
Prabhas Top Action Movies: ప్రభాస్ విశ్వరూపం చూపించిన టాప్ యాక్షన్ చిత్రాలు
3k+ views1 year ago
బాహుబలి-2 చిత్రం తర్వాత ప్రభాస్‌కు ఇండియా రెంజ్ గుర్తింపు లభించింది. అంతక ముందు కూడా మిర్చి, రెబల్, వంటి ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి ప్రభాస్ మాస్ జాతర అంటే ఎలా ఉంటుందో చూపించాడు.

1 . బాహుబలి: ది బిగినింగ్(జూలై 10 , 2015)
UA|యాక్షన్,డ్రామా,హిస్టరీ
మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు... ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు.

2 . బాహుబలి 2: ది కన్‌క్లూజన్(ఏప్రిల్ 28 , 2017)
UA|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి తన వారసత్వం గురించి కట్టప్ప ద్వారా తెలుసుకుంటాడు. మాహిష్మతి సింహాసనాన్ని అధిష్టించేందుకు.. భళ్లాలదేవుడితో యుద్ధంలో పోరాడుతాడు.
.jpeg)
3 . వర్షం(జనవరి 14 , 2004)
U|యాక్షన్,రొమాన్స్
వెంకట్, శైలజ రైలులో కలుసుకుని ప్రేమలో పడతారు. కానీ శైలజ తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. ఆమెను ఇష్టపడ్డ భద్రన్న అనే పెద్ద రౌడీతో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు.

4 . కల్కి 2898 ఎ.డి(జూన్ 27 , 2024)
UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్ యష్కిన్ (కమల్ హాసన్) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
.jpeg)
5 . మిర్చి(ఫిబ్రవరి 08 , 2013)
A|యాక్షన్
ఈ సినిమా కథ జై అనే యువకుడి చూట్టూ తిరుగుతుంది. తన ఊరు, కుటుంబంతో శతృత్వం ఉన్న ఓ కుటుంబాన్ని మార్చేందుకు వారి ఇంటికి వెళ్తాడు. కానీ అతనేవరో ఆ కుటుంబానికి తెలిసిపోతుంది
.jpeg)
6 . బిల్లా(ఏప్రిల్ 03 , 2009)
A|యాక్షన్,థ్రిల్లర్
అంతర్జాతీయ నేరస్థుడు బిల్లాలాగే చిల్లర దొంగ రంగా ఉంటాడు. అతన్ని చూసిన ఏసీపీ కృష్ణ మూర్తి చనిపోయిన బిల్లా స్థానంలో రంగాను పంపించి మాఫియా రహస్యాలను కనుగొనాలని నిర్ణయించుకుంటాడు.

7 . సలార్(డిసెంబర్ 22 , 2023)
UA|థ్రిల్లర్,యాక్షన్
ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజ మన్నార్ (జగపతిబాబు) రూలర్. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఖాన్సార్‌కు రూలర్ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్) సాయం కోరతాడు. ఆ ఒక్కడు అంతమంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.

8 . బుజ్జిగాడు(మే 22 , 2008)
UA|యాక్షన్,డ్రామా
బుజ్జి రజనీకాంత్ ఫ్యాన్. చిన్నప్పుడు ఇంటి పక్కన ఉండే చిట్టితో గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. 12 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన బుజ్జి.. చిట్టిని వెత్తుకుంటూ వెళ్తాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ.

9 . ఆదిపురుష్(ఆగస్టు 11 , 2023)
UA|యాక్షన్,అడ్వెంచర్,మైథలాజికల్
ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ

10 . సాహో(ఆగస్టు 30 , 2019)
UA|యాక్షన్,థ్రిల్లర్
వాజీ అనే నగరం కేంద్రంగా గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలను సిండికేట్‌గా రాయ్( జాకీ ష్రాప్) నిర్వహిస్తుంటాడు. అండర్‌వరల్డ్‌ను చేజిక్కించుకోవాలని దేవరాజ్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రాయ్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత అతని కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్‌లోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ