• TFIDB EN
  • మెగాస్టార్ చిరంజీవి ఫిల్మోగ్రఫీ గురించి మరింత చదవండి
    Dislike
    1 Likes 3k+ views
    7 months ago

    మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు 156 చిత్రాల్లో నటించారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ వంటి అనేక చిత్రాలు చేసి నటనలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అటు భక్తిరస చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల హృదయాలను గెలిచి చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగారు.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . Chiranjeevi Dual Role Movies: చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు
    ‘రజినీకాంత్ స్టైల్‌ని, కమల్ హాసన్‌ నటనని కలిపితే చిరంజీవి’ అని నాడు దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కితాబిచ్చారు. చిరంజీవి నటనా కౌశలానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. ఏ పాత్రనైనా ఆకళింపు చేసుకుని సులువుగా నటించేయగల సత్తా మెగాస్టార్‌ది. విభిన్న కోణాలున్న పాత్రలను చేయడంలోనూ దిట్ట. అందుకే చాలా చిత్రాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రలను చేశాడు. డ్యుయల్, ట్రిపుల్ రోల్‌లో నటించిన చిత్రాలేవో తెలుసుకుందాం.
    2 . Chiranjeevi Negative Roles Movies: చిరంజీవి ప్రతినాయక పాత్రలు పోషించిన చిత్రాలు
    కెరీర్‌లో 150కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. తన సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలను పోషించాడు. తొలి నాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించిన సందర్భాలున్నాయి. హీరోగానే కాకుండా, ప్రతి నాయక పాత్రల్లోనూ చిరంజీవి మెప్పించడం విశేషం. పాత్ర ఏదైనా నటుడిగా నిరూపించుకోవాలన్న తపన చిరంజీవిని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. చిరంజీవి నెగెటివ్ రోల్ చేసిన సినిమాలేంటో చూద్దాం.
    3 . Chiranjeevi Top 10 Action Movies: చిరంజీవి ఉత్తమ 10 యాక్షన్ చిత్రాలు
    చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నవ రసాలను తెరపై పండించగల నేర్పరి. అందులోనూ పోరాట సన్నివేశాల్లో తనదైన మ్యానరిజంను చూపించాడు. యాక్షన్ మూవీస్‌లో తన మార్క్ స్టైల్‌ని సెట్ చేసి ట్రెండ్ సృష్టించాడు. తన కెరీర్‌లో 150కు పైగా సినిమాలు చేశాడు చిరంజీవి. వీటిలో యాక్షన్ మూవీస్‌ని లెక్కపెట్టడం కాస్త కష్టమే. అయితే, జనాదరణను పొందిన యాక్షన్ మూవీస్ ఏంటో చూద్దాం.
    4 . Top 10 Chiranjeevi Movies: చిరంజీవి ఉత్తమ 10 చిత్రాలు ఇవే
    తెలుగు చిత్రసీమలో పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి. కొణిదెల శివ శంకర వరప్రసాద్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుప్రీం హీరోగా ఎదిగి మెగాస్టార్‌గా స్థిరపడ్డాడు. సినీ కెరీర్‌లో 150కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత మెగాస్టార్ సొంతం. ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకత. అందులో ఉత్తమ మైన చిత్రాలేంటో చెప్పడం కాస్త కష్టమే. నటన, సినిమాకు వచ్చిన ఆదరణ, విమర్శకుల ప్రశంసలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని సినిమాల పేర్లను ప్రస్తావించొచ్చు. అవేంటో చూద్దాం.
    5 . Chiranjeevi as Police Officer Movies: చిరంజీవి పోలీస్ పాత్రల్లో నటించిన సినిమాలు
    మెగాస్టార్ చిరంజీవి చెయ్యని పాత్రంటూ లేదు. ఏ పాత్ర చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటాడు. తన కెరీర్‌‌లో ఎన్నో పోలీసాఫీసర్ పాత్రలు పోషించాడు. ఓ పోలీస్ అధికారికి ఉండే హుందా తనాన్ని చక్కగా ప్రదర్శిస్తూ అభినయం పండించేవాడు చిరంజీవి. డైలాగుల్లోనూ గాంభీర్యాన్ని చూపేవాడు. అలా చిరంజీవి పోలీస్ అధికారి పాత్రలు పోషించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. చిరు పోలీస్ ఆఫీసర్‌గా చేసిన సినిమాలు ఇవే.
    6 . Top 10 Chiranjeevi Comedy Movies: చిరంజీవి టాప్ 10 కామెడీ చిత్రాలు
    చిరంజీవి కామెడీ టైమింగే వేరు. ‘హలో మాస్టారూ’ అన్నా, ‘ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో’ అని చెప్పినా కామెడీ పండాల్సిందే. సీరియస్ టోన్‌లోనూ కడుపుబ్బా నవ్వించే సత్తా చిరంజీవి సొంతం. స్క్రీన్‌పై వేరియేషన్లను చూపిస్తూ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయగలడు ఈ మెగాస్టార్. తన కెరీర్‌లో చేసిన 150కు పైగా సినిమాల్లో కామెడీ డోజున్న చిత్రాలు ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
    7 . Chiranjeevi Top 10 Family Movies: చిరంజీవి టాప్ 10 ఫ్యామిలీ మూవీస్
    చిరంజీవికి ప్రత్యేమమైన ఫ్యామిలీ ఆడియెన్స్ ఉంటారు. సినిమా కథల ఎంపికలో చిరంజీవి ఫ్యామిలీ మూవీస్‌కి ప్రాధాన్యం ఇస్తాడు. సెంటిమెంట్, ఎమోషన్స్‌ని పండించడంలోనూ మెగాస్టార్‌కు సాటిరారంటే అతిశయోక్తి కాదు. తండ్రిగా, కొడుకుగా, అన్నయ్యగా, తమ్ముడిగా, అల్లుడిగా.. ఇలా చిరు నటించిన పాత్ర లేదు. అన్నింట్లోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుడితో కంటతడి పెట్టించగలడు. 150కు పైగా సినిమాలలో ఎన్నో చిత్రాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కి దగ్గరయ్యాయి. అందులో టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.

    @2021 KTree