Editorial List
సందీప్ కిషన్ టాప్ హిట్ చిత్రాలు ఇవే!
300+ views9 months ago
తెలుగులో ఫలితంతో సంబంధం లేకుండా నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. డిఫరెంట్ జనర్స్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అతని చేసిన సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలను ఓసారి చూద్దాం
1 . నిను వీడని నీడను నేనే(జూలై 12 , 2019)
UA|రొమాన్స్,థ్రిల్లర్
రిషి, దియా కొత్తగా పెళ్ళైన జంట. ఓ రోజు వారు ప్రయాణిస్తున్న కారు స్మశానం వద్ద ప్రమాదానికి గురవుతుంది. అప్పటి నుంచి వారి జీవితం తలకిందులవుతుంది.
2 . శమంతకమణి(జూలై 14 , 2017)
U|127 mins|థ్రిల్లర్
ఈ సినిమా కథ శమంతకమణి అనే కోట్లలో విలువ చేసే కారు చుట్టూ తిరుగుతుంది. అయితే ఒక పెద్ద ఈవెంట్‌లో ఈ కారు దొంగిలించబడుతుంది. ఈ కేసు విచారణకు దర్యాప్తు అధికారిని నియమించడంతో కథ మలుపు తిరుగుతుంది.
3 . టైగర్(జూన్ 26 , 2015)
UA|120 minutes|యాక్షన్,థ్రిల్లర్,రొమాన్స్
రాజమండ్రిలోని ఓ అనాథాశ్రమంలో పెరిగిన టైగర్, విష్ణు మంచి స్నేహితులు. విష్ణు కోసం టైగర్ ఎంత దూరమైనా వెళతాడు. కాలేజీలో గంగా అనే యువతిని విష్ణు లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత విష్ణు చావు బతుకుల మధ్య ఉన్నాడని టైగర్‌కు తెలుస్తుంది. అసలు విష్ణు అలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్లాడు అన్నది కథ.
4 . బీరువా(జనవరి 23 , 2015)
UA|141 minutes|హాస్యం,రొమాన్స్
బిరువా సినిమాలో సందీప్ కిషన్, తన సమస్యలను దాచడానికి ఒక బీరువాను వాడుతాడు. ఈక్రమంలో జరిగే ఘటనలు కామెడీ పుట్టిస్తాయి.
5 . వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(నవంబర్ 29 , 2013)
U|హాస్యం,రొమాన్స్
హీరో (సందీప్) అన్న అయిన బ్రహ్మాజీ పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం అందరూ హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌లో తిరుపతికి బయలుదేరుతారు. ఆ ట్రైన్‌లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి? అసలు ప్రార్థన ఎవరు? అన్నది కథ.
ఈ చిత్రం సందీప్ కెరీర్‌లో సూపర్ హిట్ అందించడంతో పాటు స్టార్ డం అందించింది.
ఈ చిత్రం సందీప్ కెరీర్‌లో సూపర్ హిట్ అందించడంతో పాటు స్టార్ డం అందించింది.