• TFIDB EN
  • Editorial List
    రేలంగి నటించిన టాప్ 10 బెస్ట్ చిత్రాలు
    Dislike
    300+ views
    6 months ago

    తెలుగులో తొలితరం హాస్య నటుల్లో రేలంగి ఒకరు. తనదైన మేనరిజంతో హస్యం సృష్టించడంలో ఆయన కొత్త ఒరవడిని సృష్టించారు. ఇది ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది నటులకు మార్గదర్శం అయింది. ఆయన కేవలం హాస్య నటుడిగానే మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను గుర్తింపు పొందారు. రేలంగి నటించి టాప్ 10 బెస్ట్ సినిమాలపై ఓ లుక్‌ వేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మిస్సమ్మ(జనవరి 12 , 1955)
    U|181 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
    ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు.
    2 . అప్పు చేసి పప్పు కూడు(జనవరి 14 , 1959)
    U|158 minutes|హాస్యం,డ్రామా
    ముకుందరావు లక్షాధికారి. అతని కూతురు మంజరి దేశభక్తుడైన రాజారావును ప్రేమిస్తుంది. మరోవైపు రాజారావు చెల్లెల్ని ఆమె మామ ఇంటి నుంచి తరిమేస్తాడు. విదేశాల నుంచి వచ్చిన కొడుక్కి లీల చనిపోయినట్లు అబద్ధం చెప్తాడు. చివరికీ ఏమైంది అన్నది కథ.
    3 . వెలుగు నీడలు(జనవరి 07 , 1961)
    U|డ్రామా
    సుగుణ అనే వైద్యురాలు క్షయవ్యాధితో బాధపడుతున్న చంద్రంను ప్రేమిస్తుంది. అయితే సుగుణను, రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చంద్రం బలవంతం చేస్తాడు. కానీ చంద్రం వ్యాధి నయం అవుతుంది. ఈలోపు సుగుణ భర్త మరణిస్తాడు.
    4 . ప్రేమించి చూడు(జూన్ 24 , 1965)
    U|160 mins|డ్రామా
    ఒక అపార్థం కారణంగా తన యజమాని పిల్లల వల్ల రంగా తన ఉద్యోగం కోల్పోతాడు. అయితే, రంగా అతని యజమాని కుమార్తెను పెళ్లి చేసుకున్నాక కథ మలుపు తిరుగుతుంది.
    5 . సువర్ణ సుందరి(మే 10 , 1957)
    U|208 minutes|డ్రామా,మ్యూజికల్
    ఒక దేవదూత, మానవ రాకుమారుడు ప్రేమలో పడతాడు. కాని ఇంద్రుని శాపం వారిని వేరు చేస్తుంది. తిరిగి ఒక్కటయ్యే క్రమంలో వారికి అనేక సవాళ్లు ఎదురవుతాయి.
    6 . జగదేక వీరుని కథ(ఆగస్టు 09 , 1961)
    U|187 minutes|డ్రామా
    నలుగురు దేవకన్యలను వివాహం చేసుకోవాలనే ప్రతాప్ కోరిక అతనిని కష్టాల్లో పడేస్తుంది. ఎందుకంటే అతను శాపానికి గురికావడమే కాకుండా తన తండ్రి రాజ్యంలో స్థానం కూడా కోల్పోతాడు.
    7 . జయభేరి(ఏప్రిల్ 09 , 1959)
    U|110 minutes|డ్రామా
    సంగీత శాస్త్ర కోవిదుడైన విశ్వనాథుడు వద్ద అతని తమ్ముడు కాశీనాథ్(అక్కినేని) సంగీతం నేర్చుకుని గురువును మించిన శిష్యుడు అవుతాడు. బచ్చెన భాగవతుల ప్రదర్శన చూడడానికి వెళ్ళిన కాశీనాథ్.. ఆ ప్రదర్శనలో ప్రధాన పాత్ర వహించి, సవాలు చేసిన మంజుల (అంజలీదేవి)తో ప్రతిసవాలు చేస్తాడు. వారిద్దరి మధ్యా జరిగిన సంగీతపరమైన వివాదం ప్రేమకు దారితీస్తుంది. పెద్దలను ఎదురించి మంజులను కాశీనాథ్ పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కథ మలుపు తిరుగుతుంది.
    8 . లవ కుశ(మార్చి 29 , 1963)
    U|208 min|డ్రామా,మ్యూజికల్
    రాముడు గర్భవతి అయిన సీతను వనవాసానికి పంపినప్పుడు ఆమె కవల కుమారులకు జన్మనిస్తుంది. వారు పెద్దయ్యాక అశ్వమేధ యజ్ఞానికి అంతరాయం కలిగించడానికి అయోధ్యకు వెళ్లినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
    9 . మాయాబజార్(మార్చి 27 , 1957)
    U|184 minutes(Telugu)174 minutes(Tamil)|హాస్యం,డ్రామా,మైథలాజికల్
    బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
    10 . నర్తనశాల(అక్టోబర్ 11 , 1963)
    U|174 minutes|డ్రామా,మ్యూజికల్
    పాండవులు 13 సంవత్సరాల వనవాసాన్ని ముగించి, విజయదశమి వరకు తమ నిజస్వరూపాన్ని దాచుకోవాలి. అర్జున్ కుమారుడు, అభిమన్యు, విరాట కుమార్తె ఉత్తరాతో ప్రేమలో పడతాడు, కానీ అతని గుర్తింపును వెల్లడించలేదు.

    @2021 KTree