• TFIDB EN
  • Editorial List
    రావుగోపాల్‌రావు టాప్ 15 బెస్ట్ చిత్రాలు
    Dislike
    200+ views
    2 months ago

    తెలుగులో విలనిజాన్ని తనదైన మ్యానరిజంతో పతాక స్థాయికి తీసుకెళ్లారు రావుగోపాల్‌రావు. అప్పటి వరకు విలన్‌ అంటే భయంకరమైన రూపం, విచిత్ర వేషధారణ ఉండాలి అనే నియమాలను చెరిపేసి.. విలనిజానికి తన నటనతో ఆయన కొత్త రూపం ఇచ్చారు. ఆయన విలన్‌గా చేసిన పాత్రలు దేనికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఆయన నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ముత్యాల ముగ్గు(undefined 00 , 1975)
    U|165 min|డ్రామా
    ముత్యాల ముగ్గు అనేది రమణ మరియు బాపుల రచయిత-దర్శక ద్వయం నుండి ఉత్తర రామాయణం యొక్క 1975 భారతీయ తెలుగు భాషా నాటక చలన చిత్రం. ఈ చిత్రంలో సంగీత, శ్రీధర్, కాంతారావు, రావుగోపాలరావు, ముక్కామల, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ చిత్రం రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను కైవసం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. రావు గోపాల్ రావు తన పాత్రకు విస్తృత ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం హిందీలో జీవన్ జ్యోతి (1976)గా రీమేక్ చేయబడింది.
    2 . స్టేషన్ మాస్టర్(మార్చి 02 , 1988)
    U|131 mins|డ్రామా
    చైతన్య, రమ అనే ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. స్టేషన్‌మాస్టర్ మరియు అతని భార్య ఇద్దరు స్నేహితులకు స్వంత పిల్లలు లేకపోవడంతో వారిని దత్తత తీసుకుంటారు.
    3 . మనవూరి పాండవులు(నవంబర్ 09 , 1978)
    U/A|డ్రామా
    గ్రామ పెద్ద ఊరిలోని ప్రజలను పీడిస్తూ వారిని బాధపెడుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఐదుగురు యువకులు ఊరి పెద్దను ఎదిరిస్తారు.
    4 . అల్లూరి సీతారామ రాజు(మే 01 , 1974)
    U|187 minutes|యాక్షన్,డ్రామా
    స్వాతంత్య్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు.. రైతులు, గిరిజనుల పక్షాన నిలబడి బ్రిటిష్‌ వారికి ఎదురు తిరుగుతాడు. భూమి హక్కులను ఉల్లంఘించిన బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటుకు పిలుపునిస్తాడు.
    5 . కటకటాల రుద్రయ్య(అక్టోబర్ 11 , 1978)
    U|డ్రామా
    కటకటాల రుద్రయ్య 1978లో విడుదలైన భారతీయ తెలుగు భాషా చిత్రం, దాసరి నారాయణరావు రచన మరియు దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణంరాజు, జయసుధ, రామకృష్ణ, జయచిత్ర నటించారు. ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతం అందించారు. ఇది తమిళంలో శివాజీ గణేషన్‌తో పట్టక్కతి భైరవన్ (1979)గా మరియు హిందీలో (1980) జీతేంద్రతో జ్యోతి బనే జ్వాలాగా రీమేక్ చేయబడింది.
    6 . జస్టిస్ చౌదరి(మే 28 , 1982)
    U|155 minutes|డ్రామా
    జస్టిస్ చౌదరి 1982లో విడుదలైన భారతీయ తెలుగు-భాష యాక్షన్ డ్రామా చిత్రం, దీనిని T. త్రివిక్రమ రావు నిర్మించారు మరియు K. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో N. T. రామారావు మరియు శ్రీదేవి నటించారు, చక్రవర్తి సంగీతం అందించారు. ఈ చిత్రం హిందీలో జస్టిస్ చౌదరిగా, తమిళంలో నీతిబతిగా మరియు మలయాళంలో జస్టిస్ రాజాగా రీమేక్ చేయబడింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది మరియు రామారావు స్వంత బొబ్బిలి పులి తర్వాత 1982 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది.
    7 . ఆ ఒక్కటి అడక్కు(సెప్టెంబర్ 19 , 1992)
    U|155 mins|హాస్యం,డ్రామా
    సొమరి అయిన చిట్టి జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతాడు. అతను ఒక ధనవంతుడి కూతురితో ప్రేమలో పడతాడు. అయితే ఆమె తండ్రి పెట్టిన షరతును నెరవేర్చడానికి తన సోమరితనాన్ని వదిలిపెట్టి పనిచేయాల్సి వస్తుంది.
    8 . అల్లరి ప్రియుడు(మార్చి 05 , 1993)
    U|141 minutes|డ్రామా,రొమాన్స్
    లలిత, కవిత ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. కవిత రాజాతో ప్రేమలో పడుతుంది. ఒకరినొకరు చూడకుండానే ప్రేమించుకుంటారు. అయితే, రాజా లలితను కవిత అని తప్పుగా భావించి ప్రేమలో పడతాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది.
    9 . ఖైదీ(అక్టోబర్ 28 , 1983)
    A|157 minutes|యాక్షన్
    ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు.
    10 . వేటగాడు(జూలై 05 , 1979)
    U|149 mins|డ్రామా
    వేటగాడైన రామారావు.. శ్రీదేవిని ప్రేమిస్తాడు. అయితే శ్రీదేవి తండ్రి జగ్గయ్య వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. శ్రీదేవి తల్లి మరణానికి రామారావు తండ్రి కారణమని జగ్గయ్య భావిస్తుంటాడు. మరోవైపు శ్రీదేవిని పెళ్లి చేసుకోని ఆస్తి కొట్టేయాలని విలన్‌ కొడుకు యత్నిస్తుంటాడు. చివరికీ ఏమైంది? అన్నది కథ.
    11 . బొబ్బిలి పులి(జూలై 09 , 1982)
    A|176 mins|యాక్షన్,డ్రామా
    అవినీతి మయంగా మారిన ప్రభుత్వ రంగాన్ని తనదైన రీతిలో బాగు చేయాలని ఒక ఆర్మీ ఆఫీసర్ నిర్ణయించుకుంటాడు. అయితే పరిస్థితులు అతనికి సహకరించకపోవడంతో ఇబ్బందుల్లో పడుతాడు.
    12 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

    @2021 KTree