIDB EN
  • Editorial List
    రాజేంద్ర ప్రసాద్ నటించిన బెస్ట్ కామెడీ చిత్రాల లిస్ట్ ఇదే
    Dislike
    30+ views
    1 month ago

    తెలుగులో ఎవర్ గ్రీన్ క్లాసిక్ కల్ట్ కామెడీ మూవీస్‌ను అందించిన హీరో రాజేంద్ర ప్రసాద్. సినిమాల్లో ఆయన ఏ చిన్న కదలిక చేసిన అది హాస్యంగానే పరిణమిస్తుంది. కామెడీ పంచడంలో మిగతా హీరోలకు భిన్నంగా తనకంటూ ప్రత్యేక శైలీతో నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ కడుపుబ్బా నవ్విస్తారు. ఆయన సినీ కెరీర్‌లో ఎక్కువగా కామెడీ చిత్రాలనే తెలుగు ప్రేక్షకులు అందించారు. వాటిలో బెస్ట్ కామెడీ చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు చూసేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . S/O సత్యమూర్తి(ఏప్రిల్ 09 , 2015)
    UA|163 minutes|యాక్షన్,డ్రామా
    ఈ సినిమా కథ విరాజ్ ఆనంద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ధనవంతుడైన తండ్రి చనిపోయిన తరువాత అతని జీవితం మారుతుంది. కుటుంబ గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ.. బంధాలు, నైతిక విలువల మధ్య నడవడం ప్రారంభిస్తాడు.
    2 . జులాయి(ఆగస్టు 08 , 2012)
    UA|152 minutes|యాక్షన్,హాస్యం
    రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్‌ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.
    3 . శ్రీరామచంద్రులు(నవంబర్ 07 , 2003)
    UA|155 minutes|హాస్యం,డ్రామా
    ముగ్గురు స్నేహితులు ఎప్పుడు తమ భార్యలపై ఆదిపత్యం చెలాయిస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఓ అందమైన యువతి వారి జీవితంలోకి వస్తుంది. వారిని ఆమె ఇష్టపడటంతో తమకు పెళ్లికాలేదని అబద్దం చెబుతారు. ఆ ముగ్గురిలో ఒకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. ఆమెను ఇంప్రెస్ చేసేందుకు పోటీపడుతారు. మరి చివరకు వారిలో ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుంది? అనేది కథ.
    4 . ఇదేం పెళ్ళాం బాబోయ్(undefined 00 , 1990)
    UA|136 mins|హాస్యం,డ్రామా
    ఇదేం పెళ్లాం బాబోయ్ అనేది 1990లో విడుదలైన తెలుగు-భాషా హాస్య చిత్రం, రాజా ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై బి. హెచ్. రాజన్న నిర్మించారు మరియు కాట్రగడ్డ రవితేజ దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ మరియు రాధిక నటించారు, ఇళయరాజా సంగీతం అందించారు. ఇది తమిళ చిత్రం మనమగలే వా (1988)కి రీమేక్ మరియు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
    5 . చెట్టు కింద ప్లీడర్(ఫిబ్రవరి 16 , 1989)
    U|125 mins|డ్రామా,థ్రిల్లర్
    ఒక వ్యాపారవేత్త హత్యకు గురైనప్పుడు అతడి భార్య న్యాయపోరాటానికి దిగుతుంది. ఆ కేసును వాదించేందుకు పెద్ద పెద్ద లాయర్లు భయపడతారు. కానీ బాలరాజు ఈ కేసును టేకప్‌ చేస్తాడు.
    6 . రాజా ది గ్రేట్(అక్టోబర్ 18 , 2017)
    UA|150 mins|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
    7 . F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్(మే 27 , 2022)
    U|148 minutes|హాస్యం,ఫ్యామిలీ
    అత్యాశపరులైన వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహ్రీన్‌, ఎస్సై రాజేంద్ర ప్రసాద్‌ ఓ క్రైమ్‌లో ఇరుక్కుంటారు. దాని నుంచి బయటపడేందుకు వీరికి పెద్ద మెుత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలో వ్యాపారవేత్త ఆనంద్‌ ప్రసాద్‌ (మురళి శర్మ) చిన్నప్పుడే తప్పిపోయిన తన కొడుకు కోసం ప్రకటన ఇస్తాడు. దీంతో పెద్దాయన డబ్బు కోసం వారంతా ఎలాంటి నాటకం ఆడారన్నది కథ.
    8 . F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్(జనవరి 12 , 2019)
    UA|150 minutes|హాస్యం,డ్రామా
    వెంకీ, వరుణ్ తమ వైవాహిక జీవితంపై అసంతృప్తితో భార్యలను వదిలేసి యూరప్ ట్రిప్‌కు వెళ్తారు. ఆ ట్రిప్ వారి జీవితాన్ని మరింత గందరగోళానికి గురి చేస్తుంది.
    9 . అమ్మో బొమ్మ(మే 04 , 2001)
    U|141 mins|హాస్యం,హారర్
    రాంబాబు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. అతనికి వివిధ రకాల బొమ్మలను సేకరించడం అంటే ఇష్టం. ఈ క్రమంలో ఓ కొత్త బొమ్మను సేకరించగా అందులోకి దెయ్యం ప్రవేశించడంతో ఇబ్బందుల్లో పడుతాడు.
    10 . ఆల్ రౌండర్(మార్చి 27 , 1998)
    U|127 mins|హాస్యం
    పాములు ఆడించుకునే బాలరాజుతో రమ్య పందెం కాస్తుంది. అందులో గెలిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. బాలారాజు పందెం గెలిచాకా ఆమె మాట మారుస్తుంది. ఆమెకు గుణపాఠం చెప్పాలని భావించిన బాలరాజు ఆల్‌రౌండర్‌గా అవత్తారం ఎత్తుతాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అన్నది కథ.
    11 . పేకాట పాపా రావు(సెప్టెంబర్ 08 , 1993)
    U|121 mins|హాస్యం,డ్రామా
    పేకాట పాపారావు 1993లో విడుదలైన భారతీయ తెలుగు-భాషా హాస్య చిత్రం, ఉమా మహేశ్వర మూవీస్ బ్యానర్‌పై పంతంగి పుల్లయ్య, డి.వి.వి.రమణా రెడ్డి నిర్మించారు మరియు వై. నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఖుష్బు నటించారు, దీనికి రాజ్-కోటి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్‌గా నమోదైంది.
    12 . కన్నయ్య కిట్టయ్య(జూన్ 11 , 1993)
    U|145 mins|హాస్యం,ఫాంటసీ
    సాధారణ యువకుడైన కిట్టయ్య తన మరదలు సరోజను ప్రేమిస్తాడు, కానీ అతని మేనమామ అతనిని ఒప్పుకోడు. నిరుత్సాహానికి గురైన కిట్టయ్య తనకు సహాయం చేయమని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు.
    13 . గోల్‌మాల్ గోవిందం(ఫిబ్రవరి 08 , 1992)
    UA|హాస్యం,డ్రామా
    గోవిందానికి ఓ ముగ్గురు వ్యక్తులతో సంబంధం ఉన్న ఓ యువతి డైరీ దొరుకుతుంది. అయితే ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయినట్లు తెలుసుకుంటాడు. అయితే ఆమెకు ఒక అబ్బాయి జన్మించాడని ఆ పిల్లాడు ఓ ముగ్గురి కొడుకు అని వెర్వేరుగా చెప్పి నమ్మిస్తాడు. వారి నుంచి డబ్బు గుంజేందుకు ప్లాన్ చేస్తాడు.
    14 . పెళ్ళి పుస్తకం(ఏప్రిల్ 01 , 1991)
    U|144 mins|డ్రామా,రొమాన్స్
    కొత్తగా పెళ్లైన ఓ జంట కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటుంది. అయితే వారి సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఓ కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం ఇస్తుంది. అయితే ఆ ఛాన్స్ పెళ్లికానివారికేనని తెలిసి ఓ ఉపాయం ఆలోచిస్తారు.
    15 . మైనర్ రాజా(జూన్ 04 , 1991)
    U|136 minutes|హాస్యం,డ్రామా
    రాజాకు ఉన్న చెడు అలవాట్ల కారణంగా లక్ష్మి అతని ప్రేమను తిరస్కరిస్తుంది. అయితే అతన్ని మంచి మనిషిగా మార్చిన సీతను రాజా పెళ్లి చేసుకుంటాడు. కానీ తిరిగి లక్ష్మి అతన్ని ప్రేమించడంతో కథ మలుపు తిరుగుతుంది.
    16 . కొబ్బరి బోండం(undefined 00 , 1991)
    U|149 minutes|హాస్యం,డ్రామా
    కొబ్బరి బోండం అనేది 1991లో విడుదలైన భారతీయ తెలుగు-భాషా హాస్య చిత్రం, దీనిని మనీషా ఫిలింస్ క్రింద K. అచ్చి రెడ్డి, S. V. కృష్ణా రెడ్డి నిర్మించారు, కిషోర్ రాఠీ సమర్పణలో కాట్రగడ్డ రవితేజ దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్ మరియు నిరోషా నటించిన ఈ చిత్రానికి సంగీతం: S. V. కృష్ణా రెడ్డి. ఎస్.వి.కృష్ణా రెడ్డి తొలిసారిగా తెరకెక్కిన ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, సంగీతాన్ని అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. ఆయన పూర్తిగా దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు.
    17 . ఏప్రిల్ 1 విదుదల(ఫిబ్రవరి 01 , 1991)
    U|146 min|హాస్యం,థ్రిల్లర్
    దివాకరమ్ పచ్చి అబద్ధాలకోరు. అందరి దగ్గర అప్పులు చేస్తూ కాలం గడుపుతుంటాడు. అయితే తన ప్రేయసి భువనేశ్వరి ప్రేమను గెలుచుకునేందుకు ఒక నెల వరకు ఎవరితో అబద్దాలు ఆడను అనే ఛాలెంజ్‌ను స్వీకరిస్తాడు.
    18 . బృందావనం(undefined 00 , 1992)
    U|153 minutes|హాస్యం,డ్రామా
    బృందావనం అనేది 1992 భారతీయ తెలుగు భాషా హాస్య చిత్రం, ఇది సింగీతం శ్రీనివాసరావు సహ-రచయిత మరియు దర్శకత్వం వహించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ మరియు రమ్య కృష్ణ నటించారు, దీనికి మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని చందమామ విజయ కంబైన్స్‌ బ్యానర్ పై బి. వెంకటరామ రెడ్డి నిర్మించారు. . ఈ చిత్రం రెండు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకుంది.
    19 . రాజేంద్రుడు గజేంద్రుడు(ఫిబ్రవరి 04 , 1993)
    U|152 mins|హాస్యం,డ్రామా
    లాటరీ గెలిచిన తర్వాత, ఆ బహుమతి ఏనుగు అని తెలుసుకున్న రాజేంద్ర షాక్ అవుతాడు. పేదవాడు అయినప్పటికీ, అతను ఏనుగును పెంచాలని నిర్ణయించుకుంటాడు. కాలక్రమంలో దానితో ప్రత్యేకమైన బంధాన్ని పెంచుకుంటాడు.
    20 . క్షేమంగా వెళ్లి లాభంగా రండి(ఫిబ్రవరి 04 , 2000)
    U|172 minutes|హాస్యం
    రవి, రాంబాబు, జంబులింగం ఓ కార్ కంపెనీలో మెకానిక్‌లుగా పనిచేస్తుంటారు. పెళ్లాల మాట వినకుండా దుబారాగ ఖర్చు చేస్తుంటారు. అయితే తమ అవసరాల కోసం ఆ కంపెనీ ప్యూన్ బెజవాడ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేస్తారు. మరోవైపు ఉద్యోగాలు పొగొట్టుకుంటారు.

    @2021 KTree