• TFIDB EN
  • Editorial List
    రామ్‌ పోతినేని టాప్ బెస్ట్ కామెడీ సినిమాలు ఇవే!
    Dislike
    30+ views
    1 month ago

    ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ అవలీలగా జీవించారు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన సినిమాల్లో రెడీ, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు హెలెరియస్‌గా ఉంటాయి. వీటితో పాటు మరికొన్ని కామెడీ చిత్రాల లిస్ట్ మీరు చూసేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఎందుకంటే... ప్రేమంట!(జూన్ 08 , 2012)
    U|155 minutes|డ్రామా,రొమాన్స్
    పారిస్‌ వెళ్లిన రామ్‌కు అక్కడ స్రవంతి ఆత్మ కనిపిస్తుంది. స్రవంతి చనిపోలేదని ఆమె శరీరం ఆస్పత్రిలో కోమాలో ఉందని తెలుస్తుంది. అయితే స్రవంతిని చంపాలని కొందరు చూస్తుంటారు? మరి రామ్‌ స్రవంతిని కాపాడాడా? స్రవంతి ఆత్మ ఆమె శరీరంలోకి వెళ్లిందా? లేదా? అన్నది కథ.
    2 . కందిరీగ(ఆగస్టు 12 , 2011)
    UA|160 minutes|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    శ్రీను - శ్రుతి కాలేజీలో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఓ రోజు అకస్మాత్తుగా రాజన్న శ్రుతిని కిడ్నాప్‌ చేస్తాడు. తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని శ్రీనుకి షరతు విధిస్తాడు. అప్పుడు శ్రీను ఏం చేశాడు? అన్నది కథ.
    3 . ఉన్నది ఒకటే జిందగీ(అక్టోబర్ 27 , 2017)
    U|152 minutes|డ్రామా,రొమాన్స్
    అభి, వాసు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కానీ వారిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడం వల్ల వారి స్నేహబంధం పరీక్షకు గురవుతుంది.
    4 . మస్కా(జనవరి 14 , 2009)
    UA|యాక్షన్
    క్రిష్ ఆడుతూ పాడుతూ కాలం వెళ్లదీసే యువకుడు. డబ్బున్న అమ్మాయిని పెళ్లిచేసుకుని లైఫ్ సెట్ చేసుకోవాలని భావిస్తుంటాడు. అయితే మీనాక్షి అనే అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు అతని కథ మలుపు తిరుగుతుంది.
    5 . నేనూ.. శైలజా...(జనవరి 01 , 2016)
    U|135 minutes|డ్రామా,రొమాన్స్
    హీరో హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. కానీ, హరి (రామ్‌) లవ్‌ను శైలజా (కీర్తి సురేష్‌) రిజెక్ట్ చేస్తుంది. అయితే దానికి కారణం ఏంటో తెలుసుకున్న హీరో ఏం చేశాడు? శైలజకు ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాడు? అన్నది కథ.
    6 . హలో గురు ప్రేమ కోసమే(అక్టోబర్ 18 , 2018)
    U|145 minutes|హాస్యం,రొమాన్స్
    సంజూ (రామ్‌ పోతినేని) జాబ్‌ కోసం హైదరాబాద్‌కు వస్తాడు. ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయిన విశ్వనాథ్‌ (ప్రకాష్‌రాజ్‌) ఇంట్లో గెస్ట్‌గా దిగుతాడు. ట్రైన్‌లో టీజ్‌ చేసిన అను (అనుపమా పరమేశ్వరన్‌)ని విశ్వనాథ్‌ కూతురని తెలిసి షాకవుతాడు. ఆమెపై ప్రేమను తెలుసుకునే లోపే విశ్వనాథ్‌ అనుకు ఇంకొకరితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    7 . రెడీ(జూన్ 19 , 2008)
    UA|175 minutes|హాస్యం,రొమాన్స్
    హీరో అనుకోకుండా హీరోయిన్‌ పెళ్లి చెడగొడతాడు. అయితే హీరోయిన్‌కు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విలన్ల నుంచి హీరోయిన్‌కు పొంచి ఉన్న ముప్పు ఏంటి? అన్నది కథ.
    8 . డబల్ ఇస్మార్ట్(ఆగస్టు 15 , 2024)
    UA|యాక్షన్,థ్రిల్లర్,సైన్స్ ఫిక్షన్
    మాఫియా డింపుల్ బిగ్‌ బుల్‌(సంజయ్ దత్‌) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్‌ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్‌ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్‌ బ్రేయిన్‌లోకి బిగ్‌ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? అనేది కథ
    9 . ఇస్మార్ట్ శంకర్(జూలై 18 , 2019)
    A|141 minutes|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
    ఇస్మార్ట్ శంకర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఓ రాజకీయ నాయకున్ని హత్య చేసి తన లవర్‌తో పారిపోతాడు. ఈ హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీస్‌ అధికారి అరుణ్ చనిపోతాడు. దీంతో పోలీసులు అరుణ్ మెమోరీని శంకర్‌కు అతనికి తెలియకుండా బదిలీ చేస్తారు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

    @2021 KTree