Editorial List
సత్యదేవ్ నటించి టాప్ హిట్ సినిమాలు
300+ views9 months ago
తెలుగు టాలెంటెడ్ యాక్టర్స్‌లో విలక్షణ నటుడిగా పెరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన కొద్ది మంది యువ హీరోల్లో సత్యదేవ్ ఒకడు. అతను నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ చిత్రాలపై ఓలుక్ వేద్దాం.
1 . తిమ్మరుసు: అసైన్‌మెంట్ వల్లి(జూలై 30 , 2021)
UA|క్రైమ్,థ్రిల్లర్
లాయర్ రామ్ (సత్యదేవ్) ఓ హత్య కేసులో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వాసు (అంకిత్) కేసు రీఓపెన్ చేయిస్తాడు. ఈ కేసులో పోలీసు అధికారి భూపతిరాజు (అజయ్) పాత్ర ఏంటి? క్యాబ్ డ్రైవర్ హత్య వెనక ఎవరున్నారు? నేరస్తులను రామ్ ఎలా పట్టించాడు? అన్నది కథ.
2 . ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య(జూలై 30 , 2020)
U|135 minutes|డ్రామా
ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది కథ.
3 . జార్జి రెడ్డి(నవంబర్ 22 , 2019)
UA|153 minutes|బయోగ్రఫీ,డ్రామా
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడైన జార్జ్ రెడ్డి సమాజంలో జరుగుతున్న అన్యాయం, ఆర్థిక అసమానతలపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకుంటాడు. తన పోరాట క్రమంలో ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొన్నాడు అనేది కథ.
4 . బ్లఫ్ మాస్టర్(డిసెంబర్ 28 , 2018)
UA|138 minutes|హాస్యం,థ్రిల్లర్
ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) ప్రజలను మోసం చేస్తుంటాడు. అవని (నందిత శ్వేత) తన జీవితంలోకి అడుగుపెట్టాక మారతాడు. అయితే అతడికి పశుపతి (ఆదిత్య మీనన్) రూపంలో కొత్త సమస్య ఎదురవుతుంది. దాన్ని హీరో ఎలా అధిగమించాడు? అన్నది కథ.
5 . జ్యోతి లక్ష్మి(జూన్ 12 , 2015)
UA|డ్రామా
ఇది జ్యోతి లక్ష్మి అనే వేశ్య జీవితం మీద ఆధారపడింది, ఆమె తన వృత్తిని వదిలి మంచి జీవితాన్ని కోరుకుంటుంది. ఈ చిత్రం ఆమె సమాజంలో ఎదుర్కొనే సమస్యలు మరియు ఆమె గౌరవప్రయాణంను చూపిస్తుంది.
6 . అసుర(జూన్ 05 , 2015)
UA|122 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
ఇందులో నారా రోహిత్ న్యాయం, నైతిక విలువలతో నిండిన జైలు అధికారి పాత్రలో నటించారు. జైలులో చట్టాన్ని అమలు చేయడంతో అతను అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.