Editorial List
సిద్ధు జొన్నలగడ్డ టాప్ హిట్ చిత్రాలు
300+ views8 months ago
సిద్ధు జొన్నలగడ్డకు నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. హీరోగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. సిద్ధు నటించిన చిత్రాల్లో ప్రేక్షకులకు దగ్గరైన చిత్రాలను ఓసారి చూద్దాం
1 . ఐస్ క్రీమ్ 2(నవంబర్ 21 , 2014)
A|హారర్,రొమాన్స్,థ్రిల్లర్
ఐదుగురు ఫ్రెండ్స్ షార్ట్‌ఫిల్మ్ తీసేందుకు అడవిలోని గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వారికి వింత అనుభూతులు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారిని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా చనిపోవడానికి కారణం ఏంటి? అన్నది కథ.
2 . LBW: లైఫ్ బిఫోర్ వెడ్డింగ్(ఫిబ్రవరి 18 , 2011)
U|రొమాన్స్
జై, రిషి ఇద్దరు ప్రాణ స్నేహితులు, అనును కలుసుకుని ఆమెతో ప్రేమలో పడతారు కానీ ఆమె జైని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంటుంది. మరి రిషి వీరి ప్రేమను అంగీకరించాడా? రిషి ఏం చేశాడు అన్నది కథ.
3 . భీమిలి కబడ్డీ జట్టు(జూలై 09 , 2010)
U|డ్రామా
కబడ్డీ ఆడే సూరి తన గ్రామానికి వచ్చిన ఓ యువతితో ప్రేమలో పడతాడు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించినప్పుడు, టైటిల్ గెలవడానికి సూరి, అతని స్నేహితులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
4 . డీజే టిల్లు(ఫిబ్రవరి 12 , 2022)
UA|124 minutes|హాస్యం,రొమాన్స్
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఈ చిత్రం సిద్ధు కెరీర్‌లో సూపర్ హిట్ అందించడంతో పాటు స్టార్ డం అందించింది.
ఈ చిత్రం సిద్ధు కెరీర్‌లో సూపర్ హిట్ అందించడంతో పాటు స్టార్ డం అందించింది.
5 . గుంటూరు టాకీస్(మార్చి 04 , 2016)
A|158 min|హాస్యం,రొమాన్స్
గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ.
ఈ చిత్రం ద్వారా సిద్ధు జొన్నల గడ్డకు గుర్తింపు లభించింది.
ఈ చిత్రం ద్వారా సిద్ధు జొన్నల గడ్డకు గుర్తింపు లభించింది.