Editorial List
రాజేంద్ర ప్రసాద్ టాప్ బెస్ట్ 15 సినిమాల లిస్ట్ ఇదే!
300+ views8 months ago
తెలుగు ఇండస్ట్రీలో తనదైన యూనిక్ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు TFIలో మరో హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో హస్య నట చక్రవర్తిగా ఆయన వెలుగొందారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న టాప్ చిత్రాలను ఓసారి చూద్దాం.
1 . మిస్టర్ పెళ్ళాం(సెప్టెంబర్ 05 , 1993)
U|129 mins|హాస్యం,డ్రామా
కుటుంబానికి మగాడే పెద్ద అని భావించే అహం భావం కలవాడు బాలజీ. కుటుంబం కోసం సంపాదించాల్సిన ప్రతిదాన్ని పురుషులు చేయగలరని భావిస్తాడు. అయితే అతని ఉద్యోగం పోయిన తర్వాత భార్య పని చేయాల్సి రావడంతో తన తప్పు తెలుసుకుంటాడు.
2 . రాంబంటు(సెప్టెంబర్ 08 , 1995)
U|152 mins|డ్రామా,మ్యూజికల్
రాంబంటు అసాధారణ శక్తులు కలిగిన ఒక సాధారణ వ్యక్తి. ప్రజలకు సహాయం చేయడానికి తన ప్రతిభను ఉపయోగిస్తాడు. గిరీశం అనే మోసగాడు రాంబంటు కుటుంబ జీవితాన్ని దుర్భరం చేస్తాడు. అప్పుడు రాంబంటు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
3 . మహానటి(మే 09 , 2018)
U|169 minutes|బయోగ్రఫీ,డ్రామా
దిగ్గజ నటి సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆమె ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? ఆమె జీవితంపై నటుడు జెమినీ గణేషన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? వంటి అంశాలను ఇందులో చూపించారు. సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించింది.
4 . కౌసల్య కృష్ణమూర్తి(ఆగస్టు 23 , 2019)
U|149 mins|డ్రామా,క్రీడలు
రైతు కూతురు అయిన కౌసల్య కృష్ణమూర్తి టీమిండియా తరఫున ఆడాలని కలలు కంటుంది. ఆమె తన కలను సాకారం చేసుకునే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నది అనేది కథ.
5 . నాన్నకు ప్రేమతో(జనవరి 13 , 2016)
UA|168 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
6 . జులాయి(ఆగస్టు 08 , 2012)
UA|152 minutes|యాక్షన్,హాస్యం
రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.
7 . మేడమ్(అక్టోబర్ 19 , 1994)
U|150 minutes|హాస్యం,డ్రామా
మేడమ్ అనేది 1994లో విడుదలైన భారతీయ తెలుగు భాషా హాస్య చిత్రం, ఇది సింగీతం శ్రీనివాసరావు రచన మరియు దర్శకత్వం వహించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ మరియు సౌందర్య నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. రాజేంద్ర ప్రసాద్ సమర్పణలో విజయ చాముండేశ్వరి మూవీస్ బ్యానర్‌పై ఎం. చిట్టి బాబు, జి. జ్ఞానమ్ హరీష్‌లు దీనిని నిర్మించారు. ఈ చిత్రం 19 అక్టోబర్ 1994న విడుదలైంది మరియు రెండు నంది అవార్డులను గెలుచుకుంది.
8 . కన్నయ్య కిట్టయ్య(జూన్ 11 , 1993)
U|145 mins|హాస్యం,ఫాంటసీ
సాధారణ యువకుడైన కిట్టయ్య తన మరదలు సరోజను ప్రేమిస్తాడు, కానీ అతని మేనమామ అతనిని ఒప్పుకోడు. నిరుత్సాహానికి గురైన కిట్టయ్య తనకు సహాయం చేయమని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు.
9 . రాజేంద్రుడు గజేంద్రుడు(ఫిబ్రవరి 04 , 1993)
U|152 mins|హాస్యం,డ్రామా
లాటరీ గెలిచిన తర్వాత, ఆ బహుమతి ఏనుగు అని తెలుసుకున్న రాజేంద్ర షాక్ అవుతాడు. పేదవాడు అయినప్పటికీ, అతను ఏనుగును పెంచాలని నిర్ణయించుకుంటాడు. కాలక్రమంలో దానితో ప్రత్యేకమైన బంధాన్ని పెంచుకుంటాడు.
10 . ఆ నలుగురు(డిసెంబర్ 09 , 2004)
U|140 mins|డ్రామా
రఘురామ్ నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్. ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే వాడు. అతని పిల్లలు వారు కోరుకున్న జీవితం ఇవ్వాలని పట్టుబట్టడంతో రఘురామ్ ఓ కఠిన నిర్ణయం తీసుకుంటాడు.
11 . మాయలోడు(జూలై 23 , 1993)
U|149 minutes|హాస్యం,డ్రామా
ధనవంతుడయ్యేందుకు జంట హత్యలు చేసిన అప్పలకొండ హత్య కేసులో మ్యాజిక్ కళాకారుడు వీరబాబు చిక్కుకుంటాడు. నిర్దోషిగా తనను తాను ఎలా నిరూపించుకున్నాడన్నది కథ
12 . ఏప్రిల్ 1 విదుదల(ఫిబ్రవరి 01 , 1991)
U|146 min|హాస్యం,థ్రిల్లర్
దివాకరమ్ పచ్చి అబద్ధాలకోరు. అందరి దగ్గర అప్పులు చేస్తూ కాలం గడుపుతుంటాడు. అయితే తన ప్రేయసి భువనేశ్వరి ప్రేమను గెలుచుకునేందుకు ఒక నెల వరకు ఎవరితో అబద్దాలు ఆడను అనే ఛాలెంజ్‌ను స్వీకరిస్తాడు.
13 . అప్పుల అప్పారావు(జనవరి 24 , 1992)
U|140 mins|హాస్యం,డ్రామా
అప్పులు చేసి జీవనం సాగించే అప్పారావు, సుబ్బలక్ష్మి ప్రేమలో పడుతాడు. అయితే, ఒక జ్యోతిష్యుడు సుబ్బ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే ఆమె చనిపోతుందని చెప్పడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
14 . లేడీస్ టైలర్(నవంబర్ 26 , 1986)
U|154 mins|హాస్యం,డ్రామా
సోమరి ట్రైలర్ సుందరం.. అదృష్టమే తనని ధనవంతుడ్ని చేస్తుందని నమ్ముతుంటాడు. కాలు మీద మచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుడు అవుతావని ఓ కోయ దొర చెప్తాడు. దీంతో ఆ అమ్మాయిని వెతికేందుకు సుందరం ఎలాంటి తిప్పలు పడ్డాడు అన్నది కథ.
15 . అహ నా-పెళ్లంట!(నవంబర్ 27 , 1987)
U|147 minutes|హాస్యం
ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు.